Kia cars price hike : భారీగా పెరగనున్న కియా సోనెట్, సెల్టోస్ ధరలు- క్యారెన్స్ కూడా!
Kia cars price hike news : కియా మోటార్స్.. తన కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చింది! బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Kia Seltos price hike : కియా మోటార్స్ ఇండియా.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 నుంచి ధరలను పెంచే ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే నెల నుంచి కియా సోనెట్, క్యారెన్స్, సెల్టోస్ ధరలు గరిష్ఠంగా మూడు శాతం వరకు పెరగనున్నాయి. కమోడిటీ ధరలు పెరగడం, సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్ కాస్ట్ పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో.. తమ సంస్థ ప్రైజ్ హైక్ తీసుకోవడం ఇదే తొలిసారి అని కియా చెబుతోంది.
భారీగా పెరగనున్న కియా కాార్ల ధరలు..!
ఏ మోడల్‌పై ఎంత ప్రైజ్ హైక్ తీసుకుంటున్నామో.. సంస్థ ఇంకా వెల్లడించలేదు. కానీ.. మోడల్, వేరియంట్ బట్టి ధరలు మారవచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. సంస్థ నుంచి మోస్ట్ అఫార్డిబుల్ వెహికిల్‌గా పేరు ఉన్న కియా సోనెట్.. రూ .7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ .14.69 లక్షల వరకు ఉంటుంది. కియా క్యారెన్స్ ఎంపీవీ ధర రూ .10.45 లక్షల నుంచి రూ .18.95 లక్షల వరకు ఉంటుంది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న కియా సెల్టోస్ ధర రూ .10.90 లక్షల నుంచి ప్రారంభమై రూ .20.30 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ధరల సర్దుబాటు గురించి కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. “కియా వద్ద, మేము మా గౌరవనీయ వినియోగదారులకు ప్రీమియం. సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తాము. అయితే కమోడిటీ ధరలు నిరంతరం పెరగడం, ఎక్స్ఛేంజ్ రేట్, పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ కారణంగా పాక్షిక ధరల పెంపును అమలు చేయక తప్పడం లేదు. ఈ పెరుగుదలలో గణనీయమైన భాగాన్ని కంపెనీ గ్రహిస్తోంది. కస్టమర్లపై ఎక్కువ ప్రభావం పడకుండా ఉండ విధంగా కంపెనీ చర్యలు తీసుకుంది,” అని స్పష్టం చేశారు.
Kia Sonet price hike : 201 లో వచ్చినప్పటి నుంచి సేల్స్ లిస్ట్‌లో గణనీయమైన పెరుగుదలను సాధించిన కియా మోటార్స్.. భారతీయ ఆటో రంగంలో అత్యంత ప్రముఖ సంస్థలలో ఒకటిగా నిలిచింది. సెల్టోస్ 6.13 లక్షల యూనిట్లు, సోనెట్ 3.95 లక్షల యూనిట్లు, క్యారెన్స్ 1.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమొబైల్ తయారీదారు ఈవి 6 ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు) మార్గంలో ఇండియాలోకి తీసుకొచ్చింది.
Kia Crarens on road price in Hyderabad : కియా మోటార్స్ ఒక్కటే కాదు.. ఇండియాలోని దాదాపు అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు.. వాహనాల ధరలను పెంచే పనిలోనే ఉన్నాయి. గత రెండేళ్లుగా వెహికిల్ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయినప్పటికీ.. డిమాండ్ తగ్గకపోవడంతో కంపెనీలు మరింత ధైర్యం చేసి, మళ్లీ-మళ్లీ ధరలను పెంచుకుంటూ వెళుతున్నాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు.. ఈ ఏడాదిలో ఇప్పటికే 1 కన్నా ఎక్కువసార్లు ప్రైజ్ హైక్ తీసుకున్నాయి.
సంబంధిత కథనం