Kia K4 sedan : ఇదిగో.. సూపర్​ స్టైలిష్​ కియా కే4-kia k4 makes global debut will rival toyota corolla and honda civic ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Kia K4 Makes Global Debut, Will Rival Toyota Corolla And Honda Civic

Kia K4 sedan : ఇదిగో.. సూపర్​ స్టైలిష్​ కియా కే4

Sharath Chitturi HT Telugu
Mar 23, 2024 06:18 AM IST

Kia K4 sedan price : కియా కే4ని రివీల్​ చేసింది కియా మోటార్స్​. ఇదొక సెడాన్​. డిజైన్​ సూపర్​ స్టైలిష్​గా ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సూపర్​ స్టైలిష్​ కియా కే4 ఇదిగో..
సూపర్​ స్టైలిష్​ కియా కే4 ఇదిగో..

Kia K4 sedan India launch : సెకెండ్​ జనరేషన్​ కియా కే4ని అంతర్జాతీయంగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​. బ్రాండ్​కి చెందిన కొత్త 'ఆపోజిట్​ యునైటెడ్​' డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా దీనిని రూపొందించింది సంస్థ. టెక్నికల్ స్పెసిఫికేషన్లను కియా మోటార్స్​ వెల్లడించలేదు. అయితే.. మార్చి 27న జరగనున్న న్యూయార్క్ ఆటో షోలో.. ఈ కియా కే4ని సంస్థ లాంచ్​ చేయనుంది. అప్పుడు.. అన్ని వివరాలపై క్లారిటీ వస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో కియా కే4 లాంచ్​ కష్టమే..!

కియా కే4 ఇండియాలో లాంచ్​ అవ్వకపోవచ్చు! ఇదొక సెడాన్​ కావడమే ఇందుకు కారణం! ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ, ఎంపీవీ సెగ్మెంట్స్​పై మాత్రమే సంస్థ ఫోకస్​ చేసింది. ఇండియాలో సెడాన్​ కన్నా వీటికే ఎక్కువ డిమాండ్​ కనిపిస్తోంది.

2025 కియా కే4 తయారీదారు నుంచి ఈవీ 9, ఈవీ 5, న్యూ జనరేషన్​ కియా కార్నివాల్ వంటి సంస్థ లైన్​ప్​లో ఉన్నాయి. కియా క్యారెన్స్​ ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Kia K4 sedan price in India : ఇక ఈ కియా కే4 ముందు భాగంలో డేటైమ్​ రన్నింగ్ ల్యాంప్స్​తో కూడిన షార్ప్​, ఎల్ ఆకారంలో ఎల్ఈడీ హెడ్​ల్యాంప్స్ ఉన్నాయి. సిగ్నేచర్​ టైగర్​ నోస్​ గ్రిల్​ను భారీగా రీడిజైన్ చేసింది సంస్థ. ఇది మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది.

ఇక ఈ కొత్త సెడాన్​ సైడ్స్​లో రూఫ్ లైన్​తో పొడవైన బానెట్​ని కనిపిస్తోంది. కియా మరింత కూపే లాంటి లుక్ ఇవ్వడానికి వెనుక డోర్ హ్యాండిల్స్​ను దాచింది. స్మార్ట్​గా కనిపించే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెనుక చక్రాల పైన మస్క్యులర్​ హాంచ్​లు ఉన్నాయి. వెనుక భాగంలో ఎల్-షేప్ టెయిల్ ల్యాంప్స్, పెద్ద గ్లాస్ ఏరియా ఉన్నాయి. మీడియం గ్రే, స్లేట్ గ్రీన్, కేనియన్ బ్రౌన్, ఓనిక్స్ బ్లాక్ రంగుల్లో కే4 లభిస్తుందని కియా తెలిపింది.

అట్రాక్టివ్​గా.. ఇంటీరియర్​!

Kia K4 sedan : ఇంటీరియర్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఊహించినట్లుగానే, ఒక పెద్ద యూనిట్ లాగా కనిపించేలా ఇంటిగ్రేటెడ్ చేసిన ట్విన్ డిజిటల్ డిస్​ప్లేలు ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కొత్తది, మల్టీ ఫంక్షనల్ యూనిట్. సెంటర్ కన్సోల్ కప్ హోల్డర్స్, గేర్ లివర్, యూఎస్బీ పోర్ట్స్​ మినిమలిస్టిక్​గా ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నాలో మనం చూసినట్లుగా బ్లోయర్ కూడా ఒక స్లిమ్ హారిజాంటల్ యూనిట్.

అంతర్జాతీయ మార్కెట్​లో ఇప్పటికే మంచి డిమాండ్​ ఉన్న హోండా సివిక్​, టయోటా కామ్రికి ఈ కియా కే4 గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Kia K4 sedan launch date : ఇక ఈ కియా కే4 సెడాన్​ ఇంజిన్​ స్పెసిఫికేషన్స్​తో పాటు ఇతర ఫీచర్స్​ తెలియాల్సి ఉంది. ధరకు సంబంధించిన వివరాలపైనా క్లారిటీ లేదు. మార్చ్​ 27న జరగనున్న లాంచ్​ ఈవెంట్​తో వీటిపై ఓ స్పష్టత వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం