Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ మారుతీ సుజుకీ బ్రెజా.. ఏది బెస్ట్? స్పెసిఫికేషన్స్, ఇంజిన్, ధర వివరాలను ఇక్కడ చెక్ చేయండి..
Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్‌తో.. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న విపరీతమైన పోటీ.. మరింత పెరిగింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా అడుగుపెట్టిన ఈ కొత్త ఎస్‌యూవీపై కస్టమర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ మోడల్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకీ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ. మారుతీ సుజుకీ బ్రెజాకు గట్టి పోటీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ మారుతీ సుజుకీ బ్రెజా: ధర
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ ధర రూ .7.49 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. మారుతీ సుజుకీ బ్రెజా ధర రూ .8.34 లక్షల నుంచి రూ .13.98 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
అంటే.. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ బేస్ వేరియంట్‌తో పోలిస్తే బ్రెజా తక్కువ బేస్ ధరతో వస్తుంది. అయితే దాని టాప్ వేరియంట్ కూడా.. మహీంద్రా ఎస్యూవీ టాప్ వేరియంట్ కంటే చౌకగా ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ మారుతీ సుజుకీ బ్రెజా: స్పెసిఫికేషన్లు..
Mahindra XUV 3XO on raod price Hyderabad : సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రెండు వేర్వేరు పెట్రోల్, సింగిల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌లో వస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ 110 బీహెచ్పీ పవర్‌ని, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ యూనిట్ 128 బీహెచ్పీ పవర్, 230 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్లలో 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. డీజిల్ వేరియంట్ 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ సీఆర్డీఐ యూనిట్‌తో పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఏఎంటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్పీ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Maruti Suzuki Brezza on road price Hyderabad : మరోవైపు, మారుతీ సుజుకీ బ్రెజా.. పెట్రోల్ హైబ్రిడ్, పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. పెట్రోల్, సీఎన్జీ ఉండే 1.5-లీటర్ ఇంజిన్‌తో నడిచే ఈ ఎస్యూవీ 5-స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ట్రాన్స్మిషన్ ఎంపికలను పొందుతుంది. ఎస్యూవీ పెట్రోల్ హైబ్రిడ్ వర్షెన్లోని ఇంజిన్.. 101బీహెచ్పీ పవర్, 136.8ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎస్యూవీ పెట్రోల్ సీఎన్జీ వెర్షన్ 99బిహెచ్ పీ పవర్, 136ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. సీఎన్జీ మోడ్‌లో.. ఇది 86 బీహెచ్పీ పీక్ పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
సంబంధిత కథనం