Sachin buys Lamborghini: లాంబోర్ఘిని కారు కొన్న సచిన్.. ఎన్ని కోట్లో తెలుసా?
Sachin buys Lamborghini: లాంబోర్ఘిని కారు కొన్నాడు సచిన్ టెండూల్కర్. ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లు అతని గ్యారేజీలో ఉండగా.. తాజాగా ఈ కారు కూడా చేరడం విశేషం.
Sachin buys Lamborghini: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మరో లగ్జరీ కారు కొన్నాడు. ఈసారి ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లాంబోర్ఘినికి చెందిన ఉరుస్ ఎస్ ను అతడు కొనుగోలు చేశాడు. ఆ సంస్థ ఈ మధ్యే ఈ కారును లాంచ్ చేసింది. ఇక ఇండియన్ మార్కెట్ లోకీ ఈ మధ్యే అడుగుపెట్టిన ఉరుస్ ఎస్ మోడల్ కారు ధర రూ.4.18 కోట్లు కావడం విశేషం.
క్రికెట్ ఫీల్డ్ లో పరుగుల వరద పారించిన సచిన్ కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి మధ్యకు ఇప్పుడు ఈ లాంబోర్ఘిని ఉరుస్ ఎస్ చేరింది. ఈ కార్లలో మాస్టర్ పెద్దగా ముంబై రోడ్లలో తిరగడం కనిపించదు. కానీ తనకు ఇష్టమైన కార్లను మాత్రం కొనేస్తుంటాడు. ఈ కొత్త కారులో సచిన్ వెళ్తున్న వీడియోను సీఎస్ 12 వ్లోగ్స్ షేర్ చేసింది.
సచిన్ దగ్గర ఉన్న కార్లు ఇవే
అప్పుడెప్పుడో క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో, అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో మాస్టర్ ఓ మారుతి 800 కారు కొన్నాడు. అప్పటి నుంచీ అతని ఇంట్లోని కార్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. బీఎండబ్ల్యూ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్.. ఆ సంస్థకు చెందిన ఎన్నో కార్లను కూడా కొన్నాడు.
ప్రస్తుతం సచిన్ దగ్గర లేటెస్ట్ మోడల్స్ అయిన బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఎల్ఐ, బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం, బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఉన్నాయి. బీఎండబ్ల్యూ మోడల్ కార్లు కాకుండా సచిన్ పోర్షె 911 టర్బో ఎస్ కారు కూడా కొన్నాడు. గతంలో ఎఫ్1 ఛాంపియన్ మైఖేల్ షూమాకర్ కూడా తన ఫ్రెండ్ అయిన సచిన్ కు ఓ ఫెరారీ 360 మోడెనా కారు గిఫ్ట్ గా ఇచ్చాడు.
అయితే ఆ కారును తర్వాత గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు అమ్మేశాడు. సచిన్ దగ్గర నిస్సాన్ జీటీఆర్ ఇగోయిస్ట్ కారు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ కార్లు కేవలం 43 ఉండగా.. ఇండియాలో సచిన్ దగ్గర మాత్రమే ఉంది. ఇక తాజాగా తొలిసారి లాంబోర్ఘిని సంస్థకు చెందిన కారును కూడా సచిన్ సొంతం చేసుకున్నాడు.
సంబంధిత కథనం