Honda Elevate SUV : ‘ఎలివేట్’ ఎస్‌యూవీని త్వరలోనే రివీల్ చేయనున్న హోండా..!
Honda Elevate launch date : ఎలివేట్ ఎస్‌యూవీని త్వరలోనే రివీల్ చేయనుంది హోండా సంస్థ. ఇందుకు సంబంధించిన డేట్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Honda Elevate launch date : ఇండియాలో ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి. వివిధ ఎస్యూవీ మోడల్స్‌ను లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కూడా ఓ కొత్త ఎస్‌యూవీని ఇండియా మార్కెట్లోకి తీసుకొస్తోంది. దీని పేరు ఎలివేట్ అని ఇటీవలే ప్రకటించింది. వచ్చే నెల 6వ తేదీనా హోండా ఎలివేట్‌ను ఆవిష్కరించనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌యూవీని పాక్షికంగా రివీల్ చేసింది.
హోండా ఎలివేట్ ఎస్యూవీ..
హోండా ఎలివేట్ ఎస్యూవీ టీజర్‌ను విడుదల చేసింది ఆటోమొబైల్ సంస్థ. ఇందులో పానారోమిక్ సన్‌రూఫ్ ఉండదని టీజర్ త్వారా స్పష్టమైంది. రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, బాడీ కలర్డ్ ఓఆర్వీఎంలు కనిపిస్తున్నాయి. రేర్‌లో ఎల్ఈడీ స్ట్రిప్ కనెక్టింగ్ టెయిల్‌లైట్స్, ఎలివేట్ బ్యాడ్జింగ్ వంటివి వస్తాయి.
Honda Elevate SUV : హోండా ఎలివేట్‌కు చెందిన డిజైన్‌ను గతంలో షేర్ చేసింది సంస్థ. లుక్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. సీఆర్-వీ మోడల్ ఆధారంగా ఈ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రిల్ భారీగా ఉండటంతో.. ఎస్‌యూవీకి మస్క్యులర్ లుక్ వస్తుందని. అపియరెన్స్ కూడా డైనమిక్‌గా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 16 ఇంచ్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ ఉండనున్నాయి.
ఎలివేట్‌కు సంబంధించిన ఇతర వివరాలను హోండా సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఇండియా స్టాండర్డ్స్‌కు తగ్గట్టు ఇందులో సరికొత్త ఫీచర్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:- Tata Punch EV news : ఇదిగో టాటా పంచ్ ఈవీ.. 300కి.మీ రేంజ్? లాంచ్ ఎప్పుడు?
ఇంజిన్ ఆప్షన్స్ ఏంటి..?
Honda Elevate price in India : మరోవైపు ఎలివేట్‌లో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. న్యూ జనరేషన్ హోండా సిటీలోనూ ఇదే ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 120 బీహెచ్పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో హైబ్రీడ్ వేరియంట్ కూడా ఉండొచ్చు! టాప్ ఎండ్ మోడల్స్‌కు ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా రావొచ్చు.
ఇండియా ఎస్యూవీ సెగ్మెంట్లో హోండా నుంచి ఎలాంటి మోడల్ ప్రస్తుతం మార్కెట్లో లేదు. ఎలివేట్ ఆ సంస్థకు తొలి ఎస్యూవీ కానుంది. సీఆర్-వీ, డబ్ల్యూఆర్-వీ మోడల్స్‌ను ఇండియాలో డిస్కంటిన్యూ చేసింది హోండా. ఫలితంగా.. ఎస్యూవీ సెగ్మెంట్లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న సంస్థ.. ఈ ఎలివేట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.
జూన్ 6న జరిగే ఈవెంట్లో హోండా ఎలివేట్‌ను రివీల్ చేయడంతో పాటు లాంచ్ డేట్‌ను కూడా సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. ఇక లాంచ్ తర్వాత ఈ ఎస్యూవీ.. హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం