తెలుగు న్యూస్ / ఫోటో /
Kia EV6 వచ్చేసింది.. భారత మార్కెట్లో కియా మొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదే!
- దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా.. భారత మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారు Kia EV6ను విడుదల చేసింది. ఈ కియా EV6 వాహనం పూర్తిగా నిర్మాణం పొందిన యూనిట్లుగా విక్రయాలు జరుపుకోనుంది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా.. భారత మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారు Kia EV6ను విడుదల చేసింది. ఈ కియా EV6 వాహనం పూర్తిగా నిర్మాణం పొందిన యూనిట్లుగా విక్రయాలు జరుపుకోనుంది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
(1 / 10)
కియా ఇండియా అధికారికంగా తమ EV6 ఎలక్ట్రిక్ కారును భారతీయ కార్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది GT RWD అలాగే AWD అనే రెండు వేరియంట్‌లలో లభించనుంది.
(2 / 10)
Kia EV6 ఎలక్ట్రిక్ కారు ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 59.95 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్-ఎండ్ మోడల్ ధర, రూ. 64.96 లక్షలు
(3 / 10)
Kia EV6 అనేది కియా ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) ఆధారంగా రూపొందించిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ కార్. ఇది విభిన్నమైన బాడీ స్టైల్స్, క్యాబిన్ లేఅవుట్‌లలో వచ్చింది.
(4 / 10)
కియా EV6 కార్ స్పెసిఫికేషన్లు చూస్తే.. డిజిటల్ టైగర్ నోస్ గ్రిల్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, LED హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇండియా కార్ మోడల్ ఓవర్సీస్‌లో విక్రయించే మోడల్ కంటే 170 మిమీ కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది.
(5 / 10)
Kia EV6 క్రాస్‌ఓవర్ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంది, అంటే ఇది SUV తరహా డిజైన్. అలాగే బాడీ టైప్ సాపేక్షంగా కాంపాక్ట్ రూపంలో స్టైలిష్ ప్రొఫైల్‌ని కలిగి ఉంది.
(6 / 10)
కియా ఇండియా ఇప్పటికే ఈ EV6 ఎలక్ట్రిక్ వాహనం కోసం మొత్తం 355 యూనిట్ల బుకింగ్‌ను పొందింది. అయితే ప్రస్తుతం 100 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. EV6 మొదటి రౌండ్ యూనిట్ల డెలివరీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతాయి.
(7 / 10)
Kia EV6 క్యాబిన్లో చూడగానే ఆకర్షించే ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంది. దాని కింద ఓపెన్ స్టోరేజ్ విభాగం స్మార్ట్ డిజైన్ ఐడియా అని చెప్పవచ్చు. క్యాబిన్ నాణ్యతగా లుక్ ను కలిగి ఉంది.
(8 / 10)
Kia EV6లోని ముందు రెండు సీట్లు జీరో-గ్రావిటీ రిక్లైన్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి, అయితే పనోరమిక్ సన్‌రూఫ్, పలు చోట్ల ఛార్జింగ్ ఆప్షన్లు, యాంబిఎంట్ లైటింగ్ ఉన్నాయి. మొబైల్, ఇతర గాడ్జెట్స్ ఛార్జ్ చేయడానికి వెనుక సీటు కింద పవర్ అవుట్‌లెట్ ఉన్నాయి.
(9 / 10)
Kia EV6 వాహనంలో 77.4 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే WLTP-సర్టిఫైడ్ రేంజ్ (యూరోపియన్ స్టాండర్డ్) ప్రకారం 500 కి.మీలకు పైగా పరిధిని అందిస్తుంది. అలాగే ఈ కార్ ఛార్జింగ్ కోసం ఇండియాలో 15 డీలర్‌షిప్‌ల వద్ద 150 kW DC ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేయనుంది. ఇవి EV6ను దాదాపు 40 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతానికి రీఛార్జ్ చేయగలవు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు