Intraday trading : ‘ఇంట్రాడే ట్రేడింగ్’తో నిమిషాల్లో రూ. లక్షల్లో సంపద!-what is intraday trading is it profitable in stock market ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Intraday Trading : ‘ఇంట్రాడే ట్రేడింగ్’తో నిమిషాల్లో రూ. లక్షల్లో సంపద!

Intraday trading : ‘ఇంట్రాడే ట్రేడింగ్’తో నిమిషాల్లో రూ. లక్షల్లో సంపద!

Sharath Chitturi HT Telugu
Jul 02, 2022 09:14 AM IST

Intraday trading : ఇంట్రాడే ట్రేడింగ్.​. స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించేందుకు ఉన్న మార్గాల్లో ఇదొకటి. ఇంట్రాడే ట్రేడింగ్​లో భారీగా సంపద వెనకేసుకున్న ట్రేడర్లు ఎందరో. బిగినర్లకు ఇంట్రాడే ట్రేడింగ్​ గురించి పెద్దగా అవగాహన ఉండదు. అసలు ఇంట్రాడే అంటే ఏంటి? ఇందులో నిజంగానే భారీగా సంపద వెనకేసుకోవచ్చా?

<p>‘ఇంట్రాడే ట్రేడింగ్’తో నిమిషాల్లో రూ. లక్షల్లో సంపద!</p>
<p>‘ఇంట్రాడే ట్రేడింగ్’తో నిమిషాల్లో రూ. లక్షల్లో సంపద!</p> (iStock)

Intraday trading : స్టాక్​ మార్కెట్​ అందరిది.. ఇక్కడ షార్ట్స్​ వేసుకునే వారు డబ్బులు సంపాదించుకోవచ్చు. టై కట్టుకున్న వారూ డబ్బులు వెనకేసుకోవచ్చు. స్టాక్​ మార్కెట్​లో చాలా ట్రేడింగ్​ ఆప్షన్లు ఉంటాయి. వాటిల్లో ఇంట్రాడే ట్రేడింగ్​ ఒకటి. ఇందులో సక్సెస్​ అయితే.. నిమిషాల్లో రూ. లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. తక్కువ కాలంలో రూ. కోట్లు వశం చేసుకోవచ్చు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇంట్రాడే ట్రేడింగ్​లో ఉండే 'రిస్క్​' గురించి చాలా తక్కువ తెలుస్తుంది. ఇంట్రాడే అంటే అంత సులభం కాదు. అసలు ఇంట్రాడే ట్రేడింగ్​ అంటే ఏంటి? అందులో నిజంగా డబ్బులు సంపాదించుకోవచ్చా?

ఇంట్రాడే ట్రేడింగ్​ అంటే ఏంటి?

ఒక స్టాక్​ను ఒక రోజులో కొని, అదే రోజులో అమ్మేస్తే దానిని ఇంట్రాడే అని పిలుస్తారు. ఇంట్రాడే ట్రేడింగ్​ని.. డే ట్రేడింగ్​ అని కూడా అంటారు. ప్రతి ట్రేడింగ్​ ప్లాట్​ఫామ్​లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్​ కోసం ప్రత్యేకమైన ఆప్షన్లు ఉంటాయి. వాటిని మాత్రమే సెలక్ట్​ చేసుకోవాలి.

మార్కెట్​ కదలికలు, ఒడుదొడుకులను అర్థం చేసుకుని, అతిస్వల్ప కాలంలో లాభాలు పొందేందుకు ట్రేడర్లు ఇంట్రాడే ట్రేడింగ్​ చేస్తారు. మార్కెట్​ పరిస్థితులను గమనించామా, ఎంట్రీ ఇచ్చామా, ఎగ్జిట్​ అయ్యామా.. అంతే.. వీటికి మించి వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

What is intraday trading in Telugu : ఇంట్రాడే ట్రేడింగ్​లో.. కేవలం కొనడం, అమ్మడమే కాదు.. ఇంట్రాడేలో తొలుత విక్రయించి, అనంతరం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనినే 'షార్ట్​ సెల్లింగ్​' అని అంటారు. అందేంటి.. మన దగ్గర షేర్లు లేకపోతే తొలుత ఎలా విక్రయిస్తాము? అన్న సందేహం బిగినర్లకు ఉంటుంది. కానీ స్టాక్​ మార్కెట్​లో ఇది సహజమే. విక్రయించేడప్పుడు మన వద్ద షేర్లు ఉండవు. అమ్మేసిన తర్వాత కూడా షేర్లు ఉండవు కదా! అయితే ఈ షార్ట్​ సెల్లింగ్​ ఆప్షన్​.. కేవలం ఇంట్రాడే ట్రేడింగ్​లోనే ఉంటుంది. డెలివరీలో ఉండదు.

ఉదాహరణకు.. ఒక స్టాక్​ రూ.400లో ట్రేడ్​ అవుతోంది. దానిని మీరు ఇంట్రాడే చేయాలి అని అనుకుంటే.. రెండు మార్గాలు ఉంటాయి. రూ. 400 వద్ద కొనుగోలు చేస్తారు. ఆ స్టాక్​ రూ. 400 కన్నా పైకి వెళ్లాక.. ప్రాఫిట్​ బుక్​ చేస్తారు. అదే షార్ట్​ సెల్లింగ్​లో.. రూ. 400 వద్ద విక్రయించిన స్టాక్​ను.. దాని కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ప్రాఫిట్​ బుక్​ చేస్తారు.

లెవరేజ్​ అంటే ఏంటి?

ఇంట్రాడే ట్రేడింగ్​లో మరొక వెసులుబాటు కూడా ఉంది. డెలివరీలో స్టాక్స్​ కొనాలి అనుకుంటే.. మొత్తం డబ్బులు మన దగ్గర ఉండాలి. కానీ ఇంట్రాడేలో ఆ అవసరం లేదు. బ్రోకరేజ్​ సంస్థలు 'లెవరేజ్/మార్జిన్లు​' ఇస్తాయి. మన దగ్గర కొంత మొత్తం ఉంటే, మిగిలినవి లెవరేజ్​ తీసుకుని ఇంట్రాడే చేసుకోవచ్చు.

సెబీ నిబంధనల ప్రకారం.. ఒక స్టాక్​ మీద గరిష్ఠంగా 5రెట్లు లెవరేజ్​ను ఇస్తాయి ట్రేడింగ్​ ప్లాట్​ఫామ్స్​. కచ్చితంగా 5రెట్లు ఇవ్వాలా? ఇంకా తక్కువ ఇవ్వాలా? అన్నది ఆ ట్రేడింగ్​ ప్లాట్​ఫామ్​ ఇష్టం.

దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాము.

Intraday leverage : ఇంట్రాడే ట్రేడింగ్​ కోసం.. రూ. 2000లో ట్రేడ్​ అవుతున్న స్టాక్​ను మీరు ట్రేడ్​ చేద్దాం అని అనుకుంటున్నారు. 100 స్టాక్స్​​ కొనుగోలు చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. అంటే.. వాస్తవానికి మీ ట్రేడింగ్​ ఖాతాలో రూ. 2లక్షలు ఉండాలి.

కానీ బ్రోకరేజ్​ ఇచ్చే లెవరేజ్​తో ఆ అవసరం లేదు. మీ ట్రేడింగ్​ అకౌంట్​లో రూ. 60వేలు ఉంటే.. దాని మీద బ్రోకరేజ్​ సంస్థలు 5రెట్లు లెవరేజ్​ ఇస్తాయి. అంటే.. రూ. 3లక్షలలోపు విలువ చేసే స్టాక్స్​ను మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు. దీనిని మార్జిన్​ అని కూడా అంటారు.

చివరిగా.. మీకు ఇచ్చిన మార్జిన్లకు, ట్యాక్సులు జోడించి బ్రోకరేజ్​ సంస్థలు మీకు వచ్చిన ప్రాఫిట్​/లాస్​లో నుంచి డబ్బులు కట్​ చేసుకుంటాయి.

ఇంట్రాడే ట్రేడింగ్​ ఎలా చేయాలి?

Intraday trading strategies : స్టాక్​ మార్కెట్​లో అనేక స్ట్రాటజీలు ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్​కి కూడా ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉన్నాయి. వాటిని నేర్చుకుని మార్కెట్​లో అప్లై చేయాల్సి ఉంటుంది.

ఇంట్రాడేతో లాభాలు వస్తాయా?

స్టాక్​ మార్కెట్​ అనేది ఓ కలల ప్రపంచం. ఇక్కడ ఎవరికి వారే బాస్​లు! ఇక్కడ సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్​లో సక్సెస్​ రేటు కేవలం 2శాతం.

స్ట్రాటజీలు నేర్చుకున్న వారందరు సింపుల్​గా సంపాదించుకోవచ్చు కదా! మరి సక్సెస్​ రేటు 2శాతమే ఎందుకు ఉంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ సాధ్యమే. కానీ దానికి కఠోర శ్రమ, సహనం అవసరం. స్టాక్​ మార్కెట్​ సైకాలజీని నేర్చుకోవాలి. ముందు మార్కెట్లను గమనించాలి. మార్కెట్లే అన్ని నేర్పిస్తాయి. ఆ తర్వాత స్ట్రాటజీలను నేర్చుకోవాలి. ఆ స్ట్రాటజీలు చూడటానికి చాలా సింపుల్​గానే ఉంటాయి. 2,3 సార్లు ప్రాక్టీస్​ చేస్తే ఈజీగానే అనిపిస్తాయి. కానీ రియల్​ మార్కెట్​లో వెంటనే అప్లై చేయకూడదు.

ముందు 'పేపర్​ ట్రేడింగ్'​ చేయాలి. అంటే.. డబ్బులు పెట్టకుండా.. మన స్ట్రాటజీలను అప్లే చేసి, వాటిని పేపర్​ మీద రాసుకుని ఫలితాలను చూసుకోవాలి. ఇలా కనీసం 3నెలల పాటు అయినా చేయాలి. చివరికి మనకి ఆ స్ట్రాటజీ ఉపయోగపడుతోందా? లేదా? అన్నది తెలుస్తుంది.

ఒక్కొక్కరిది ఒక్కోశైలి. సచిన్​లాగా కోహ్లీ బ్యాటింగ్​ చేయలేడు. బుమ్రాలాగా భువనేశ్వర్​ బౌలింగ్​ చేయలేడు. కానీ వారందరు సక్సెస్​ అయినా వారే కదా. అలా మీకంటూ ఓ శైలిని ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ట్రేడింగ్​ చేయాలి. రోజు ప్రాక్టీస్​ చేస్తూ పోతే.. కొన్నేళ్ల తర్వాత ఇది మీకు తెలుస్తుంది.

ఇంట్రాడే అంటేనే చాలా రిస్కీ​ విషయం. దానిలో సక్సెస్​ అవ్వడం అంటే.. మీరు మరింత కష్టపడాలి. అందుకోసం మీ జీవనశైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సరైన సమయంలో నిద్రపోవాలి, సరైన తిండి తినాలి. వ్యాయామాలు కూడా కీలకమే. వీటికి ట్రేడింగ్​కి ఏం సంబంధం అనుకుంటున్నారా?

Stock market psychology : మార్కెట్​లో డబ్బులు సంపాదించాలంటే స్ట్రాటజీల కన్నా సైకాలజీ ముఖ్యం. మీరు ఆలోచించే విధానం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సరైన జీవిన సైలితో సైకాలజీ మెరుగుపడుతుంది. మార్కెట్​లో లాస్​లు సహజం. కానీ లాస్​ వచ్చింది కదా అని.. మీరు బాధపడిపోయి, రివేంజ్​ ట్రేడింగ్​ చేస్తే.. నష్టం మార్కెట్లకు కాదు.. మీకే! ఆ ఆలోచనలు రాకుండా, లాస్​లు- ప్రాఫిట్​లను సమానంగా భావిస్తూ.. ముందుకు వెళ్లాలి. దీనికి సైకాలజీ ఉపయోగపడుతుంది.

మరోవైపు రిస్క్​ మేనేజ్​మెంట్​ని కూడా నేర్చుకోవాలి. మన వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి. మనం ఎంతవరకు నష్టపోతే తట్టుగోగలము అన్న విషయాలను ముందే లెక్కకట్టుకోవాలి. అందుకు తగ్గట్టుగానే స్ట్రాటజీలను అమలు చేయాలి. బ్రోకరేజ్​లు ఇచ్చే మార్జిన్లతో కాస్త ప్రతికూల విషయం కూడా ఉంటుంది. ఎక్కువ మార్జిన్లు ఉండటంతో ఎక్కువ స్టాక్స్​ కొని ఎక్కువ లాభాలు పొందేయాలన్న ఆలోచనలో ట్రేడర్లు ఉంటారు. కానీ లాభాలు రాకపోవచ్చు. మీరు భారీగా డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మార్జిన్లు తీసుకోకుండానే ట్రేడింగ్​ చేయాలని మార్కెట్​ నిపుణులు సూచిస్తుంటారు.

అందుకే బిగినర్లు ఇంట్రాడే ట్రేడింగ్​కు దూరంగా ఉండాలి. ముందు మార్కెట్లను అర్థం చేసుకోవాలి. పైన చెప్పినవాటిని ఫాలో అవ్వాలి. కానీ చాలా మంది డైరక్ట్​గా మార్కెట్​లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత స్టాక్​ మార్కెట్లను తిడుతుంటారు! ఇది కరెక్ట్​ కాదు.

మనిషి తలచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఎందరో, ఎన్నో సాధించారు. మనం అనుకుంటే అన్ని జరుగుతాయి. కానీ అది మన సహనం, శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్​ సక్సెస్​లో కూడా ఇంతే!

చివరిగా.. ‘ప్లాన్​ ఎ ట్రేడ్​.. ట్రేడ్​ ది ప్లాన్​’

సంబంధిత కథనం