TVS iQube : టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్!
12 May 2024, 13:30 IST
- TVS iQube electric scooter new variants : టీవీఎస్ ఐక్యూబ్‌లో కొత్త వేరియంట్లు లాంచ్‌కు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టీవీఎస్ ఐక్యూబ్..
TVS iQube electric scooter : టీవీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో.. తన బెస్ట్ సెల్లింగ్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. టీవీఎస్ ఐక్యూబ్ తన మొదటి ఎలక్ట్రిక్ ఆఫర్‌గా.. సంస్థకు విజయవంతమైంది. కంపెనీ ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ని జోడించడంతో పాటు 2025 ఆర్థిక సంవత్సరంలో వేరియంట్ల సంఖ్యను విస్తరించాలని చూస్తోంది.
టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వేరియంట్లు వేర్వేరు బ్యాటరీ కెపాసిటీలు, ధర పాయింట్లతో లభిస్తాయని టీవీఎస్ సీఈఓ, డైరక్టర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. కొత్త ఐక్యూబ్ వేరియంట్లు.. వచ్చే నెల ప్రారంభంలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అయితే, రాబోయే ఆఫర్లకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్లలో రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ఐక్యూబ్ ఎస్టీ కూడా ఉందా? లేదా? అనేది కూడా అస్పష్టంగా ఉంది.
TVS iQube new variants : ఫేమ్-2 సబ్సిడీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) గడువు 2024 జూలై 31న ముగియడంతో టీవీఎస్ తన అమ్మకాల జోరును నిలుపుకునేందుకు.. మరింత పోటీతత్వంతో కూడిన ఆఫర్లను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. సబ్సిడీ సవరణ తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ ధరలు పెరిగాయి. ఈ మోడల్ ఇప్పుడు రూ .1.37 లక్షల (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) నుంచి అందుబాటులో ఉంది.
ఇదీ చూడండి:- Tata Nexon SUV : టాటా నెక్సాన్‌లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్యూవీ ధర!
ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 ఎక్స్ వంటి కొత్త ఆఫర్ల రాకతో, టీవీఎస్ తన అమ్మకాల జోరును పెంచాలని చూస్తోంది. కొత్త వేరియంట్లు, ప్రొడక్ట్ రిఫ్రెష్ నేటి కాలంలో ఐక్యూబ్‌ను మరింత సముచితంగా ఉంచాలి. ఈ-స్కూటర్ తక్కువ ప్రారంభ ధరతో చిన్న బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని ఆశించవచ్చు. ప్రస్తుతం ఈ మోడల్ 3.04 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 107 కిలోమీటర్లు రేంజ్‌ని అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
TVS iQube on road price in Hyderabad : 2024 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 1.94 లక్షల యూనిట్ల మార్కును దాటడంతో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. టీవీఎస్‌కి స్థిరమైన ప్రాడక్ట్‌గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో.. కంపెనీ 17,403 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని విక్రయించింది.
కొత్త ఐక్యూబ్‌తో పాటు టీవీఎస్ తన ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ని కూడా 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురానుంది. పియాజియో, బజాజ్, ఆల్టిగ్రీన్, యూలర్ తదితర ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు ఈ మోడల్ గట్టి పోటీ ఇవ్వనుంది.