Honda electric scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..-honda gets patent for two new electric scooters in india all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Electric Scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

Honda electric scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

Sharath Chitturi HT Telugu
May 29, 2023 01:41 PM IST

Honda electric scooters : రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లకు చెందిన పేటెంట్స్​ను పొందింది హోండా సంస్థ. వీటి లాంచ్​పై క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి వివరాలు..

హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..
హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు.. (Representative image)

Honda new electric scooters : ఇండియా 2 వీలర్​ సెగ్మెంట్​లో మార్కెట్​ షేరును పెంచుకునేందుకు విపరీతంగా కృషిచేస్తోంది హోండా సంస్థ. సీబీఆర్​250ఆర్​ఆర్​, సీఎల్​300లకు ఇటీవలే పేటెంట్​ పొందిన ఈ ఆటోమొబైల్​ కంపెనీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఫోకస్​ పెంచింది. ఈ క్రమంలోనే కొత్తగా రెండు స్కూటర్లకు పేటెంట్​లు ఫైల్​ చేసింది.

డాక్స్​ ఈ.. జూమర్​ ఈ..

హోండా తాజాగా పేటెంట్​ పొందిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల పేర్లు డాక్స్​ ఈ, జూమర్​ ఈ అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల వర్షెన్​లు మాడెర్న్​గా ఉంటాయని సమాచారం. సైజు పరంగా రెండు చిన్నవే! అయితే వీటిల్లో బాష్​ హబ్​ మోటార్​ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే వీటిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 80కి.మీల రేంజ్​ రావొచ్చు. 25కేఎంపీహెచ్​ టాప్​ స్పీడ్​ ఉండొచ్చు. హోండా డాక్స్​ ఈ, జూమర్​ ఈలో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, ఎల్​ఈసీ ఇన్​స్ట్రుమెంట్​ స్క్రీన్​, ఫ్రెంట్​- రేర్​లో డిస్క్​ బ్రేక్స్​ వంటివి ఫీచర్స్​గా ఉండే అవకాశం ఉంది.

ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్ల లాంచ్​పై ఇంకా స్పష్టత లేదు. లాంచ్​ డేట్​ను సంస్థ ప్రకటించాల్సి ఉంది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​..

Honda Active electric : ఇండియాలో హోండాకు బెస్ట్​ సెల్లింగ్​గా ఉంది యాక్టివా స్కూటర్​. ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్​ వర్షెన్​ను తీసుకురావాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్​లో ఇది లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. రూ. 1లక్ష- రూ. 1.20లక్షల ప్రైజ్​ పాయింట్​లో ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​.. ఐసీఈ వర్షెన్​తో పోలి ఉండొచ్చు. బ్యాటరీ ప్యాక్​కు సంబంధించిన వివరాలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 100- 150కి.మీల రేంజ్​ వచ్చే విధంగా హోండా దీనిని తయారు చేస్తున్నట్టు వార్తలు బయటకొచ్చాయి.

లాంచ్​ తర్వాత ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1, టీవీఎస్​ ఐక్యూబ్​, అథెర్​ 450ఎక్స్​, బజాజ్​ చెతక్​ ఎలక్ట్రిక్​ వంటి మోడల్స్​కు గట్టిపోటీనిచ్చే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్కూటర్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం