Kia EV3 : కియా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. ఈవీ3పై భారీ అంచనాలు!-kia is betting big on affordable ev3 compact electric suv to beat rivals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev3 : కియా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. ఈవీ3పై భారీ అంచనాలు!

Kia EV3 : కియా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​.. ఈవీ3పై భారీ అంచనాలు!

Sharath Chitturi HT Telugu
Apr 22, 2024 12:01 PM IST

Kia EV3 launch date : కియా ఈవీ3ని రెడీ చేస్తోంది దిగ్గజ్​ ఆటోమొబైల్​ సంస్థ. దీనిని ఒక అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా లాంచ్​ చేసి, సక్సెస్​ కొట్టాలని చూస్తోంది.

కియా ఈవీ3పై భారీ అంచనాలు..
కియా ఈవీ3పై భారీ అంచనాలు..

Kia EV3 latest news : ప్రపంచ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై దండయాత్ర చేసేందుకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​.. గట్టిగానే ప్లాన్​ చేసింది. ఇందులో భాగంగా.. వరుసగా పలు ఈవీలను సిద్ధం చేస్తోంది. ఈవీ9, ఈవీ6 జీటీ మోడల్స్​తో ఇంప్రెస్​ చేసిన కియా మోటార్స్​.. ఇప్పుడు కియా ఈవీ3 ఎలక్ట్రిక్​ వెహికిల్​ని సిద్ధం చేస్తోంది. ఈ వెహికిల్​ గురించి కియా అమెరికా సీఓఓ స్టీవ్​ సెంటర్​ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కియా ఈవీ3పై భారీ అంచనాలు..!

ఇతర ఆటోమొబైల్​ సంస్థలతో పోల్చుకుంటే.. ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో కియా మోటార్స్​ సంస్థ ముందుందని అభిప్రాయపడ్డారు సెంటర్​. టెక్నాలజీ పరంగానూ ఇతర సంస్థల కన్నా ముందు నిలవలాని ప్లాన్​ చేసినట్టు వివరించారు.

"అందరి కన్నా ముందు మేమే ఉన్నాము. మా టెక్నాలజీ మరింత మెరుగ్గా ఉంది. మాకుంటూ ఒక సీక్రెట్​ ఉండాలి. బలమైన ఆర్​ అండ్​ డీ ఉండాలి. అప్పుడే సక్సెస్​ అవుతాము. అదే జరిగింది," అని సెంటర్​ తెలిపారు.

India EV segment : ఈ కియా ఈవీ3 కాన్సెప్ట్​ మోడల్​ని కొన్ని నెలల క్రితం.. ప్రదర్శించింది కియా మోటార్స్​. ఈ ఏడాది చివర్లో ఇది మార్కెట్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. అదే సమయంలో.. కియా ఈవీ4 సెడాన్​ కూడా రెడీ అవుతుంది! ఈవీ3 తర్వాత.. ఈవీ4 అందుబాటులోకి వస్తుందని సమాచారం. అంతేకాదు.. ఈ రెండూ కూడా అఫార్డిబుల్​ ప్రైజ్​ పాయింట్​లోనే ఉంటాయని టాక్​ నడుస్తోంది. మార్కెట్​ షేరును పెంచుకునేందుకు చూస్తున్న కియా సంస్థ.. ధరలను తక్కువగా పెడితే సక్సెస్​ సాధించవచ్చని భావిస్తోంది. కానీ.. ఎలక్ట్రిక్​ వాహనాల ధరలను తగ్గించడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే! దిగ్గజ సంస్థలన్నీ.. ధరలను కట్​ చేయాలంటే కాస్త ఆలోచిస్తాయి. కానీ అఫార్డిబుల్​ ఈవీ మార్కెట్​లో ఆధిపత్యం కోసం చూస్తున్న కియా మోటార్స్​ మాత్రం.. రిస్క్​ తీసుకోవాలని చూస్తోంది. రానున్న నెలల్లో.. వరుస మోడల్స్​ని లాంచ్​ చేయడమే కాకుండా.. అఫార్డిబుల్​ ప్రైజ్​లో వాటిని తీసుకువచ్చి సక్సెస్​ సాధించాలని ప్లాన్​ చేస్తోంది. ఈ విషయాలు.. స్టీవ్​ సెంటర్​ మాటాల ద్వారా స్పష్టమవుతున్నాయి.

ప్రపంచ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై చైనా దిగ్గజ సంస్థలు బీవైడీ, గిలే, నియోల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాన్​ మస్క్​ టెస్లాకే వీటి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అలాంటిది.. ఈ సంస్థలతో పోటీ పడతామని కియా సంస్థ డైరక్ట్​గా చెబుతోంది. మంచి క్వాలిటీతో సరసమైన ధరల్లోనే వాహనాలను ఇస్తూ.. ఆయా చైనా కంపెనీలు క్లిక్​ అవుతున్నాయి. కియా కూడా అదే స్ట్రాటజీని అమలు చేయాలని భావిస్తోంది.

Kia motors India : ఇక ఇండియా విషయానికొస్తే.. కియా ఈవీ9 లాంచ్​ కోసం ఎదురుచూపులు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​.. టెస్టింగ్​ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో ఇది ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు. అంతేకాదు.. కియా 2.0 స్ట్రాటజీలో భాగంగా.. ఈవీ సెగ్మెంట్​పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది కియా మోటార్స్​. వరుస మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. మరి కియా ఈవీ3 కూడా ఇండియాలో లాంచ్​ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం