ట్రేడింగ్​లో కేరీర్​ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..-stock market trading for beginners strategies every trader must know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ట్రేడింగ్​లో కేరీర్​ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

ట్రేడింగ్​లో కేరీర్​ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

Sharath Chitturi HT Telugu
Jun 11, 2022 11:55 AM IST

మీరు స్టాక్​ మార్కెట్​లో ట్రేడింగ్​ చేయాలని భావిస్తున్నారా? ఎలా మొదలుపెట్టాలో మీకు అర్థం కావడం లేదా? అయితే ఇది మీ కోసమే.

<p>ట్రేడింగ్​లో కేరీర్​ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..</p>
<p>ట్రేడింగ్​లో కేరీర్​ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..</p> (iStock)

Stock Market trading for beginners : కొవిడ్​ తర్వాత.. స్టాక్​ మార్కెట్లు భారీగా పెరిగాయి. ఆ సమయంలో దేశంలోని అనేకమంది స్టాక్​ మార్కెట్​వైపు అడుగులు వేశారు. కానీ స్టాక్​ మార్కెట్​ అనేది చాలా లోతైన సబ్జెక్ట్​! ఇందులో ఎన్నో అంశాలు ఉంటాయి. బిగినర్లకు కొన్నికొన్నిసార్లు అసలు అర్థమే కాదు. స్టాక్​ మార్కెట్​లో సాధారణంగా వినిపించే పదం 'ట్రేడింగ్'​. ఈ ట్రేడింగ్​తో ముడిపడి ఎన్నో అంశాలు ఉంటాయి. వాటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాము.

సాధారణంగా.. స్టాక్​ మార్కెట్​లో రెండు రకాలు ఉంటాయి. 1. టెక్నికల్​ అనలైసిస్​. 2. ఫండమెంటల్​ అనలైసిస్​.

టెక్నికల్​ అనలైసిస్​ చేసి ఇన్​వెస్ట్​, ట్రేడ్​ చేసే వారిని ట్రేడర్లు అంటారు. పూర్తిగా ఫండమెంటల్స్​పై దృష్టిపెట్టి స్టాక్​ కొనుగోలు చేసే వారిని ఇన్​వెస్టర్లు అని అంటారు.

టెక్నికల్​ అనలైసిస్​లో పలు రకాల ట్రేడింగ్​ స్ట్రాటజీలు ఉంటాయి. అవి..

ఇంట్రాడే ట్రేడింగ్​:

ఇంట్రాడే ట్రేడింగ్​ని డే ట్రేడింగ్​ అని కూడా పిలుస్తారు. ఇందులో.. ట్రేడర్లు.. స్టాక్స్​ని కొని, అమ్మే ప్రక్రియ ఒక్క రోజులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే స్టాక్​ మార్కెట్​ ముగిసే సమయానికి(సాయంత్రం 3:30గంటలు) ఏ ట్రేడ్​ కూడా ఓపెన్​ ఉండకూడదు. అంటే.. ఇందులో ట్రేడర్లు.. కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో ట్రేడ్​ను పూర్తి చేస్తారు.

Trading strategies | ఇంట్రాడే ట్రేడింగ్​ చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. సరైన ప్రణాళికలు, ఏళ్ల తరబడి హోంవర్క్​ చేసి ఉండకపోతే.. భారీ నష్టాలు తప్పవు! ముఖ్యంగా.. బిగినర్లు ఇంట్రా డే ట్రేడింగ్​కి దూరంగా ఉండాలని మార్కెట్​ నిపుణులు సూచిస్తూ ఉంటారు.

ఈ ఇంట్రాడే ట్రేడింగ్​లోనే 'స్కాల్పింగ్​' అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. స్కాల్పింగ్​ అంటే.. ఒక ట్రేడ్​ని కేవలం నిమిషాల వ్యవధిలోనే క్లోజ్​ చేయడం.

బీటీఎస్​టీ..

బీటీఎస్​టీ అంటే.. బై టుడే సెల్​ టుమారో. అంటే ఓ స్టాక్​ని ఇవాళ కొనడం, తదుపరి ట్రేడింగ్​ సెషన్​లో అమ్మేయడం. 

ఇంట్రాడేలో కాకుండా షేర్లను క్యారీ చేయాల్సి వస్తే దానిని 'డెలివరీ' అంటారు.

సాధారణంగా స్టాక్​ మార్కెట్​లో.. ఓ స్టాక్​ని కొని, అమ్మవచ్చు. కానీ తొలుత అమ్మి, ఆ తర్వాత కొనుగోలు చేయలేము(షార్టింగ్​). కానీ ఇంట్రాడే ట్రేడింగ్​, ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​లో మాత్రమే షార్టింగ్​కు అవకాశం ఉంటుంది. డెలివరీలో ఇది సాధ్యపడదు.

స్వింగ్​ ట్రేడింగ్​..

ఒక రోజు నుంచి గరిష్ఠంగా రెండు, మూడు వారాల వరకు స్టాక్స్​ని హోల్డ్​ చేస్తే.. దానిని స్వింగ్​ ట్రేడింగ్​ అంటారు. స్టాక్స్​ కదలికల నుంచి లబ్ధి పొందేందుకు ట్రేడర్లు.. స్వింగ్​ ట్రేడింగ్​ చేస్తూ ఉంటారు. ఉదయం ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే వారికి.. స్టాక్​ మార్కెట్​ నుంచి అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు ఈ స్వింగ్​ ట్రేడింగ్​ ఉపయోగపడుతుంది.

పొజిషనల్​ ట్రేడింగ్​..

ఒక స్టాక్​ను నెలలు, అంతకన్నా ఎక్కువ కాలం హోల్డ్​ చేస్తే.. దానిని పొజిషనల్​ ట్రేడింగ్​ అంటారు. కాలానికి తగ్గట్టు ప్రైజ్​ పెరుగుతుందని భావిస్తే పొజిషనల్​ ట్రేడింగ్​ చేస్తుంటారు. మార్కెట్​ ఒడుదొడుకులను ఈ రకం ట్రేడర్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఫండమెంటల్​ ట్రేడింగ్​..

Fundamental trading | ఇది ఇతర ట్రేడింగ్​ స్ట్రాటజీలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఛార్ట్స్​ కన్నా కంపెనీ ఫండమెంటల్స్​కు ఎక్కువ విలువ ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ బ్యాలెన్స్​ షీట్​, ప్రాఫిట్​- లాస్​ స్టేట్​మెంట్ చూసి.. సంస్థ భవిష్యత్తును అంచనావేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. దీనిని 'బై అండ్​ హోల్డ్​' స్ట్రాటజీ అని కూడా అంటారు. ఒకసారి షేర్లు కొంటే.. కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్​ చేస్తూ ఉంటారు.

స్టాక్​ మార్కెట్​ టిప్​..

Stock market tips for beginners : స్టాక్​ మార్కెట్​లో ట్రేడర్ల సక్సెస్​ రేట్​.. 2శాతం కన్నా తక్కువే! దీని బట్టి పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. స్ట్రాటజీల కన్నా సైకాలజీ ఎంతో కీలకం.

ట్రేడింగ్​లో సంబంధిత స్టాక్​ ఛార్ట్​లు చూడాల్సి ఉంటుంది. వాటిని గమనిస్తూ.. మనకంటూ ఓ ప్రత్యేక సెటప్​ను ఏర్పాటు చేసుకావాల్సి ఉంటుంది. కొన్ని నెలల పాటు పేపర్​ ట్రేడింగ్​ చేస్తూ, లాభాలు-నష్టాలను పరిశీలించి, అప్పుడు రియల్​ మార్కెట్​లో అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారే దీర్ఘకాలంలో సక్సెస్​ అవుతారని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు.

సంబంధిత కథనం

టాపిక్