Kia Sonet X-Line । కియా సోనెట్ SUVలో ఎక్స్-క్లూజివ్ ఎడిషన్ కార్ వచ్చేసింది!
కియా మోటార్స్ తమ సోనెట్ కారులో ఎక్స్-క్లూజివ్ వేరియంట్‌ను Kia Sonet X-Lineను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కార్ ధరలు రూ. 13.39 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాలు చూడండి.
వాహన తయారీదారు కియా మోటార్స్ తమ బ్రాండ్‌లోని సబ్ కాంపాక్ట్ SUV అయిన సోనెట్‌లో మరో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. Kia Sonet X-Line పేరుతో వచ్చిన ఈ కారును Sonet శ్రేణిలోని టాప్-ఎండ్ GTX+ వేరియంట్‌పై రూపొందించారు. ఈ స్పెషల్ ఎడిషన్ కార్ పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 13.39 లక్షలు కాగా, డీజిల్ వెర్షన్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
సరికొత్త Kia Sonet X-Line కార్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్లో అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లతో వచ్చింది. కారు బాహ్య డిజైన్ పరిశీలిస్తే ఇది Xclusive మ్యాట్ గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా ముందువైపున గ్లోస్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్, పియానో బ్లాక్ ఫ్రంట్, వెనకవైపు స్కిడ్ ప్లేట్లు, పియానో బ్లాక్ ORVMలతో పాటు సిల్వర్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన డ్యూయల్-టోన్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
కారు లోపలి భాగంలో ఇంటీరియర్ కూడా స్ల్పెండిడ్ సేజ్ డ్యూయల్ టోన్‌తో ఇచ్చారు. ఇందులో భాగంగా ఆరెంజ్ స్టిచింగ్, ప్రత్యేక X-లైన్ లోగోతో వచ్చిన లెథెరెట్ స్పోర్ట్స్ సీట్లు, అదే విధంగా సోనెట్ లోగోతో D-కట్ స్టీరింగ్ వీల్, ఎక్స్‌క్లూజివ్ ప్రీమియం బ్లాక్ హెడ్‌లైనర్ ఉన్నాయి. Kia Sonet X-Lineలో కొత్తగా వచ్చిన డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కారు మొత్తం రూపాన్ని మరింత మెరుగుపరిచాయి.
2022 Kia Sonet X-Line SUV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
Kia Sonet X-Line కారు అనేది ఇది వరకే ఉన్న GTX+ వేరియంట్ కాబట్టి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ అవే ఉంటాయి. పెట్రోల్ వెర్షన్ కారులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ T-GDi ఇంజన్ ఉంటుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతగా వస్తుంది. ఈ ఇంజన్ 118 BHP శక్తిని, 172 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇక డీజిల్ వెర్షన్ కారులో 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 113 BHP శక్తిని, 250 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.
సంబంధిత కథనం