Maruti Suzuki Brezza on road price in Hyderabad : హైదరాబాద్​లో బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..-check out maruti suzuki brezza on road price in hyderabad details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Brezza On Road Price In Hyderabad : హైదరాబాద్​లో బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Maruti Suzuki Brezza on road price in Hyderabad : హైదరాబాద్​లో బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu
Feb 18, 2024 11:15 AM IST

Maruti Suzuki Brezza price : మారుతీ సుజుకీ బ్రెజా ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..
హైదరాబాద్​లో బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Maruti Suzuki Brezza on road price : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో.. బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. అంతేకాకుండా.. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీకి కూడా ఈ బ్రెజా బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​. తక్కువ ధరకు, మంచి ఎస్​యూవీ కొనాలని చూస్తున్న వారికి మారుతీ సుజుకీ బ్రెజా చక్కటి ఆప్షన్​ అవుతుందని నిపుణులు చెబుతున్నాయి. మరి మీరూ ఒక ఎస్​యూవీని కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్​లో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఆన్​రోడ్​ ప్రైజ్​..

మారుతీ సుజుకీ బ్రెజా ఎల్​ఎక్స్​ఐ (పెట్రోల్​)- రూ. 9,74,862

ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ- రూ. 10.86 లక్షలు

వీఎక్స్​ఐ (పెట్రోల్​)- రూ. 11.32 లక్షలు

వీఎక్స్​ఐ సీఎన్​జీ- రూ. 12.85 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ (పెట్రోల్​)- రూ. 13.38 లక్షలు

వీఎక్స్​ఐ ఏటీ (పెట్రోల్​)- రూ. 13.50 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ డీటీ (పెట్రోల్​)- రూ. 13.57 లక్షలు

Maruti Suzuki Brezza 2023 on road price : జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ- రూ. 14.53 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ డీటీ- రూ. 14.72 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ (పెట్రోల్​)- రూ. 15.10 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ఏటీ (పెట్రోల్​)- రూ. 15.18 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ డీటీ (పెట్రోల్​)- రూ. 15.29 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ఏటీ డీటీ (పెట్రోల్​)- రూ. 15.37 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏటీ (పెట్రోల్​)- రూ. 16.90 లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏటీ డీటీ (పెట్రోల్​)- రూ. 17.09 లక్షలు

Maruti Suzuki Brezza : అంటే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 9.78 లక్షలు- రూ. 17.09 లక్షల మధ్యలో ఉన్నట్టు!

ఇదీ చూడండి:- Tata Nexon on road price in Hyderabad : హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

2024 జనవరిలో అమ్ముడుపోయిన టాప్​ 10 ఎస్​యూవీల్లో.. ఈ మారుతీ సుజుకీ బ్రెజా మూడో స్థానంలో ఉంది. జనవరిలో.. 15,303 బ్రెజా యూనిట్​లను సంస్థ సేల్​ చేయగలిగింది. గతేడాది ఇదే టైమ్​తో పోల్చుకుంటే.. అది 7శాతం అధికం! ఇక టాప్​ 10 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల లిస్ట్​లో.. మొదటి రెండు స్థానాల్లో టాటా మోటార్స్​కి చెందిన టాటా పంచ్​, టాటా నెక్సాన్​ ఎస్​యూవీలు ఉన్నాయి.

Maruti Suzuki Brezza on road price in Hyderabad : సాధారణంగా.. వెహికిల్​ లాంచ్​ చేసే సమయంలో.. దాని ఎక్స్​షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తుంది సంబంధిత ఆటోమొబైల్​ సంస్థ. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​.. ఎక్స్​షోరూం ధర కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో.. ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు కేవలం ఎక్స్​షోరూం ధర చూసి బడ్జెట్​ వేసుకోకూడదు! వెహికిల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ని చూసి ప్లాన్​ చేసుకోవాలి.

మారుతీ సుజుకీ బ్రెజా ఆన్​రోడ్​ ప్రైజ్​, ఫీచర్స్​తో పాటు ఇతర వివరాల కోసం మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​కు వెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం