తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Smart 8 Plus Sale: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర రూ. 7 వేల లోపే..

Infinix Smart 8 Plus sale: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ సేల్ ప్రారంభం.. ధర రూ. 7 వేల లోపే..

HT Telugu Desk HT Telugu

09 March 2024, 17:55 IST

  • Infinix Smart 8 Plus sale: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ సేల్ భారత్ లో ప్రారంభమైంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.6,999. కాగా, ఇది ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ (Infinix)

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలను ప్రారంభించింది. కేవలం రూ.6,999 ధర కు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ వినియోగ దారులకు లభ్యం కానుంది. 18 వాట్ టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్ 8 ప్లస్ ప్రత్యేకత. బ్యాటరీ పవర్ అయిపోతుందని ఆందోళన చెందకుండా వినియోగదారులు రోజంతా ఈ ఫోన్ ను వినియోగించవచ్చు. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం ఇలా ఏవైనా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ద్వారా సులభంగా చేయవచ్చు.

ఫీచర్స్, ధర .. ఇతర వివరాలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ సొగసైన టింబర్ టెక్చర్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్టైలిష్ గా ఉండటమే కాకుండా మన్నికైనది కూడా. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా, క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ తో ఉంటుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ 90 హెర్ట్జ్ పంచ్-హోల్ డిస్ ప్లే ను కలిగి ఉంది. స్క్రీన్ పై ఉన్న వినూత్న మ్యాజిక్ రింగ్ అవసరమైన సమాచారాన్ని త్వరితగతిన యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఫుల్ సెక్యూరిటీ

భద్రత పరంగా, స్మార్ట్ 8 ప్లస్ వినియోగదారుల డేటా సురక్షితంగా ఉండేలా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2టీబీ మైక్రో ఎస్డీ సపోర్ట్ తో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, యాప్స్ ను స్టోర్ చేసుకోవడానికి తగినంత స్టోరేజ్ ఉంటుంది.

తదుపరి వ్యాసం