First Bajaj CNG motorcycle: తొలి బజాజ్ సీఎన్జీ బైక్ లాంచ్ డేట్ చెప్పేసిన రాజీవ్ బజాజ్
22 March 2024, 18:45 IST
First Bajaj CNG motorcycle: బజాజ్ ఆటో నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక తొలి సీఎన్జీ మోటార్ సైకిల్ లాంచింగ్ డేట్ పై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ లో మొదటి బజాజ్ సిఎన్ జి మోటార్ సైకిల్ ను విడుదల చేయనున్నట్లు ఆయన ధృవీకరించారు.
ప్రతీకాత్మక చిత్రం
First Bajaj CNG motorcycle: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ మోటార్ సైకిల్ ను బజాజ్ ఆటో అభివృద్ధి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా తొలి సీఎన్జీ బైక్ (CNG bike) ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మొదటి బజాజ్ సీఎన్జీ మోటార్ సైకిల్ ను ఈ ఏడాది జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు.
2024 జూన్ లోనే తొలి సీఎన్జీ బైక్
వచ్చే ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కోసం బజాజ్ గ్రూప్ రూ .5,000 కోట్లు ఖర్చు చేస్తుందని రాజీవ్ బజాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగానే, తొలి సీఎన్జీ బైక్ (CNG bike) ను మార్కెట్లోకి తీసుకురావడంపై స్పందించారు. జూన్ లో తొలి బజాజ్ సీఎన్జీ బైక్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలను వేగవంతం చేశామని రాహుల్ బజాజ్ తెలిపారు.
అందుబాటు ధరలోనే..
సీఎన్జీ మోటార్ సైకిల్ (CNG Motorcycle) ను అభివృద్ధి చేయడం ఇటీవలి సంవత్సరాలలో బజాజ్ ఆటో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా మారింది. సీఎన్జీ త్రిచక్ర వాహనాలను తయారు చేసే పరిజ్ఞానం కంపెనీకి ఇప్పటికే ఉంది. అయితే ఆ సాంకేతికతను మోటార్ సైకిల్ తయారీకి ఉపయోగించడం ప్రపంచంలో ఎక్కడా లేదు. టెయిల్ పైప్ ఉద్గారాలను తగ్గించడం, 50-65 శాతం ఖర్చు తగ్గింపు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 50 శాతం తగ్గించడం వంటి రాబోయే సీఎన్జీ మోటార్ సైకిల్ ముఖ్య లక్షణాలను బజాజ్ ఇప్పటికే వెల్లడించింది.
తొలి సీఎన్జీ బైక్ పేరు బజాజ్ బ్రూజర్
బజాజ్ నుంచి రానున్న ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ను బజాజ్ బ్రూజర్ (Bajaj Bruzer) అని పిలుస్తారు. 110-125 సీసీ కెపాసిటి గల ఈ మోటార్ సైకిల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కమ్యూటర్ పొజిషన్ ను కూడా ఇటీవలి స్పై షాట్స్ లో కనుగొన్నారు. ఈ మోటార్ సైకిల్ హైబ్రిడ్ మోడల్ లో పెట్రోల్, సీఎన్జీ.. రెండింటితో నడిచే సాంకేతికతను కలిగి ఉంటుంది. బజాజ్ తన సీఎన్జీ శ్రేణి కోసం కొత్త సబ్-బ్రాండ్స్ (Bajaj Bike) ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అధిక తయారీ ఖర్చుల కారణంగా పెట్రోల్ వేరియంట్ల కంటే సీఎన్జీ వేరియంట్ల ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
పల్సర్ రికార్డ్
కొత్త సీఎన్జీ మోటార్ సైకిల్ (CNG bike) తో పాటు, పల్సర్ (Bajaj Pulsar) బ్రాండ్ త్వరలో రెండు మిలియన్ల అమ్మకాల మార్కును తాకడం గురించి కూడా రాజీవ్ బజాజ్ మాట్లాడారు. 2001లో లాంచ్ అయిన పల్సర్ బజాజ్ కంపెనీ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. త్వరలో 400 సీసీ సింగిల్ సిలిండర్ బజాజ్ పల్సర్ ను ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.