తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 66వేల దిగువకు పసిడి ధర- మరింత పడిన వెండి రేటు..

Gold and silver prices today : రూ. 66వేల దిగువకు పసిడి ధర- మరింత పడిన వెండి రేటు..

Sharath Chitturi HT Telugu

04 May 2024, 5:39 IST

    • Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. శనివారం సైతం పసిడి ధరలు పడ్డాయి. వెండి రేటు కూడా తగ్గింది. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 65,740కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 65,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,57,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,574గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 71,720కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,17,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,172గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,870గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,720గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,720గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,740గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,720గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,790గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,770గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,720గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,340గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 83,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 83,500గా ఉండేది.

Silver rate today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 86,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 83,400.. బెంగళూరులో రూ. 82,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 30 పెరిగి.. రూ 25,650కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,620గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,650గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం