New electric car : కళ్లు చెదిరే డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్​ సెడాన్​.. హైఫై ఏ ఈవీ ఇదే!-hiphi a electric sedan promises 300 kmph top speed sprints 0 96 kmph in 2 sec ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Electric Car : కళ్లు చెదిరే డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్​ సెడాన్​.. హైఫై ఏ ఈవీ ఇదే!

New electric car : కళ్లు చెదిరే డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్​ సెడాన్​.. హైఫై ఏ ఈవీ ఇదే!

Sharath Chitturi HT Telugu
Nov 21, 2023 06:28 AM IST

HiPhi A electric sedan : హైఫై అనే చైనా సంస్థ నుంచి ఓ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ వస్తోంది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కళ్లు చెదిరే డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్​ సెడాన్​.. హైఫై ఏ ఈవీ ఇదే!
కళ్లు చెదిరే డిజైన్​తో కొత్త ఎలక్ట్రిక్​ సెడాన్​.. హైఫై ఏ ఈవీ ఇదే!

HiPhi A : ఇండియాతో పాటు అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. దీనిని క్యాష్​ చేసుకునేందుకు.. ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. ఇక చైనాకు చెందిన హైఫై అనే ఆటోమొబైల్​ సంస్థ.. కొత్త ఈవీని ఆవిష్కరించింది. దీని పేరు హైఫై ఏ. ఈ ఎలక్ట్రిక్​ సెడాన్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎలక్ట్రిక్​ కారు విశేషాలివే..

హైఫై ఏ అనేది ఒక ఎలక్ట్రిక్​ సెడాన్​. ఇదొక లగ్జరీ ఈవీ. హైఫై జెడ్​ ఈవీ ఆధారంగా దీనిని రూపొందించింది సంస్థ. త్వరలో జరగనున్న గాంగ్జౌ ఆటో షోలో దీనిని ప్రదర్శించనుంది.

ఈ హైఫై ఏ ఎలక్ట్రిక్​ సెడాన్​లో 1,270 బీహెచ్​పీ పీక్​ పవర్​ని జనరేట్​ చేసే ఎలక్ట్రిక్​ ప్రొపల్షన్​ సిస్టెమ్​ ఉంటుంది. ఫలితంగా.. ఈ కారు టాప్​ స్పీడ్​ 300 కేఎంపీహెచ్​గా ఉంది. 0- 96 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 2 సెకన్లలో అందుకోలగదట! అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2025 తొలినాళ్లల్లో ఈ ఈవీ సేల్​కు వెళుతుంది.

HiPhi A electric car : ఈ హైఫై ఏ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో 3 ఎలక్ట్రిక్​ మోటార్​లు ఉంటయి. ఫ్రెంట్​ ఆక్సిల్​కి ఒకటి, రేర్​ ఆక్సిల్​కి రెండు ఫిట్​ అయ్యి ఉంటాయి. ఈవీ డిజైన్​తో పాటు ఎలక్ట్రిక్​ మోటార్​లను తామే స్వయంగా రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. ఈ మోడల్​లో ఉపయోగిస్తున్న బ్యాటరీ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాకపోతే.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్​ సెడాన్​లో పెద్ద బ్యాటరీనే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

2023 మార్చ్​లో హైఫై జెడ్​ని ఆవిష్కరించింది సంస్థ. అందులో ఉపయోగిస్తున్న ఎయిర్​ సస్పెనన్ష్​ సిస్టెమ్​నే హైఫై ఏలోనూ వాడుతోంది. రేర్​ స్టీరింగ్​ సెటప్​, అడాప్టివ్​ డాంపర్స్​, టార్క్​ వెక్టరింగ్​ సిస్టెమ్​ వంటివి ఈ ఈవీకి లభిస్తున్నాయి.

HiPhi A electric price : ఇక ఈ హైఫై ఏ ఈవీ​ డిజైన్​ ఫ్రెంట్​ భాగం.. నిస్సాన్​ జీటీ-ఆర్​ సూపర్​ కారును పోలి ఉంది. స్లాంట్​- షార్ప్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్లీక్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​ ఇంటిగ్రేటెడ్​ అయ్యి ఉంటాయి. ఫ్రెంట్​లో భారీ బ్లాక్​ గ్రిల్​ కూడా కనిపిస్తుంది. సాధారణంగా.. ఇలాంటి గ్రిల్స్​.. ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కి ఉండవు. మొత్తం మీద.. ఓవరాల్​ డిజైన్​ చూస్తుంటే.. ఇదొక ఎలక్ట్రిక్​ సెడాన్​ కాకుండా హ్యాచ్​బ్యాక్​ ఫీల్​ వస్తుంది. భారీ అలాయ్​ వీల్స్​ కూడా వస్తున్నాయి. ఇక ఈ హైఫై ఏ ఈవీ రేర్​లో స్లీక్​ ఎల్​ఈడీ స్ట్రిప్​ వస్తోంది. ఇదే టెయిల్​గేట్​గా పనిచేస్తుంది.

ఈ మోడల్​ ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. త్వరలోనే వీటిపై క్లారిటీ రావొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం