తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Cng : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​కి ‘సీఎన్​జీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడు?

Tata Nexon CNG : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​కి ‘సీఎన్​జీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

05 May 2024, 12:45 IST

    • Tata Nexon CNG : Tata Nexon CNG : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​కి ‘సీఎన్​జీ’ టచ్​ ఇచ్చేందుకు సంస్థ రెడీ అవుతోంది. ఈ మోడల్​పై ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..
టాటా నెక్సాన్​ సీఎన్​జీ
టాటా నెక్సాన్​ సీఎన్​జీ

టాటా నెక్సాన్​ సీఎన్​జీ

Tata Nexon CNG launch date : టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ని గతేడాది లాంచ్​ చేసిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఇప్పుడు ఈ ఎస్​యూవీకి సీఎన్​జీ వర్షెన్​ని ప్లాన్​ చేస్తోంది. ఈ నెక్సాన్​ సీఎన్​జీ మోడల్​.. త్వరలోనే ఇండియాలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ టాటా నెక్సాన్​ సీఎన్​జీ వేరియంట్​ ఒకటి.. పూణేలోని ఓ గ్యాస్​ ఫిల్లింగ్​ స్టేషన్​లో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా నెక్సాన్​ సీఎన్​జీ..

ఇండియాలో టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న వాహనాల్లో నెక్సాన్​ ఒకటి. ఇక దీనికి.. సీఎన్​జీ వర్షెన్​ని తీసుకొస్తున్నట్టు.. గతేడాది జరిగిన ఆటో ఎక్స్​పోలో ప్రకటించింది. 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​తో కూడిన నెక్సాన్​ సీఎన్​జీ మోడల్​ని ప్రదర్శించింది. ఈ సెగ్మెంట్​లో ఇలాంటి ఇంజిన్​ ఇదే తొలిసారి!

Tata Nexon CNG on road price : ఇక ఈ ఎస్​యూవీ లాంచ్​పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. ఈ ఏడాది రెండో భాగం చివర్లో ఈ సీఎన్​జీ మోడల్​ మార్కెట్​లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే మార్కెట్​లో ఉన్న టాటా నెక్సాన్​లోని ఇంజిన్​.. 118 బీహెచ్​పీ పవర్​ని, 170 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ విషయానికొస్తే.. ఈ నెంబర్లు తగ్గుతాయి. 100 బీహెచ్​పీ పవర్​, 150 ఎన్​ఎం టార్క్​ వరకు జనరేట్​ అవ్వొచ్చు. ఇది కూడా చాలా ఇంప్రెసివ్​ ఫిగర్​. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న చాలా సీఎన్​జీ ఇంజిన్స్​.. ఇంత పవర్​, టార్క్​ని జనరేట్​ చేయడం లేదు.

ఇదీ చూడండి:- Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

ఇక టాటా నెక్సాన్​ సీఎన్​జీలో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుందని టాటా మోటార్స్​ సంస్థ తెలిపింది. అంతేకాదు.. ఈ ఎస్​యూవీలో 6 స్పీడ్​ ఆటోమెటిక్​ మేన్యువల్​ ట్రాన్స్​మిషన్​ ఏఎంటీ కూడా ఉంటుందని టాక్​ నడుస్తోంది.

Tata Nexon CNG on road price Hyderabad : మరి ఈ టాటా నెక్సాన్​ సీఎన్​జీలో ఎన్ని వేరియంట్లు ఉంటాయి? వాటి ధరలు ఎలా ఉంటాయి? వంటి వివరాలు అందుబాటులోకి రాలేదు. వీటిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.

సీఎన్​జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్​..

ఇటీవలి కాలంలో.. ఇండియాలో సీఎన్​జీ వాహనాలకు కూడా డిమాండ్​ పెరుగుతోంది. అందుకే.. ఆటోమొబైల్​ సంస్థలు సీఎన్​జీ వెహికిల్స్​ లాంచ్​పైనా ఫోకస్​ చేశాయి. ఈ విషయంలో.. టాటా మోటార్స్​ దూకుడుగా ఉందనే చెప్పుకోవాలి.

Tata Nexon on road price Hyderabad : టాటా పంచ్​లో పెట్రోల్​, ఈవీ, సీఎన్​జీ వర్షెన్​లు ఉన్నాయి. ఇలా.. ఇండియాలో మూడు మోడల్స్​లో అందుబాటులో ఉన్న ఏకైక వెహికిల్​.. టాటా పంచ్​. ఇక నెక్సాన్​ సీఎన్​జీ కూడా లాంచ్​ అయితే.. పంచ్​ సరసన చేరుతుంది. ఇప్పటికే.. టాటా నెక్సాన్​, టాటా నెక్సాన్​ ఈవీలు రోడ్లపై దూసుకెళుతున్నాయి.

మరి లాంచ్​ తర్వాత.. ఈ టాటా నెక్సాన్​ సీఎన్​జీ, క్టమర్లను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!

తదుపరి వ్యాసం