తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev9 Electric Suv: ఎన్నో ప్రత్యేకతలతో కియా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ కారు.. 'ఆటో ఎక్స్‌పో'లో కాన్సెప్ట్!

Kia EV9 Electric SUV: ఎన్నో ప్రత్యేకతలతో కియా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ కారు.. 'ఆటో ఎక్స్‌పో'లో కాన్సెప్ట్!

27 December 2022, 18:33 IST

google News
    • Kia EV9 Electric SUV: తదుపరి ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కియా ఈవీ9కు సంబంధించిన కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో కియా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ ఎస్‍యూవీకి సంబంధించిన టీజర్‌ను కియా పోస్ట్ చేసింది.
Kia EV9 Electric SUV: ఎన్నో ప్రత్యేకతలతో కియా నుంచి నయా ఎలక్ట్రిక్ కారు (Photo: Kia)
Kia EV9 Electric SUV: ఎన్నో ప్రత్యేకతలతో కియా నుంచి నయా ఎలక్ట్రిక్ కారు (Photo: Kia)

Kia EV9 Electric SUV: ఎన్నో ప్రత్యేకతలతో కియా నుంచి నయా ఎలక్ట్రిక్ కారు (Photo: Kia)

Kia EV9 Electric SUV: ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా (Kia) కొత్తగా మరో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని ఆ సంస్థ టీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి సంబంధించిన టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కియా ఇండియా. వచ్చే నెల నోయిడాలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023)లో కియా ఈవీ9 కాన్సెప్ట్ (Kia EV9 Concept)ను ఆ సంస్థ ప్రదర్శించే అవకాశం ఉంది. 2021 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ ఈవీ9 కాన్సెప్ట్‌ను కియా వెల్లడించింది. ఇప్పుడు ఇండియాలో 2023 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌ను ప్రదర్శించేందుకు కియా సిద్ధమవుతోందని అంచనా. కాగా, ఈ Kia EV9 Electric SVUకి సంబంధించిన కొన్ని వివరాలు కూడా బయటికి వచ్చాయి. సొలార్ ప్యానెల్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

మూడు వరుసల సీటింగ్‍తో కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు వస్తుంది. ఈ ఎస్‍యూవీ ప్రొడక్షన్ 2023లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‍లో ఈవీ6 ఫ్లాగ్‍షిప్ మోడల్‍ను అందుబాటులోకి తెచ్చింది కియా.

ఆసక్తికరమైన ఫీచర్లతో..

Kia EV9 Electric SUV: కాన్సెప్ట్ వెల్లడించిన సమయంలోనే కియా ఈవీ9 చాలా మంది దృష్టిని ఆకర్షించింది. బుల్ట్-ఇన్‍గా సొలార్ ప్యానెల్ ఉండడం ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి స్పెషాలిటీగా ఉంది. పాపప్ స్టీరింగ్ వీల్, పనోరామిక్ సన్‍రూఫ్, 27 ఇంచుల అల్ట్రా వైడ్ డిస్‍ప్లే‍తో ఈ ఎలక్ట్రిక్ కియా ఈవీ9తో రానుంది. కాగా దీని ఇంటీరియర్.. సస్టైనబుల్ మెటీరియల్‍తో రూపొందడం మరో ప్రత్యేకతగా ఉంది. అలాగే పిల్లర్ లెస్ డిజైన్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ-జీఎంపీ ప్లాట్‍ఫామ్‍ను కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కోసం ఆ సంస్థ వినియోగిస్తున్నట్టు సమాచారం. 77.4 కిలో వాట్ హవర్ బ్యాటరీతో ఈ వచ్చే అవకాశం ఉంది.

కాగా, ఈ ఆటో ఎక్స్‌పోలో కార్నివల్.. కొత్త (New Kia Carnival) మోడల్‍ను కూడా కియా తీసుకురానుంది. కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్ ఎడిషన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Auto Expo 2023: ఆటో ఎక్స్‌పో వివరాలు

వచ్చే నెల (జనవరి 2023) 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆటో ఎక్స్‌పో 2023 జరగనుంది. ఉత్తర ప్రదేశ్‍లోని గ్రేటర్ నోయిడా సమీపంలోని జేపీ గల్ఫ్ కోర్స్‌లో ఈ ఎక్స్‌పో జరుగుతుంది. అన్ని ఆటోమొబైల్ సంస్థలు.. కార్లు, బైక్‍లు, స్కూటర్లు, కమర్షియల్ వాహనాలతో పాటు మరిన్ని ప్రొడక్టులను ప్రదర్శించనున్నాయి.

తదుపరి వ్యాసం