HMSI sales: మే నెలలో స్వల్పంగా తగ్గిన హోండా మోటార్ సైకిల్స్ సేల్స్
మే నెలలో హోండా మోటార్ సైకిల్స్ (HMSI) అమ్మకాలు ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే, స్వల్పంగా తగ్గాయి. మే నెలలొ మొత్తం 3.29 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
మే నెలలో హోండా మోటార్ సైకిల్స్ (HMSI) అమ్మకాలు ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే, స్వల్పంగా తగ్గాయి. మే నెలలొ మొత్తం 3,29,393 యూనిట్ల మోటార్ సైకిల్స్ అమ్ముడయ్యాయని హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (Honda Motorcycle and Scooter India HMSI) శుక్రవారం ప్రకటించింది.
కొత్తగా షైన్ 100 సీసీ
మే నెలలో అమ్ముడైన హోండా బైక్స్ లో దేశీయంగా 311,144 యూనిట్లు అమ్ముడవగా, విదేశాలకు 18,249 యూనిట్లను ఎగుమతి చేశారు. ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే, మేలో హోండా బైక్స్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్ నెలలో మొత్తం 374,747 యూనిట్ల బైక్ లను హోండా మోటార్స్ అమ్మగలిగింది. అయితే, తాజాగా లాంచ్ చేసిన 100 సీసీ షైన్ బైక్ పై హోండా మోటార్స్ భారీ ఆశలు పెట్టుకుంది.
చవకైన బైక్
హోండా షైన్ 100 సీసీ బైక్ ను గత నెలలో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ల్లో లాంచ్ చేశారు. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధరను రూ 62,900 గా నిర్ణయించారు. ఇది హోండా నుంచి వచ్చిన అత్యంత చవకైన బైక్ గా భావించవచ్చు. ఇందులో ఈ ఎస్పీ పవర్డ్ ఓబీడీ2 ఇంజిన్ ఉంది. ఈ బైక్ 5 రంగుల్లో లభిస్తుంది. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రిప్స్. ఈ బైక్ ను ప్రధానంగా హీరో స్ప్లెండర్, హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 లకు పోటీగా మార్కెట్లో ప్రవేశపెట్టారు. (Also read | Honda Shine 100 begins reaching customers)