Kia Seltos facelift launch : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
Kia Seltos facelift launch : కొన్ని రోజుల్లో.. అమెరికాలో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను ఆవిష్కరించనుంది కియా. ఇప్పుడు ఇండియాలో లాంచ్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి.
Kia Seltos facelift launch : ఇండియా మార్కెట్లో కియా మోటార్స్ దూసుకెళుతోంది. కార్నివాల్, క్యారెన్స్, సెల్టోస్, సోనెట్.. ఇలా కియాకు చెందిన అన్ని వేరియంట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కియా సెల్టోస్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. ఇక ఇప్పుడు.. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. ఇండియాలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అప్డేటెడ్ సెల్టోస్..
సౌత్ కొరియా ఆధారంగా ఈ కియా మోటార్స్ సంస్థ పనిచేస్తోంది. కాగా.. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. సౌత్ కొరియా మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇక ఈ వారంలో.. అమెరికాలోనూ ఈ మోడల్‌ను ఆవిష్కరించేందుకు కియా ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. 2023లో ఇండియాలోకి కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వస్తుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
Kia Seltos facelift launch in India : సాధారణంగా.. మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్‌ను కొంత అప్డేట్ చేసి లాంచ్ చేసిన వెహికిల్‌ని ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ అని పిలుస్తారు. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌తో సెల్టోస్‌కు ఉన్న డిమాండ్‌ను మరింత పెంచాలని కియా భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే అప్డేట్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కియా సెల్టోస్ కొత్త వర్షెన్‌లో ముందు భాగంలో గ్రిల్స్ మరింత పెద్దగా ఉంటాయి. హెడ్ల్యాంప్స్ని కూడా మార్చారు. ఫ్రంట్ బంపర్‌ను రీడిజైన్ చేశారు. టెయిల్ లైట్స్‌ని కొత్తగా యాడ్ చేశారు. రేర్ స్కిడ్ ప్లేట్‌ని మరింత డామినేటింగ్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.
ఫీచర్స్.. ఇంజిన్..
ఇక న్యూ సెల్టోస్ ఇంటీరియర్ విషయానికొస్తే.. 10.25 ఇంచ్ మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉండొచ్చు. 10.25 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఉండే అవకాశం ఉంది. ఎయిర్వెంట్స్ను కూడా మార్చినట్టు తెలుస్తోంది. కానీ క్యాబిన్ విషయానికొస్తే.. పాత సెల్టోస్ ఫ్లేవరే ఉండే అవకాశం ఉంది.
Kia Seltos facelift price : ఇంజిన్ విషయంలో మాత్రం.. కొత్త సెల్టోస్‌కు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. సౌత్ కొరియాలో ఉన్న ఆప్షన్లనే అమెరికాలోనూ ప్రవేశపెడుతున్నారు. అంటే.. 2.0లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్, టర్బో ఛార్జ్డ్ 1.6లీటర్ మోటార్ ఆప్షన్స్ ఉండొచ్చు. మొదటి దాంట్లో 147హెచ్‌పీ, 180ఎన్ఎం టార్క్ జనరేట్ అవుతుంది. రెండోది.. 195హెచ్‌పీ, 265ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇండియాలో ఉన్న కియా సెల్టోస్‌కు.. 1.4లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్, 1.5లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5లీటర్ డీజిల్ ఇంజిన్ అప్షన్లు ఉన్నాయి. కొత్తగా వచ్చే మోడల్లోనూ ఇవే ఆప్షన్లు ఉండొచ్చు.
ఇండియా మార్కెట్లో కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.49లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.
సంబంధిత కథనం