తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. మీ నగరాల్లో నేటి రేట్లు ఇలా..

Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. మీ నగరాల్లో నేటి రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu

05 May 2024, 9:20 IST

    • Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆల్​ టైమ్​ హైకి కాస్త దూరంలో ఉన్నాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 65,850గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,58,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,585గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 71,830గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,18,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,183గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,000గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,980గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,850 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,830గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,000గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,850గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,830గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,830గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,900గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,880గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,830గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేటు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 83,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 86,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 83,000.. బెంగళూరులో రూ. 82,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 తగ్గి.. రూ 25,600కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,650గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం