తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Gt 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

22 May 2024, 10:53 IST

google News
  • Infinix GT 20 Pro India launch : ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో గేమింగ్​ స్మార్ట్​ఫోన్​.. ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ గ్యాడ్జెట్​ లాంచ్​ డేట్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో ఇండియా లాంచ్​ డేట ఇదే..!
ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో ఇండియా లాంచ్​ డేట ఇదే..! (Infinix/ X)

ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో ఇండియా లాంచ్​ డేట ఇదే..!

Infinix GT 20 Pro price in India : ఇన్ఫీనిక్స్ నుంచి సరికొత్త గేమింగ్ స్మార్ట్​ఫోన్​.. ఇండియాలో లాంచ్​ అవుతోంది. దీని పేరు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో. ఈ గ్యాడ్జెట్​..  నెల 21న ఇండియాలో లాంచ్​ అవుతుంది. రూ.25,000 లోపు ధర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్​ను మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ గ్యాడ్జెట్​గా కంపెనీ ప్రకటించింది. ఇన్ఫీనిక్స్ విడుదల చేసిన పలు టీజర్లలో సైబర్ మెచా డిజైన్ 2.0 మునుపటి మాదిరిగానే ఉంది. ఇన్ఫినిక్స్ జిటి 20 ప్రో అప్​గ్రేడ్స్​, స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో స్పెసిఫికేషన్లు..

ఆన్​లైన్​లో లీక్స్​, రూమర్స్​ ప్రకారం.. ఈ ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 10-బిట్ ఎఫ్​హెచ్​డీ+ ఐ-కేర్, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. జీటీ 20 ప్రో.. భారతదేశపు మొట్టమొదటి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 4 ఎన్ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్​తో పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. 12 జీబీ LPDDR5X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ను ఇందులో అందించనున్నారు.

Infinix GT 20 Pro price : ఈ ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రోలో.. గేమింగ్ అనుభవం కోసం మెరుగైన డిస్​ప్లేను అందించడానికి ఎక్స్ 5 టర్బో చిపను ఇంటిగ్రేట్ చేయడానికి పిక్సెల్ వర్క్స్​తో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ హైలైట్ చేసింది. ఈ చిప్ రెండు కీలక ప్రయోజనాలను అందిస్తుంది. 90 ఎఫ్పిఎస్ హై ఫ్రేమ్ రేటు.. ఇది ప్రామాణిక నిర్వచన వీడియో (ఎస్​డీఆర్)ను హైడెఫినిషన్ రేంజ్ (హెచ్​డీఆర్​) గా మార్చగలదు. మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించడానికి ఇన్ఫీనిక్స్ జేబీఎల్​తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్​ఫోన్​ హీటింగ్​ని తగ్గించడానికి వీసీ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నారు. 45వాట్ సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఇన్ఫీనిక్స్ ఎక్స్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేయనుంది. ఇంకా, ఇన్ఫీనిక్స్ రెండు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్​గ్రేడ్స్​, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్​లను అందిస్తుంది.

ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో ధర..

Infinix GT 20 Pro launch date in India : ఇన్ఫీనిక్స్ జిటి 20 ప్రో స్మార్ట్​ఫోన్​ ధర రూ .25000 లోపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కాబట్టి ఇది అధిక పనితీరు కలిగిన మిడ్-రేంజ్ స్మార్ట్​ఫోన్​ అవుతుంది.

కాగా.. ప్రస్తుతం ఫీచర్స్​పై ఉన్నవి రూమర్స్​ మాత్రమే అని గ్రహించాలి. లాంచ్​ టైమ్​కి వీటిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్​ చేస్తాము.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్​డేట్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఇప్పుడే సబ్​స్క్రైబ్​ చేసుకోండి.

తదుపరి వ్యాసం