Stocks to buy today : స్టాక్స్​ టు బై.. జొమాటోకు టైమ్​ వచ్చింది! ఇప్పుడు కొంటే భారీ లాభాలు!-day trading guide m m techm to zomato 6 stocks to buy today 11th april 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. జొమాటోకు టైమ్​ వచ్చింది! ఇప్పుడు కొంటే భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. జొమాటోకు టైమ్​ వచ్చింది! ఇప్పుడు కొంటే భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Apr 11, 2023 06:44 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 13 పాయింట్లు పెరిగి 59,846 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 17,624 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 206 పాయింట్లు కోల్పోయి 40,834 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ50 ఇంకా అప్​ట్రెండ్​లోనే ఉంది. కానీ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి!

Stock market news today : "6 సెషన్స్​ పాటు పెరిగిన తర్వాత నిఫ్టీకి ఓపికైపోయినట్టు కనిపిస్తోంది! ప్రస్తుతానికైతే అప్​ట్రెండ్​లోనే ఉంది. కానీ ఇక్కడి నుంచి ప్రతికూలంగా మారొచ్చు. షార్ట్​ టర్మ్​ ట్రేడర్స్​.. ఈ లెవల్స్​లో ప్రాఫిట్​ బుకింగ్​ మొదలుపెట్టొచ్చు. 17,530- 17,772 లెవల్స్​లో మరో 1-2 సెషన్స్​ నిఫ్టీ కొనసాగొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ రీటైల్​ రీసెర్చ్​ హెడ్​ దీపక్​ జసానీ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

US Stock market news today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు సైతం ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.3శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.1శాతం పెరగ్గా, నాస్​డాక్​ 0.03శాతం నష్టపోయింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 882.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 351.5 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

స్టాక్స్​ టు బై:-

M&M share price target : మహీంద్రా అండ్​ మహీంద్రా (ఎం అండ్​ ఎం):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1170, టార్గెట్​ రూ. 1210- రూ. 1225

TechM share price target : టెక్​ మహీంద్రా (టెక్​ఎం):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1090, టార్గెట్​ రూ. 1130- రూ. 1140

బీపీసీఎల్​:- బై రూ. 336, స్టాప్​ లాస్​ రూ. 328, టార్గెట్​ రూ. 348

బజాజ్​ ఎలక్ట్రికల్స్​:- బై రూ. 1050, స్టాప్​ లాస్​ రూ. 1033, టార్గెట్​ రూ. 1075

Zomato share price target in Telugu : జొమాటో:- బై రూ. 54, స్టాప్​ లాస్​ రూ. 51.80, టార్గెట్​ రూ. 58

రెడింగ్టన్​:- బై రూ. 175, స్టాప్​ లాస్​ రూ. 170, టార్గెట్​ రూ. 185

(గమనిక:- ఇవి నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం