Hyundai Ioniq 5 vs Kia EV6 : ఐయానిక్ 5 వర్సెస్ కియా ఈవీ6.. ది బెస్ట్ ఏదంటే!
Hyundai Ioniq 5 vs Kia EV6 : హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కియా ఈవీ6కి ఇది గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. వీటిని పోల్చి.. ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం..
Hyundai Ioniq 5 vs Kia EV6 : దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ కూడా వచ్చి చేరింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ ఈవీని గతవారమే ఇండియాలో ఆవిష్కరించింది హ్యుందాయ్. రేంజ్‌తో పాటు స్టైలిష్ లుక్స్‌తో మార్కెట్లో అంచనాలు పెంచేసింది ఈ ఈవీ. అయితే.. ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కియా ఈవీ6కి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి, వీటిల్లో ‘ది బెస్ట్’ ఏది అనేది తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ వర్సెస్ కియా ఈవీ6- డైమెన్షన్స్..
డైమెన్షన్స్ | హ్యుందాయ్ ఐయానిక్ 5 (ఎంఎం) | కియా ఈవీ6 (ఎంఎం) |
పొడవు | 4635 | 4695 |
వెడల్పు | 1890 | 1890 |
ఎత్తు | 1625 | 1570 |
వీల్‌బేస్ | 3000 | 2900 |
Hyundai Ioniq 5 specifications : దీని ప్రకారం చూసుకుంటే.. కియా ఈవీ6 కన్నా హ్యుందాయ్ ఎత్తు, వీల్ బేస్ ఎక్కువగా ఉంటుంది. వెడల్పు ఒకే విధంగా ఉంటుంది. లెన్త్‌లో మాత్రం కియా ఈవీ6 పెద్దగా ఉంటుంది.
Tata Harrier vs MG Hector లో ది బెస్ట్ ఏది? అనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ వర్సెస్ కియా ఈవీ6- పర్ఫార్మెన్స్..
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీలో సింగిల్ మోటార్ ఆర్డబ్ల్యూడీ ఇంజిన్ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 72.6కేడబ్ల్యూహెచ్. ఇది 217పీఎస్ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సంస్థ ప్రకారం.. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631కి.మీల దూరం ప్రయాణిస్తుంది! పూర్తిగా ఛార్జ్(11కేడబ్ల్యూతో) అవ్వడానికి 6 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. అదే 50కేడబ్ల్యూ ఛార్జింగ్‌తో అయితే.. 57 నిమిషాలు పడుతుంది.
Kia EV6 features : ఇక కియా ఈవీ6లో డ్యూయెల్ మోటార్ ఏడబ్ల్యూడీ ఇంజిన్ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 77.4కేడబ్ల్యూహెచ్. ఇది 325పీఎస్ పవర్‌ను, 605ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సంస్థ ప్రకారం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ కియా ఈవీ6 708కి.మీల దూరం ప్రయాణిస్తుంది. పూర్తిగా ఛార్జ్(7.2కేడబ్ల్యూతో) అవ్వడానికి 7 గంటల 20నిమిషాల సమయం పడుతుంది. అదే 50కేడబ్ల్యూ ఛార్జింగ్‌తో అయితే 73 నిమిషాలు పడుతుంది.
దీని బట్టి చూసుకుంటే.. హ్యుందాయ్ ఐయానిక్ 5లో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంది. కియా ఈవీ6తో పోల్చుకుంటే రేంజ్ కూడా తక్కువగానే ఉంది. కానీ బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉండటంతో.. హ్యుందాయ్ ఐయానిక్ 5 తొందరగా ఛార్జ్ అవుతుంది!
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ వర్సెస్ కియా ఈవీ6- ఫీచర్స్..
Hyundai Ioniq 5 price Hyderabad : హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎక్స్టీరియర్లో.. పారామెట్రిక్ పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్- టెయిల్ ల్యాంప్స్, పాప్- అప్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్, పానారోమిక్ సన్‌రూఫ్ ఉంటాయి. ఇక ఇంటీరియర్‌లో ఈకో ఫ్రెండ్లీ లెథర్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సెటప్, వీ2ఎల్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, హీటెడ్ సీట్స్, 12.3 ఇంచ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 8- స్పీకర్ బాష్ ప్రీమియం సౌండ్ సిస్టెమ్ ఉంటాయి.
కియా ఈవీ6 ఎక్స్టీరియర్లో అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్‌తో కూడిన డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పాప్ అప్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఉంటాయి. ఇక ఇంటీరియర్‌లో వేగన్ లెథర్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వీ2ఎల్, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్ ఉంటాయి. ఇంటీగ్రేటెడ్ డిస్ప్లే ఫర్ డ్యూయెల్ 12.3 ఇంచ్ స్క్రీన్స్(ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్- ఇన్ఫోటైన్మెంట్), 14 స్పీకర్ మేరీడియన్ ఆడియో సిస్టెమ్ ఉంటాయి.
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ వర్సెస్ కియా ఈవీ6- సేఫ్టీ..
Kia EV6 range : సేఫ్టీ ఫీచర్స్ కింద హ్యూందాయ్ ఐయానిక్ 5 ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ టెక్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.
అదే కియా ఈవీ6లో 8 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ టెక్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.
హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ వర్సెస్ కియా ఈవీ6- ధర..
Kia EV6 price Hyderabad : ప్రస్తుతం కియా ఈవీ6 ఎక్స్‌షోరూం ధర రూ. 59.95లక్షలు- 64.95లక్షల మధ్యలో ఉంది. హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీకి సంబంధించిన ధరను ఆ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఈ ఈవీ ప్రారంభ ధర రూ. 50లక్షలుగా ఉంటుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం