Swiggy Kitchens: క్లౌడ్ కిచెన్ బిజినెస్ నుంచి తప్పుకుంటున్న స్విగ్గీ..
Swiggy Kitchens: క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించిన స్విగ్గీ.. ఇప్పుడు ఆ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుంది.
Swiggy sells it's cloud Kitchen: ఫుడ్ డెలివరీ బిజినెస్ లో అగ్రగామిగా ఉన్న స్విగ్గీ (Swiggy) క్లౌడ్ కిచెన్ బిజినెస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. తన క్లౌడ్ కిచెన్ బిజినెస్ ను ఈ రంగంలో తమకు ప్రధాన పోటీదారుగా ఉన్న ‘కిచెన్స్ ఎట్ (Kitchens@)’ కు విక్రయించేందుకు డీల్ కుదుర్చుకుంది.
Swiggy sells it's cloud Kitchen: 2017లో ప్రారంభం..
ప్రస్తుతం భారత్ లో క్లౌడ్ కిచెన్ బిజినెస్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈ బిజినెస్ లోకి స్విగ్గీ 2017లోనే ఎంటర్ అయింది. అప్పుడు ‘యాక్సెస్ కిచెన్స్ (Access Kitchens)’ పేరుతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే, క్లౌడ్ కిచెన్ ను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లింది స్విగ్గీనే. అయితే, తాజాగా, ఆ క్లౌడ్ కిచెన్ బిజినెస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న స్విగ్గీ.. తన ‘యాక్సెస్ కిచెన్స్ (Access Kitchens)’ ను ‘కిచెన్స్ ఎట్ (Kitchens@)’ కు విక్రయించింది. షేర్ల బదిలీ విధానంలో ఈ డీల్ కుదిరినట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. ఈ డీల్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
Swiggy partners with Kitchens@):‘కిచెన్స్ ఎట్’ లో భాగస్వామి
స్విగ్గీ ‘యాక్సెస్ కిచెన్స్ (Access Kitchens)’ ద్వారా రెస్టారెంట్ పార్ట్ నర్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆ పార్ట్ నర్ రెస్టారెంట్స్ తమ బ్రాంచెస్ లేని ప్రాంతాల్లో ఎక్స్ క్లూజివ్ గా కిచెన్ స్పేస్ ను ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాల్లోని పాపులర్ వంటలను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ కిచెన్ స్పేస్ లోని వంటలు కేవలం స్విగ్గీ కస్టమర్లకే ప్రత్యేకం. ఈ విధానం ద్వారా వివిధ రకాల వంటకాలు స్విగ్గీ కస్టమర్లకు అందుబాటులో ఉండడంతో పాటు, ఫ్రెష్ ఫుడ్ ను డెలివరీ చేసే టైం కూడా చాలా తగ్గుతుంది. ఇక్కడ డైనింగ్ సదుపాయం ఉండదు. కేవలం ఫుడ్ పార్సిల్స్ డెలివరీ మాత్రమే ఉంటుంది. దాదాపు ఇదే మోడల్ ను ఇప్పుడు స్విగ్గీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ను కొనుగోలు చేసిన కిచెన్స్ ఎట్ Kitchens@’ కూడా ఫాలో అవుతోంది. ఇప్పుడు షేర్ల బదిలీ ద్వారా జరిగిన ఈ డీల్ తో కిచెన్స్ ఎట్ (Kitchens@) లో స్విగ్గీ కూడా భాగస్వామిగా మారినట్లయింది.