Swing Trading : స్వింగ్​ ట్రేడింగ్.. స్టాక్​ మార్కెట్​లో ఇది సామాన్యుడి 'ఆయుధం'!-all you need to know about swing trading and stock market news today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Swing Trading : స్వింగ్​ ట్రేడింగ్.. స్టాక్​ మార్కెట్​లో ఇది సామాన్యుడి 'ఆయుధం'!

Swing Trading : స్వింగ్​ ట్రేడింగ్.. స్టాక్​ మార్కెట్​లో ఇది సామాన్యుడి 'ఆయుధం'!

Sharath Chitturi HT Telugu
Jul 23, 2022 07:34 AM IST

Swing Trading : స్వింగ్​ ట్రేడింగ్​ అనేది ఓ పవర్​ఫుల్​ ఆయుధం లాంటిది. ఇది ట్రేడర్లకే కాదు.. 9-5 జాబ్​ చేస్తూ మార్కెట్లను ట్రాక్​ చేయలేకపోతున్న సామాన్యులకు, కాలేజీలకు వెళుతున్న విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. దీనిని సెకెండ్​ ఇన్​కమ్​లాగా కూడా పరిగణించవచ్చు. స్వింగ్​ ట్రేడింగ్​ గురించి పూర్తి వివరాలు..

<p>‘స్వింగ్​ ట్రేడింగ్'​.. ట్రేడర్లకు ఇది ఓ పవర్​ఫుల్​ ఆయుధం!</p>
‘స్వింగ్​ ట్రేడింగ్'​.. ట్రేడర్లకు ఇది ఓ పవర్​ఫుల్​ ఆయుధం! (iStock)

Swing Trading : 'స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు', 'రూ. కోట్లల్లో పెరిగిన మదుపర్ల సంపద'.. ఇలాంటి వార్తలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చూసి.. 'నాకు కూడా స్టాక్​ మార్కెట్​ నుంచి డబ్బులు సంపాదించాలని ఉంది. కానీ నా 9-5 జాబ్​లో మార్కెట్లను ట్రాక్​ చేయడం కష్టం,' ‘ఛాన్స్​ మిస్​ అయిపోతున్నా..’ అని మీరు నిరుత్సాహపడుతున్నారా? అయితే మీరు 'స్వింగ్​ ట్రేడింగ్​' గురించి తెలుసుకోవాల్సిందే.

స్వింగ్​ ట్రేడింగ్​ అంటే ఏంటి?

సాధారణంగా స్టాక్స్​ అనేవి ఒకే చోట స్థిరంగా ఉండవు. ప్రస్తుత ధర నుంచి పైకి లేదా కిందకి, లేదా వాటి మధ్యలో కదులుతూ ఉంటాయి. అందువల్ల ఓ స్టాక్​ ట్రెండ్​ని గమనించి, స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​'.

ఇంట్రాడే ట్రేడింగ్- స్వింగ్​ ట్రేడింగ్​ అనేవి వినడానికి ఒకే విధంగా ఉన్నా.. వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్​లో ట్రేడ్​ను అదే రోజు క్లోజ్​ చేయాల్సి ఉంటుంది. కానీ స్వింగ్​ ట్రేడింగ్​లో అలా కాదు. సాధారణంగా.. స్వింగ్​ ట్రేడింగ్​ అనేది రెండు రోజులు- 2,3 వారాల మధ్యలో ఉంటుంది.

What is Swing Trading ? అదే సమయంలో 'టైమ్​ఫ్రేమ్​'లు కూడా వేరుగా ఉంటాయి. ఇంట్రాడే​ ట్రేడింగ్​లో 30నిమిషాలు, 15నిమిషాలు, 5నిమిషాలను చూస్తూ ఉంటారు ట్రేడర్లు. పెద్ద టైమ్​ఫ్రేమ్​లతో వారికి పెద్దగా పనిలేదు. కానీ స్వింగ్​ ట్రేడింగ్​లో సాధారణంగా టైమ్​ఫ్రేమ్​ 1 గంట, 4గంటలు, ఒక రోజుగా ఉంటుంది.

సాధారణంగా.. స్టాక్​ మార్కెట్​ అంటేనే రిస్కీ వ్యవహారం. కానీ ఎంత తక్కువ టైమ్​ ఫ్రేమ్​ ఉంటే అంత ఎక్కువ రిస్క్​ తీసుకుంటున్నట్టు. దీనితో పోల్చుకుంటే.. ఇంట్రాడే ట్రేడింగ్​ కన్నా స్వింగ్​ ట్రేడింగ్​లో రిస్క్​ అనేది కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.

స్వింగ్​ ట్రేడింగ్​తో లాభమేటి?

వాస్తవానికి స్వింగ్​ ట్రేడింగ్​ అనేది స్టాక్​ మార్కెట్​లో ట్రేడర్లకు ఓ పవర్​ఫుల్​ ఆయుధం లాంటిది. స్వింగ్​ ట్రేడింగ్​తో రూ. కోట్లల్లో సంపాదిస్తున్న ట్రేడర్లు ఎందరో ఉన్నారు.

Swing Trading in telugu : స్వింగ్​ ట్రేడింగ్​ అనేది సామాన్యులకు కూడా ఎంతో ఉపయోగపడే విషయం. ఇది సెకెండ్​ ఇన్​కమ్​లాగా కూడా పరిగణించవచ్చు. స్వింగ్​ ట్రేడింగ్​ గురించి సామాన్యులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇంట్రాడే ట్రేడింగ్​లో చాలా ఫోకస్డ్​గా ఉండాలి. ప్రతి రోజు(ట్రేడ్​ తీసుకుంటే.. ప్రతి నిమిషం) స్టాక్స్​ని ట్రాక్​ చేస్తూ ఉండాలి. సాధారణ 9-5 ఉద్యోగాలు చేసుకునేవారు ఇంట్రాడే చేయలేరు. వారు ఇంటికి తిరిగివచ్చేసరికే స్టాక్​ మార్కెట్ల టైమ్​ అయిపోతుంది. అలాంటి వారికి 'స్వింగ్​ ట్రేడింగ్​' అనేది ఉత్తమం.

స్వింగ్​ ట్రేడింగ్​పై పట్టుసాధిస్తే.. ఇంట్రాడే విధంగా దానిపై అంత ఫోకస్​ పెట్టాల్సిన అవసరం లేదు. మన ఎనాలసిస్​ను నమ్ముకుని.. స్టాక్​లో ఎంట్రీ, ఎగ్జిట్​, స్టాప్​లాస్​ను ముందే ప్లాన్​ చేసుకోవచ్చు. ఏఎంఓ(ఆఫ్టర్​ మార్కెట్​ ఆర్డర్​)ను ముందు రోజే ఫిక్స్​ చేసుకుంటే.. మనం ఆఫీసులో ఉన్నా అనుకున్న ఎంట్రీ దగ్గర స్టాక్​ కొనుగోలు చేయడానికి ఉంటుంది. స్వింగ్​ ట్రేడింగ్​లో మన ట్రేడ్స్​ని తరచూ ట్రాక్​ చేయాల్సి ఉంటుంది. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాక.. రాత్రి పూట ఒక 30నిమిషాల నుంచి గంట సేపు సమయం కేటాయిస్తే సరిపోతుంది!

స్వింగ్​ ట్రేడింగ్​ ఎలా చేయాలి?

Swing Trading strategies : స్వింగ్​ ట్రేడింగ్​ చేయాలంటే ముందు టెక్నికల్​ ఎనాలసిస్​పై పట్టుసాధించాల్సి ఉంటుంది. స్టాక్స్​ ఛార్ట్​లను అర్థం చేసుకోవాలి. కొంత కాలం వాటిని ట్రాక్​ చేస్తూ ఉండాలి. స్టాక్​ అనేది ఏ ట్రెండ్​లో ఉంది? అని తెలుసుకోవాలి. మనకంటూ ఒక సెటప్​ ఏర్పాటు చేసుకోవాలి.

స్వింగ్​ ట్రేడింగ్​ చేసేందుకు కొన్ని ప్రత్యేక స్ట్రాటజీలు ఉంటాయి. కొందరు 'ఇండికేటర్ల' ఆధారంగా స్వింగ్​ ట్రేడ్​ తీసుకుంటారు. మరికొందరు 'ఛార్ట్​ పాటర్న్​' ఆధారంగా స్వింగ్​ ట్రేడింగ్​ చేస్తూ ఉంటారు. ఇంకొందరు.. ఆ రెండింటినీ కలిపి ఎనాలైజ్​ చేసి స్వింగ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. ముందు వాటిపై పట్టు సాధించాలి.

ఒకప్పుడు.. ఈ సమాచారం కొందరికే తెలిసేది. కానీ యూట్యూబ్​ పుణ్యమా అని ఇప్పుడు ఎన్నో ఛానెళ్లు.. స్ట్రాటజీలను ఫ్రీగా చెబుతున్నాయి.

సాధారణంగా స్వింగ్​ ట్రేడింగ్​లో రిస్క్​- రివార్డ్​ రేషియోను 1:2గా చూస్తూ ఉంటారు. అంటే.. మనం రెండు రూపాయిల లాభం కోసం ఒక్క రూపాయి నష్టపోవడానికి సిద్ధపడినట్టు.

స్వింగ్​ ట్రేడింగ్​లో నష్టాలు ఉండవా?

Swing trading stocks : స్టాక్​ మార్కెట్​లో ఏదైనా అంత ఈజీ కాదు. ఈజీగానే ఉంటే.. అందరు సక్సెస్​ఫుల్​గా ఉండాలి కదా? మరి అలా ఎందుకు లేదు?

స్వింగ్​ ట్రేడింగ్​లో కూడా రిస్క్​లు ఉంటాయి. మన స్ట్రాటజీలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. స్టాప్​లాస్​లు హిట్​ అవ్వచ్చు. కానీ స్వింగ్​ ట్రేడింగ్​ చేయాలి అని అనుకునే వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీసుకునే అన్ని ట్రేడ్స్ లాభాల్లోనే ఉండాలన్న మైండ్​సెట్​ని మార్చుకోవాలి. నష్టాలు.. స్టాక్​ మార్కెట్​లో సర్వసాధారణమైన విషయమే. తీసుకున్న 10 ట్రేడ్స్​లో.. 6-7 సక్సెస్​ అయినా(1:2 రేషియో).. చివరికి మనం లాభాల్లోనే ఉంటాము.

స్వింగ్​ ట్రేడింగ్​లో ఒక పెద్ద మైనస్​ పాయింట్​ ఉంది. ఇంట్రాడేలో అదే రోజు ట్రేడ్​ను మూసేయవచ్చు కాబట్టి.. నెక్స్ట్​ డే ఏం జరుగుతుంది? అన్న ఆలోచన ఉండదు. కానీ.. స్వింగ్​ ట్రేడింగ్​లో అలా కాదు. మార్కెట్ల కదలికలను ఎవరూ కచ్చితంగా పసిగట్టలేరు. ఇవన్నీ.. ఊహించి, మన స్ట్రాటజీలను నమ్మి తీసుకునే ట్రేడ్​లే. స్టాక్​ మార్కెట్​లో ఒడిదొడుకులు సహజం. ఏదైనా పెద్ద నెగిటివ్​ వార్త వస్తే.. మార్కెట్లు రాత్రికి రాత్రే పతనమైపోతాయి. మార్కెట్లు తెరుచుకునేలోపే నష్టాలు వచ్చేస్తాయి. ఆ రిస్క్​కి సిద్ధపడే ముందుకు వెళ్లాలి.

చివరిగా..

Stock market psychology : స్టాక్​ మార్కెట్లు, ట్రేడింగ్​, ట్రేడింగ్​ స్ట్రాటజీలు చూడటానికి సింపుల్​గానే ఉంటాయి. కానీ వాటి లోతు చాలా ఎక్కువ! చాలా మంది ట్రేడర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్టాక్​ మార్కెట్​లోకి వస్తుంటారు. వారందరి కన్నా మనదే పైచేయి ఉండాలంటే.. మనకంటూ 'ఎడ్జ్​' కావాలి. ఆ ఎడ్జ్​ అనేది.. తరచూ పేపర్​ ట్రేడింగ్​ చేస్తూ.. మనల్ని మనం సరిచేసుకుంటూ, మనకంటూ ఒక సెటప్​ని ఏర్పాటు చేసుకుంటేనే వస్తుంది. ఆ ఎడ్జ్​ కోసం కష్టపడాల్సి ఉంటుంది.

స్వింగ్​ ట్రేడింగ్​ స్ట్రాటజీలు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే.. సైకాలజీని మేనేజ్​ చేయడం మరో ఎత్తు. ట్రేడర్ల సక్సెస్​ను నిర్ణయించేది ఆ స్ట్రాటజీలు కావు. సైకాలజీనే! సరైన సైకాలజీ ఉంటే.. కష్టాలను తట్టుకుని.. దీర్ఘకాలంలో మంచి రిటర్నులను చూడొచ్చు. అదే సైకాలజీ లేకపోతే.. ఎన్ని లాభాలు వచ్చినా.. అవన్నీ ఊడ్చుకుపోవడానికి ఒక్క ట్రేడ్​ చాలు!

చివరిగా.. 'ప్లాన్​ ది ట్రేడ్​.. ట్రేడ్​ ది ప్లాన్​'

Whats_app_banner

సంబంధిత కథనం