What is Gold ETF : గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్ చేయొచ్చా?
Gold ETF India : గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి? దానితో నిజంగా లాభాలు వస్తాయా? మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ని ఎలా ఎంచుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Gold ETF meaning in Telugu : గోల్డ్‌ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ వారిలో చాలా మంది ఇక్కడే ఒక తప్పు చేస్తారు! గోల్డ్‌ని ఫిజకల్‌గా కొని, అదే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే.. పెద్ద తప్పు చేసినట్టే! ఫిజకల్ గోల్డ్‌తో భవిష్యత్తులో వచ్చే రిటర్నులు చాలా తక్కువ. అందుకే.. గోల్డ్‌ని కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టు అయితే.. సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఫ్లలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా.. గోల్డ్ ఈటీఫ్కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ గోల్డ్ ఈటీఎఫ్? దీనితో ప్రయోజనం ఉంటుందా? అసలు మంచి ఈటీఎఫ్‌ని ఎలా సెలక్ట్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడు తెలుసుకోండి..
గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి..?
ఈటీఎఫ్ అంటే ఏంటో మీకు తెలుసా? ఈటీఎఫ్ అంటే.. 'ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్'. ఇది మ్యూచువల్ ఫండ్ సిస్టెమ్ని పోలి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా స్టాక్స్‌ను ఒక్క చోటకు తీసుకొచ్చి పూలింగ్ చేస్తారు. వాటిని యూనిట్లుగా అమ్ముతారు. ఈటీఎఫ్‌లు కూడా అంతే! కానీ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌కు ఒక ప్రధాన డిఫరెన్స్ ఉంది. అదేంటంటే.. మ్యూచువల్ ఫండ్స్ కోసం ఫండ్ హౌజ్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఈటీఎఫ్‌లలో మనం, మన సొంతంగా డిమ్యాట్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకుని, వాటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అటే.. సాధారణ స్టాక్స్‌ను ఎలా కొని, విక్రయిస్తామో.. ఈటీఎఫ్‌లు కూడా అంతే అని అర్థం.
What is Gold ETF : మామూలు ఈటీఎఫ్ అంటే.. స్టాక్స్‌ని కొని, అమ్మడం. గోల్డ్ ఈటీఎఫ్ అంటే.. గోల్డ్‌ని కొని అమ్మడం! గోల్డ్ ఈటీఎఫ్‌తో వచ్చే యూనిట్లు.. హై ప్యూరిటీతో కూడిన ఫిజికల్ గోల్డ్‌తో సమానం. లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడులు చేస్తూ, వాటిని విక్రయించిన తర్వాత డబ్బులను పొందవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్ లాభాలు ఇవే..
జ్యువెలరీ షాప్‌కు వెళ్లి గోల్డ్ కొంటే.. తరుగు, మేకింగ్ ఛార్జీలు వంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లో అలాంటి బాధలు అస్సలు ఉండవు!
మార్కెట్లో ఉండే వాట్, సేల్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ వంటి ట్యాక్స్ తిప్పలు.. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఉండవు.
Best Gold ETF in India : ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ను 'హెడ్జింగ్' కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే.. అనిశ్చితి సమయాల్లో స్టాక్ మార్కెట్లు పడుతుంటాయి. అది సహజం. అదే సమయంలో గోల్డ్ పెరుగుతుండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారు? గోల్డ్‌ని సేఫ్ హెవెన్ అని అందుకే అంటారు. స్టాక్స్‌లో నుంచి తీసిన డబ్బులు.. ఇలా గోల్డ్‌వైపు మళ్లిస్తరు. ఫలితంగా.. గోల్డ్ ఈటీఎఫ్‌తో మన ఇన్వెస్ట్‌మెంట్‌ను డైవర్సిఫైడ్ చేసుకోవచ్చు కూడా.
కానీ ఒక్క విషయం.. ఈ ఈటీఎఫ్‌లపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుందని గుర్తుపెట్టుకోవాలి.
గోల్డ్ ఈటీఎఫ్‌ని ఎంచుకోవడం ఎలా?
సాధారణంగా.. ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునే ముందు.. దాని రిటర్నులు, ఫండ్ మేనేజర్, టైప్, ఎక్స్పెన్స్ రేషియో వంటివి చూస్తాము కదా. ఒక స్టాక్‌ని ఎంచుకునేడప్పుడు ఫండమెంటల్ ఎనాలసిస్ చేస్తాము కదా. అదే విధంగా.. గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎంచుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్‌ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
ట్రాకింగ్ ఎర్రర్..
What is the best Gold ETF to buy : ఈటీఎఫ్‌లలో ట్రాకింగ్ ఎర్రర్ అన్న పదం ఎక్కువగా వినిపడుతుంది. మార్కెట్లో బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా! నిర్దిష్ట సమయానికి బయట మార్కెట్లో ఉన్న రేటు, గోల్డ్ ఈటీఎఫ్‌లోని ఎన్ఏవీ (నెట్ అసెట్ వాల్యూ) రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. దీనినే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ప్రతి ఈటీఎఫ్‌కు ఇది కచ్చితంగా ఉంటుంది. అయితే.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవడంతో మంచి లాభాలు చూడవచ్చు.
ట్రేడింగ్ వాల్యూమ్..
వాల్యూమ్ అనేది ఈటీఎఫ్‌లలో చాలా కీలకమైన విషయం అని తెలుసా? వాల్యూమ్‌లు ఎంత ఎక్కువ ఉంటే.. లిక్విడిటీ అంత ఎక్కువ ఉంటుంది. కొనాలన్నా, అమ్మాలన్నా.. పని సులభంగా ఉంటుంది. లిక్విడిటీ లేని ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టినా, సరైన బయ్యర్ లేకపోతే విక్రయించే సమయంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది.
ఎక్స్పెన్స్ రేషియో..
Gold ETF returns : అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వసూలు చేసేదే ఈ ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఉంటుంది. కాకాపోతే.. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్‌లలో ఇది తక్కువగా ఉంటుంది. ఇది మనకి ఒక అడ్వాంటేజ్.
స్టాక్ మార్కెట్లో నిఫ్టీ, సెన్సెక్స్లని బెంచ్ మార్క్ ఇండెక్స్‌లుగా భావిస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లో అది.. గోల్డ్‌బీస్! ఇదే బెంచ్ మార్క్. దతంలో నిప్పాన్ సంస్థకు చెందిన గోల్డ్ ఈటీఎఫ్‌ని.. ఇప్పుడు గోల్డ్‌బీస్ అని పిలుస్తున్నారు.
సంబంధిత కథనం