తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Cars Price Hike : పెరిగిన కియా కార్ల ధరలు.. ఆ మోడల్​పై ఏకంగా రూ. లక్ష పెంపు!

Kia cars price hike : పెరిగిన కియా కార్ల ధరలు.. ఆ మోడల్​పై ఏకంగా రూ. లక్ష పెంపు!

09 January 2023, 12:56 IST

    • Kia cars price hike : కియా సోనెట్​, సెల్టోస్​, కారెన్స్​, ఈవీ6 ధరలు పెరిగాయి. పెంచిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు..
భారీగా పెరిగిన కియా కార్ల ధరలు..
భారీగా పెరిగిన కియా కార్ల ధరలు.. (HT AUTO)

భారీగా పెరిగిన కియా కార్ల ధరలు..

Kia cars price hike : ఇండియాలో విక్రయిస్తున్న వాహనాల ధరలను పెంచుతున్నట్టు కొరియన్​ కార్​మేకర్​ కియా మోటార్స్​ ప్రకటించింది. ఓ మోడల్​పై ఏకంగా రూ. 1లక్ష వరకు ప్రైజ్​ హైక్​ను తీసుకుంది కియా మోటార్స్​ ఇండియా. ఎస్​యూవీలు సెల్టోస్​, సోనెట్​, ఎంపీవీ కారెన్స్​తో పాటు సంస్థ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్​ వాహనం ఈవీ6 వాహనాలు ధరలు పెరిగాయి. ధరల పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిందని కియా స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

సెల్టోస్​.. సోనెట్​..

కియా నుంచి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న సెల్టోస్​ ఎస్​యూవీ డీజిల్​ వేరియంట్ల ధర రూ. 50వేలు పెరిగింది. మేన్యువల్​, ఐఎంటీ, ఆటోమెటిక్​కు చెందిన అన్ని ఆప్షన్స్​పైనా ధరలు సమానంగా పెరిగాయి. ఫలితంగా కియా సెల్టోస్​ ఎక్స్​షోరూం ధర రూ. 11.89లక్షలు- రూ. 19.15లక్షల మధ్యలో ఉంది.

Kia Seltos on road price in Hyderabad : ఇక కియా సెల్టోస్​ పెట్రోల్​ జీటీఎక్స్​, ఎక్స్​-లైన్​ వేరింట్ల ధర రూ. 40వేలు పెరిగింది. హెచ్​ఈటీ, హెటీకే, హెచ్​టీఎక్స్​ వేరియంట్ల ధర రూ. 20వేలు అధికమైంది. ఫలితంగా హెచ్​టీఈ 1.5 లీటర్​ మేన్యువల్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 10.69లక్షలు (ఎక్స్​షోరూం)గా ఉంది.

MG motor price hike : ఎంజీ మోటార్​ కూడా తమ వాహనాల ధరలను భారీగా పెంచింది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక సబ్​- కాంపాక్ట్​ ఎస్​యూవీ కియా సోనెట్​ ధర రూ. 40వేలు పెరిగింది. డీజిల్​ మోడల్స్​ ధర రూ. 9.45లక్షలు- రూ. 14.39లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది. కియా సోనెట్​ పెట్రోల్​ వేరియంట్లపై మాత్రం రూ. 25వేల ప్రైజ్​ హైక్​ తీసుకుంది ఈ ఆటో సంస్థ. మొత్తం మీద కియా సోనెట్​ పెట్రోల్​ వేరియంట్ల ధర రూ. 7.69లక్షలు- రూ. 13.64లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది.

Kia Sonet price in Hyderabad : ఇక కారెన్స్​ ఎంపీవీని గతేడాది ఫిబ్రవరిలో లాంచ్​ చేసింది కియా మోటార్స్​. కారెన్స్​ డీజిల్​ వేరియంట్​లపై ఏకంగా రూ. 45వేల ప్రైజ్​ హైక్​ తీసుకుంది కియా. ఫలితంగా కియా కారెన్స్​ డీజిల్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 12.15లక్షలుగా (ఎక్స్​షోరూం) ఉంది. టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 18.45లక్షల వరకు వెళుతుంది. పెట్రోల్​ వేరియంట్ల దరలు రూ. 25వేలు పెరిగాయి. ఫలితంగా టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 17.95లక్షలకు చేరింది.

Kia EV6 price hike news : కాగా.. ఈవీ6పై అత్యధిక ప్రైజ్​ హైక్​ తీసుకుంది కియా మోటార్స్​. కియా ఈవీ6 ధర రూ. 1లక్ష పెరిగింది. ఫలితంగా కియా ఈవీ6 ధర రూ. 60.95లక్షలకు (ఎక్స్​షోరూం) చేరింది.

తదుపరి వ్యాసం