Lamborghini bicycle price : అట్లుంటది 'లంబోర్ఘిని'తోని.. ఈ సైకిల్ ధర రూ. 8.15లక్షలు!
18 June 2023, 15:42 IST
- Lamborghini bicycle price : లంబోర్ఘిని నుంచి రెండు బైసైకిల్స్ త్వరలోనే రాబోతున్నాయి. వీటి ధర.. దేశంలోని హ్యాచ్‌బ్యాక్ కార్ల కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ లంబోర్ఘిని సైకిల్ ధర రూ. 8.15లక్షలు..!
Lamborghini bicycle price : లంబోర్ఘిని.. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది లగ్జరీ కార్లు, వాటి ఖరీదైన ధరలు. అలాంటి లంబోర్ఘిని సంస్థ సైకిళ్లు తయారు చేస్తే? వాటి ధరలు కూడా భారీగానే ఉంటాయని అనుకుంటున్నారా? అయితే అది నిజమై. 3టీ అనే సంస్థతో జతకట్టిన లంబోర్ఘిని.. బైసైకిళ్లను రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. వీటిల్లో ఒక సైకిల ధర రూ. 8.15లక్షలు! అంటే.. దేశంలోని చాలా హ్యాచ్‌బ్యాక్ కార్ల మోడల్స్ కన్నా ఈ సైకిల్ ధరే ఎక్కువ..!
రెండు సైకిళ్లు.. రూ. లక్షల్లో ధరలు..
లంబోర్ఘిని తీసుకొస్తున్న ఈ సైకిల్స్ పేర్లు రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు 9,899 డాలర్లు (సుమారు రూ. 8,15,365), 8,999 డాలర్లు (సుమారు రూ. 7,41,226). ఈ రెండు అల్ట్రా హై ఎండ్ లగ్జరీ సైకిల్స్ డెలివరీకి 16 వారాల సమయం పట్టొచ్చు. 51, 54, 56, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లోనే ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డెలవరీలు మొదలవ్వొచ్చు.
రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని.. ఒక లైట్‌వెయిట్ మోడల్. 3టీ కార్బన్ పరికరాలతో దీనిని తయారు చేశారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్ప్లోరో రేస్మ్యాక్స్ ఎక్స్ హరికెన్ స్టెరెట్టో సైకిల్‌ను ఇది పోలి ఉంటుంది.
ఇదీ చూడండి:- Luxury Cars to launch this Year: లగ్జరీ కారు కొనాలనుకుంటున్నారా! ఈ ఏడాది ఇండియాలో లాంచ్ కానున్న టాప్-5 మోడళ్లు ఇవే
Lamborghini bicycle price in India : ఇక రెండో బైసైకిల్ స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలిని కంఫర్ట్, ఎయిరోడైనమిక్స్ కోసం రూపొందించారు. ఇందులో ఎస్ఆర్ఏఎం ఫోర్స్ పరికరాలు ఉంటాయి. 3టీతో లంబోర్ఘినికి ఇది మూడో సైకిల్. కాగా.. 2018లో సెర్వెలోతో కలిసి ఆర్5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్‌ను రూపొందించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. కేవలం 63 యూనిట్లనే అందుబాటులో ఉంచింది. ధర 18,000 డాలర్లు! వీటితో లంబోర్ఘిని.. తన స్టైల్‌ను మరోమారు చూపించింది.
లంబోర్ఘిని కారు కొన్న సచిన్..
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. ఇటీవలే మరో లగ్జరీ కారు కొన్నాడు. ఈసారి ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినికి చెందిన ఉరుస్ ఎస్‌ను అతడు కొనుగోలు చేశాడు. ఆ సంస్థ ఈ మధ్యే ఈ కారును లాంచ్ చేసింది. ఇక ఇండియన్ మార్కెట్ లోకి ఈ మధ్యే అడుగుపెట్టిన ఉరుస్ ఎస్ మోడల్ ధర రూ.4.18 కోట్లు కావడం విశేషం.
Sachin buys Lamborghini car : క్రికెట్ ఫీల్డ్‌లో పరుగుల వరద పారించిన సచిన్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి మధ్యకు ఇప్పుడు ఈ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ చేరింది. ఈ కార్లలో మాస్టర్ పెద్దగా ముంబై రోడ్లలో తిరగడం కనిపించదు. కానీ తనకు ఇష్టమైన కార్లను మాత్రం కొనేస్తుంటాడు. ఈ కొత్త కారులో సచిన్ వెళ్తున్న వీడియోను సీఎస్ 12 వ్లోగ్స్ షేర్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.