తెలుగు న్యూస్ / ఫోటో /
స్టాక్స్‌ని బై చేసి సెల్ చేయడమే కాదు.. సెల్ చేసి కొనొచ్చని మీకు తెలుసా?
- Intraday trading tips : స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారా? 'షార్ట్ సెల్లింగ్' పేరు విని కన్యూజ్ అవుతున్నారా? అయితే.. ఇది కోసమే! అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ట్రేడర్లు ఎందుకు షార్ట్ సెల్ చేస్తారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
- Intraday trading tips : స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారా? 'షార్ట్ సెల్లింగ్' పేరు విని కన్యూజ్ అవుతున్నారా? అయితే.. ఇది కోసమే! అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ట్రేడర్లు ఎందుకు షార్ట్ సెల్ చేస్తారు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
స్టాక్ మార్కెట్లో స్టాక్స్‌ని బై చేసి.. అది పెరిగిన తర్వాత సెల్ చేయడం సహజం. కానీ.. ముందు సెల్ చేసి, ఆ తర్వాత బై కూడా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా? దీనినే షార్ట్ సెల్లింగ్, షార్టింగ్ అంటారు.
(2 / 5)
డెలివరీ ట్రేడ్‌ని మినహాయించి.. ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో ఈ షార్ట్ సెల్లింగ్ టెక్నిక్‌ని అప్ల్ చేసుకోవచ్చు. మరి.. అసలు ట్రేడర్లు.. ఎందుకు షార్ట్ సెల్ చేస్తారు?
(3 / 5)
ఫండమెంటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్, స్ట్రాటజీల ఆధారంగా.. ఏదైనా స్టాక్ పెరుగుతుందని భావిస్తే.. దానిని ముందు బై చేస్తారు. పెరిగిన తర్వాత సెల్ చేస్తారు. అదే.. తమ ఎనాలసిస్‌లో స్టాక్ పడుతుందని స్పష్టమవుతుంటే.. ఈ స్టాక్‌ని షార్ట్ చేశారు.
(4 / 5)
ఉదాహరణకు.. సాధారణంగా.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్‌ని కొని అంతకన్నా ఎక్కువకు అమ్మితే లాభాలు వస్తాయి. కానీ షార్టింగ్లో.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్‌ని సెల్ చేసి, అది కిందపడితే లాభాలు వస్తాయి. ఉదాహరణకు.. షార్టింగ్లో భాగంగా.. రూ. 100 దగ్గర దగ్గర ఉన్న స్టాక్‌ని తొలుత సెల్ చేశారు. అది రూ. 80కి పడింది. మీరు అక్కడ ట్రేడ్‌ని ఎగ్జిట్ అయ్యారు (అంటే బై చేశారు). ఫలితంగా.. మీరు రూ. 20 లాభం పొందినట్టు అవుతుంది. స్టాప్ లాస్ అనేది రూ. 100 పైన ఉండాలి.
(5 / 5)
హెడ్జింగ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన స్టాక్.. షార్ట్ టర్మ్‌లో పడుతుందని తెలిస్తే.. ఈ షార్ట్ సెల్లింగ్ టెక్నిక్‌ని అప్లై చేస్తారు. ఇంట్రాడేలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. షార్ట్ సెల్లింగ్‌లో కూడా రిస్క్‌లు ఉంటాయి. మరీ ముఖ్యంగా ట్రెండ్‌కి వ్యతిరేకంగా షార్టింగ్ చేస్తే.. భారీ నష్టాలు తప్పవు!
ఇతర గ్యాలరీలు