తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xtreme 125r Vs Tvs Raider 125 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

Hero Xtreme 125R vs TVS Raider 125 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

Sharath Chitturi HT Telugu

28 January 2024, 17:30 IST

    • Hero Xtreme 125R on road price Hyderabad : హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ వర్సెస్​ టీవీఎస్​ రైడర్​ 125.. ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..
ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?
ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

Hero Xtreme 125R vs TVS Raider 125 : హీరో మోటోకార్ప్​ సంస్థ నుంచి ఓ కొత్త బైక్​ ఇటీవలే మార్కెట్​లో అడుగుపెట్టింది. దాని పేరు హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​. ఈ బైక్​.. టీవీఎస్​ రైడర్​ 125కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము.

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ వర్సెస్​ టీవీఎస్​ రైడర్​ 125- ఫీచర్స్​..

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ లుక్స్​ షార్ప్​గా బోల్డ్​గా ఉన్నాయి. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ డిజైన్​ యునీక్​గా ఉంది. ఫ్యుయెల్​ ట్యాంక్​ డిజైన్​ అగ్రెసివ్​గా ఉంది. ఇందులో.. స్ల్పిట్​ సీట్స్​, స్పోర్టీ గ్రాబ్​ రెయిల్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​, ఎల్​సీడీ డిస్​ప్లే వంటివి వస్తాయి.

ఇక టీవీఎస్​ రైడర్​ 125లో స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సరికొత్త ఆల్​- ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి. ఇందులో సింగిల్​ సీట్​ ఉంటుంది.

Hero Xtreme 125R price in Hyderabad : సెఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్​​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్స్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్స్​ లభిస్తున్నాయి. రెండింట్లోనూ కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ వస్తుంది. సస్పెన్షన్స్​ విషయానికొస్తే.. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో మోనో షాక్​ యూనిట్స్​ ఉన్నాయి.

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ వర్సెస్​ టీవీఎస్​ రైడర్​ 125- ఇంజిన్​..

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​లో సరికొత్త 125సీసీ, సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 11.5 హెచ్​పీ పవర్​ని, 10.5 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

TVS Raider 125 on road price Hyderabad : ఇక టీవీఎస్​ రైడర్​ 125లో 14.8 సీసీ, ఎయిర్​ అండ్​ ఆయిల్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 15.3 హెచ్​పీ పవర్​ని, 11.2 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

రెండు బైక్స్​లోనూ.. 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ లభిస్తోంది.

హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ వర్సెస్​ టీవీఎస్​ రైడర్​ 125- ధరలు..

Latest bikes launch : ఇండియాలో హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ ఎక్స్​షోరూం ధర రూ. 95వేలు- రూ. 99,500 మధ్యలో ఉంది. ఇక టీవీఎస్​ రైడర్​ 125 ఎక్స్​షోరూం ధర రూ. 95,200- రూ. 1.03లక్షల మధ్యలో ఉంటుంది.

తదుపరి వ్యాసం