Hyundai Ioniq 5 Electric Car: రూ.లక్షతో హ్యుందాయ్ ఐయానిక్ 5 బుకింగ్స్ మొదలు.. సింగిల్ చార్జ్‌తో 631 కిలోమీటర్ల రేంజ్
Hyundai Ioniq 5 Booking Begins: చాలా కాలం నుంచి ఊరిస్తున్న హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ ఆవిష్కరించింది.
Hyundai Ioniq 5 Booking Begins: ఇండియాలో ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ మోటార్ ఆవిష్కరించింది. బుకింగ్‍లను కూడా మొదలుపెట్టింది. ఈ నయా ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటున్న కస్టమర్లు.. హ్యుందాయ్ అఫీషియల్ వెబ్‍సైట్ ద్వారా రూ.లక్షను టోకెన్ అమౌంట్‍గా చెల్లించి.. బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5 ధరను మాత్రం ఆ సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే, దీనికి ముహూర్తం ఖరారు చేసింది. ధరతో పాటు అన్ని వివరాలను ఆ తేదీన వెల్లడించనుంది. మరోవైపు ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ ముందు వెల్లడైన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. ఈ హ్యుందాయ్ ఐయానిక్ 5 పూర్తి స్పెసిఫికేషన్లు, వివరాలను ఇక్కడ చూడండి.
631 కిలోమీటర్ల వరకు రేంజ్
Hyundai Ioniq 5 Electric Car: 72.6 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‍తో హ్యుందాయ్ ఐయానిక్ 5 వస్తోంది. దీన్ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఐఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం ఈ రేంజ్ ఉంది. 350 కిలోవాట్ డీసీ చార్జర్‌తో 18 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ 10 నుంచి 80 శాతానికి చార్జ్ అవుతుంది. ముందుగా ఈ మోడల్ రేంజ్ 480 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనాలు రాగా.. 631 కిలోమీటర్ల వరకు రేంజ్‍ను ఇస్తుందని ఆవిష్కరణ సమయంలో హ్యుందాయ్ పేర్కొంది. అయితే మరో బ్యాటరీ వేరియంట్‍ను ప్రకటించలేదు.
మరిన్ని వివరాలు
Hyundai Ioniq 5 Electric Car: 214 bhp, 350 nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేసే ఇంజిన్‍ను ఈ Hyundai Ioniq 5 కారు కలిగి ఉంది. హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 ఏడీఏఎస్, వెహికల్ 2 లోడింగ్ ఫంక్షన్‍తో ఈ ఎలక్ట్రిక్ కార్ వస్తోంది. ఈ కార్ డిజైన్ స్పోర్టీ లుక్‍తో ఉంటుంది. పారా మెట్రిక్ పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్‍లు, క్లామ్‍షెల్ బోనెట్, అలాయ్ వీల్స్ ఉంటాయి. పారామెట్రిక్ పిక్సెల్ టైల్ లైట్లతో ఈ కార్ వస్తోంది. గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్‍నైట్ బ్లాక్ పర్ల్ కలర్ ఆప్షన్‍లలో Hyundai Ioniq 5 Electric Car అందుబాటులోకి వస్తుంది.
Hyundai Ioniq 5: ఫీచర్లు
12.3 ఇంచుల డిజిటల్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేడెట్ సీట్లు, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‍తో పాటు మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఈ మోడల్ ఆరు ఎయిర్ బ్యాగ్‍లు, ఈబీజీతో ఏబీఎస్, ఇంజిన్ పార్కింగ్ బ్రేక్, నాలుగు డిస్క్ బ్రేక్‍లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు బూట్ కెపాసిటీ 571 లీటర్లుగా ఉంది.
ఆ రోజే ధర వివరాలు
Hyundai Ioniq 5 Electric Car: నొయిడా వేదికగా జరిగే ఆటో ఎక్స్‌ప్రో 2023 (Auto Expo 2023)లో ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు పూర్తి వివరాలను హ్యాందాయ్ వెల్లడించనుంది. 2023 జనవరి 11వ తేదీన ధరతో పాటు మరిన్ని డిటైల్స్ చెప్పనుంది. ఆ తర్వాత మార్కెట్‍లోకి ఈ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది.