Tata Punch EV news : ఇదిగో టాటా పంచ్ ఈవీ.. 300కి.మీ రేంజ్? లాంచ్ ఎప్పుడు?
Tata Punch EV news : టాటా పంచ్ ఈవీ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.
Tata Punch EV specifications : దేశ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్.. తన ఈవీ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న టాటా పంచ్‌కు ఈవీ వర్షెన్‌ను తీసుకోస్తోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. టాటా పంచ్ ఈవీ తాజాగా దర్శనమిచ్చింది! టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ద్వారా మనకి లభిస్తున్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము..
టాటా పంచ్ ఈవీ..
స్టాండర్డ్ ఎస్‌యూవీతో పోల్చుకుంటే టాటా పంచ్ ఈవీ కాస్మొటిక్స్‌లో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవీ టచ్ ఇచ్చే విధంగా ఇవి ఉండొచ్చు. టియాగో ఈవీ, టిగోర్ ఈవీల్లో ఉన్నట్టుగా.. పంచ్ ఈవీకి బ్లూ యాక్సెంట్స్, ఎయిరో వీల్స్‌తో పాటు ఆనేక మార్పులు చేయవచ్చు. ఇక ఫ్యూయెల్ ట్యాంక్ లిడ్ స్థాంలో ఛార్జింగ్ పోర్ట్ వచ్చే అవకాశం ఉంది.
Tata Punch EV news : టెస్టింగ్‌లో ఉన్న టాటా పంచ్ ఈవీ రేర్‌లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. పెట్రోల్ వర్షెన్‌లో అక్కడ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. రోటరీ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఆటో హోల్డ్, వయర్లెస్ ఛార్జింగ్‌తో పాటు పలు ఇతర ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రావొచ్చు.
డాష్‌బోర్డు లేఅవుట్ మాత్రం.. పెట్రోల్ వర్షెన్‌నే పోలి ఉంది. హర్మాన్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వస్తోంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ప్రీమియం అప్‌హోలిస్ట్రీ వంటివి ఈ ఈవీతో వస్తాయని అంచనాలు ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ- ఎలక్ట్రిక్ మోటార్..
Tata Punch EV on road price Hyderabad : టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కాగా.. ప్రస్తుతం ఉన్న టియాగో ఈవీలోని వాటినే ఇందులోనూ వాడొచ్చని తెలుస్తోంది. 24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను వినియోగిస్తే.. ఒక్క ఛార్జ్‌తో సుమారు 300కి.మీల దూరం ప్రయాణిస్తుంది ఈ ఈవీ. ఇదే బ్యాటరీ ప్యాక్ వాడుతున్న టియాగో ఈవీ 315కి.మీల రేంజ్‌ను ఇస్తోంది.
సిట్రోయెన్ ఈసీ3కి గట్టిపోటీనిచ్చే విధంగా ఈ టాటా పంచ్ ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్రోయెన్ ఈసీ3 ఎక్స్‌షోరూం ధర రూ. 11.50లక్షలు- రూ. 12.43లక్షల మధ్యలో ఉంది. టాటా పంచ్ ఈవీ ధర కూడా ఇంచుమించు ఇదే రేంజ్లో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Tata Punch EV price : టాటా పంచ్ లాంచ్ డేట్‌పై క్లారిటీ లేదు. లాంచ్‌పై స్పష్టత వస్తే.. ఫీచర్స్, బ్యాటరీ ప్యాక్ వంటి వివరాలు తెలుస్తాయి. మరోవైపు.. టాటా మోటార్స్ ఈవీ పోర్ట్‌ఫోలియో మరింత పెరనుంది! టాటా పంచ్ ఈవీ తర్వాత.. హ్యారియర్ ఈవీ, సరికొత్త కర్వ్ ఈవీ మోడల్స్‌ను కూడా లాంచ్ చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం