తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Price Hike : మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి

Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి

16 January 2023, 11:15 IST

    • Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరిగాయి. మోడల్​ బట్టి గరిష్ఠంగా 1.1శాతం వరకు ప్రైజ్​ హైక్​ తీసుకుంది మారుతీ సుజుకీ. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి
మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి

మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి

Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ వాహనాలు మరింత ప్రియంకానున్నాయి. గతంలో చెప్పినట్టుగానే.. వాహనాల ధరలను పెంచింది ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటన విడుదల చేసింది.

వాహనాల ధరలు ఎంత పెరిగాయంటే..

నూతన ఏడాది తొలి నెలలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు.. డిసెంబర్​లోనే స్పష్టం చేసింది మారుతీ సుజుకీ. ఫలితంగా.. ఇవాలో, రేపో.. ధరల పెంపు ప్రకటన వస్తుందని మార్కెట్​ వర్గాలు భావించాయి. మొత్తానికి.. ధరల పెంపు విషయంపై ప్రకటన చేసేసింది మారుతీ సుజుకీ. మోడల్​పై వేరియంట్​కు తగ్గట్టు ధరలను గరిష్ఠంగా 1.1శాతం పెంచింది.

Maruti Suzuki price hike today : "ఖర్చుల తగ్గించుకునేందుకు సంస్థ చాలా కృషిచేసింది. కస్టమర్లపై ధరల భారం వేయాలని అనుకోలేదు. కానీ ద్రవ్యోల్బణం కారణంగా ముడిసరకు ధరలు భారీగా పెరగడంతో.. వాహనాల ధరలను పెంచక తప్పడం లేదు," అని గతంలోనే వెల్లడించింది మారుతీ సుజుకీ.

Mahindra Scorpio N ధరలు భారీగా పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ప్యాసింజర్​ వెహికిల్​ సెగ్మెంట్​లో మారుతీ సుజుకీకి మంచి డిమాండ్​ ఉంది. అయితే.. టాటా మోటార్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా నుంచి ఈ సంస్థకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు ఆటో సంస్థలతో పోల్చుకుంటే.. మారుతీ సుజుకీ కాస్త వెనకపడినట్టు మార్కెట్​లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Maruti Suzuki price hike news : టాటా మోటార్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థలకు బలమైన ఎస్​యూవీ పోర్ట్​ఫోలియో ఉంది. కాగా.. మారుతీ సుజుకీ ఇప్పటికీ చిన్న కార్లపైనే ఆశలు పెట్టుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ.. చిన్న కార్లతో పాటు ఎస్​యూవీలపైనా దృష్టిసారించింది. బ్రెజా, గ్రాండ్​ విటారాలతో పాటు మరిన్ని ఎస్​యూవీలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 5 డోర్​ జిమ్నీ, ఫ్రాంక్స్​ వంటి మోడల్స్​ను ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించింది. ఇవి త్వరలోనే ఇండియా రోడ్ల మీద అడుగుపెడతాయని అంచనాలు ఉన్నాయి.

ధైర్యం చేస్తున్న సంస్థలు..!

దేశంలోని ప్రముఖ ఆటో సంస్థలన్నీ.. ఒక్కొక్కటిగా వాహనాల ధరలను పెంచుతున్నాయి. మారుతీ సుజుకీతో పాటు టాటా మోటార్స్​ కూడా ఈ జాబితాలో చేరాల్సి ఉంది. రేపో, మాపో ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్డర్​ బుక్​ బలంగా ఉండటం, వాహనాలకు డిమాండ్​ పెరుగుతుండటంతో.. భారీగా ధరలను పెంచేందుకు ధైర్యం చేస్తున్నాయి ఆయా సంస్థలు. అందుకే.. గతేడాది భారీగా ధరలు పెంచడంతో పాటు 2023లోనూ ప్రైజ్​ హైక్​ తీసుకోవాలని చూస్తున్నాయి.