తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Civic Into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Sharath Chitturi HT Telugu

18 May 2024, 9:00 IST

google News
    • Honda Civic into Lamborghini : గుజరాత్​కు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ తన కస్టమ్ లంబోర్ఘినిని 2008 హోండా సివిక్ తో ఒక సంవత్సరం పాటు నిర్మించాడు. దీనికి అయిన ఖర్చు తెలిస్తే షాక్​ అవుతారు.
మాడిఫైడ్​ లంబోర్ఘీనితో యూట్యూబర్​..
మాడిఫైడ్​ లంబోర్ఘీనితో యూట్యూబర్​.. (Instagram/Tanna Dhaval)

మాడిఫైడ్​ లంబోర్ఘీనితో యూట్యూబర్​..

Modified Lamborghini : లంబోర్ఘినిని కొనడం ఖచ్చితంగా చాలా మందికి ఒక కల! అయితే.. గుజరాత్​కు చెందిన యూట్యూబర్ తన్నా ధవల్.. తన కొత్త లంబోర్ఘిని సూపర్ కారును ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే.. నిజానికి అది లంబోర్ఘిని కాదు! 2008 హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చేశాడు. ఇందుకు రూ. 12.5 లక్షలు మాత్రమే ఖర్చు చేశాడట. సాధారణంగా.. లంబోర్ఘిని ధర రూ. కోట్లల్లో ఉంటుంది. ఈ వార్త వింటున్న నెటిజన్లు వావ్​ అంటున్నారు.

టెర్జో మిలెనియో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్ఫూర్తితో హోండా సివిక్​ను లాంబోర్ఘినిగా మార్చే ప్రయాణాన్ని ధవల్ తన యూట్యూబ్ ఛానెల్​లో డాక్యుమెంట్ చేశాడు. ఈ మొత్తం ప్రాసెస్​ని పూర్తి చేసేందుకు అతనికి ఏడాది సమయం పట్టింది! మాడిఫైడ్ కారు వీల్ ఆర్చ్​లు, ట్విన్ డోర్లు, పొడవైన విండ్ స్క్రీన్​తో పాటు మరెన్నో కాన్సెప్ట్​ను పోలి ఉంటుంది. ఇప్పుడు కొత్త తరం లంబోర్ఘిని కార్లలో భాగమైన సిగ్నేచర్ ట్రై-ఎల్ఈడీ డిఆర్ఎల్స్​ని కూడా పునరావృతం చేశాడు.

Honda Civic into Lamborghini : కస్టమ్-బిల్ట్ కారుకు చాలా ఇతర భాగాలు, ఇంటెన్సివ్ ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ అవసరమని ధవల్ వెల్లడించాడు. కొత్త డిజైన్​కు సరిపోయేలా సివిక్​పై ఛాసిస్ కట్ చేసి రీడిజైన్ చేయాల్సి వచ్చింది. దీనికి రూ .1 లక్షకు పైగా ఖర్చు అయ్యింది. కేవలం లేబర్ ఛార్జీలకే మరో రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు ధవల్ చెప్పాడు. చాలా భాగాలను కస్టమ్ ఫ్యాబ్రికేట్​ చేశాడు. గాజు భాగాలను బ్లాక్ ఫిల్మ్​తో యాక్రిలిక్ షీట్లతో భర్తీ చేశాడు. మాడిఫై చేసిన కారు కిటికీలను తెరవడం సాధ్యం కాదు!

ఈ మాడిఫైడ్​ లంబోర్ఘిని తలుపులపై '63' స్టిక్కర్ కూడా ఉంది. ఇది లంబోర్ఘిన్ పుట్టిన సంవత్సరం '1963'ను సూచిస్తుంది. బానెట్, వీల్స్​పై లంబోర్ఘిని రేజింగ్ బుల్ లోగోను కూడా జత చేశాడు. క్యాబిన్​లో స్పోర్ట్స్ సీట్లు, కొత్త అప్​హోలిస్ట్రీ, ఫ్లాట్-బాటమ్ స్పోర్టీ స్టీరింగ్ వీల్, వైడ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి మార్పులు ఉన్నాయి. కీ ఫోబ్ కూడా కస్టమ్-బిల్ట్ చేయడం జరిగింది. కొత్త బీఎమ్​డబ్ల్యూ మోడళ్ల మాదిరిగానే స్మాల్ స్క్రీన్​ను పొందుతుంది.

Honda Civic to Lamborghini : ప్రాజెక్ట్ కారు ఇంజిన్​లో మార్పు ఉందా లేదా అనే విషయాన్ని కంటెంట్ క్రియేటర్ వెల్లడించలేదు. 2008 హోండా సివిక్ లో 1.8-లీటర్ ఐ-వీటీఈసీ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్​తో ఉండేది.

ఈ ప్రాజెక్టును ఇంటర్నెట్ లో ఔత్సాహికులు ప్రశంసించారు. చూసినవారందరు వావ్​ అంటున్నారు. యూట్యూబర్​ కృషిని మెచ్చుకుంటున్నారు.

తదుపరి వ్యాసం