Audi bike: ఈ ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ డిటైల్స్ తెలుసా?
08 January 2024, 20:01 IST
జర్మన్ ఆటో మొబైల్ దిగ్గజం ఆడి (Audi) జెన్యూన్ యాక్సెసరీస్ రేంజ్ లో భాగంగా ఒక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ ను లాంచ్ చేసింది.
ఆడి (Audi) ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్
ఆడి (Audi) ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్
జర్మన్ ఆటో మొబైల్ దిగ్గజం ఆడి (Audi) జెన్యూన్ యాక్సెసరీస్ రేంజ్ లో భాగంగా ఒక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ ను లాంచ్ చేసింది. ఈ మొబిలిటీ నూతన ఆవిష్కరణల్లో భాగంగా ఈ ఎలక్ట్రిక మౌంటెయిన్ బైక్ ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ కు ఇటలీకి చెందిన ఫాంటిక్ మోటార్ (Fantic Motor) కంపెనీ తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ ను ఈ ఎలక్ట్రిక్ బైక్ లో వాడారు.
Audi electric mountain bike: ఈ మౌంటెయిన్ బైక్ ఫీచర్స్ ఇవే..
- డేకర్ రేసర్ RS Q e-tron నుంచి స్ఫూర్తి పొంది ఆడి ఈ ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ ను రూపొందించింది. ఈ మోడల్ 2022 డేకర్ ర్యాలీలో 4 స్టేజెస్ లో విజయం సాధించింది.
- ఇది లిమిటెడ్ ఎడిషన్ లాంచ్. ఇందులో ఫాంటిక్ రూపొందించిన 720 కిలో వాట్ (720 kWh) బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు.
- ఇందులో నాలుగు సైక్లింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి బూస్ట్ (Boost), ఎకో (Eco), స్పోర్ట్ (Sport), టూర్ (Tour) సైక్లింగ్ మోడ్స్.వీటిలో బూస్ట్ పర్వత ప్రాంతాల్లో సైక్లింగ్ కు అనుకూలమైనది. ఎకో మోడ్ లో మాగ్జిమమ్ రేంజ్ లభిస్తుంది.
- స్పోర్టీ సైక్లింగ్ కు స్పోర్ట్ మోడ్ అనుకూలం. హ్యాండిల్ బార్ పై ఉన్న డిజిటల్ డిస్ ప్లే లో మోడ్, వేగం, బ్యాటరీ లెవెల్ మొదలైనవి కనిపిస్తాయి.
- ఈ ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ ఎల్, ఎం, ఎస్ సైజ్ ల్లో లభిస్తుంది. వీటి ధర సుమారుగా 8,900 యూరోలు. మన కరెన్సీలో సుమారు రూ. 7.69 లక్షలు.
టాపిక్