Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?-tata punch ev vs tata punch petrol vs tata punch cng what to buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Sharath Chitturi HT Telugu
Apr 29, 2024 11:45 AM IST

Tata Punch on road price Hyderabad : టాటా పంచ్​ పెట్రోల్​, టాటా పంచ్​ ఈవీ, టాటా పంచ్​ సీఎన్​జీ.. ఈ మూడింట్లో ఏది కొనాలి? ఏది కొంటే బెటర్​? ఇక్కడ చూడండి..

టాటా పంచ్​ పెట్రోల్, ఈవీ, సీఎన్​జీ.. ఏది కొనాలి?
టాటా పంచ్​ పెట్రోల్, ఈవీ, సీఎన్​జీ.. ఏది కొనాలి?

Tata Punch EV on road price Hyderabad : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో.. ఎస్​యూవీల దండయాత్ర కొనసాగుతోంది. ఇక టాటా పంచ్​తో బంపర్​ హిట్​ కొట్టింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. టాటా పంచ్​ పెట్రోల్​ మోడల్​ ఒక్కటే కాదు.. సీఎన్​జీ, ఈవీ మోడల్స్​ని కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మూడూ కూడా సేల్స్​ పరంగా దూసుకెళుతున్నాయి. ఇలా.. పెట్రోల్​, సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వర్షెన్​లు ఉన్న ఏకైక టాటా మోటార్స్​ కారు.. ఈ టాటా పంచ్​. అంతేకాదు.. గత కొన్ని నెలలుగా.. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ వెహికిల్స్​లో నెంబర్​ 1 స్థానంలో ఉంది ఈ ఎస్​యూవీ. ఈ నేపథ్యంలో.. చాలా మంది కస్టమర్లు.. పంచ్​ కొనాలని చూస్తున్నారు. కానీ.. మూడు ఆప్షన్స్​ ఉండేసరికి.. ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే.. ఇది మీకోసమే. టాటా పంచ్​ పెట్రోల్​, టాటా పంచ్​ సీఎన్​జీ, టాటా పంచ్​ ఈవీలో ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్ ఈవీ వర్సెస్ టాటా పంచ్ పెట్రోల్ వర్సెస్ టాటా పంచ్ సీఎన్​జీ: ధర

టాటా పంచ్ ఈవీ ధర రూ .10.99 లక్షల నుంచి రూ .15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మరోవైపు.. టాటా పంచ్ పెట్రోల్ ధర రూ. 6.13 లక్షల నుంచి 10.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. టాటా పంచ్ సీఎన్​జీ వేరియంట్​ ధరలు రూ .7.23 లక్షల నుంచి రూ .9.85 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ వర్సెస్ టాటా పంచ్ పెట్రోల్ వర్సెస్ టాటా పంచ్ సీఎన్​జీ: స్పెసిఫికేషన్లు..

Tata Punch on road price Hyderabad : టాటా పంచ్ ఈవీలో.. 60/90 కిలోవాట్ల పర్మనెంట్​ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. పంచ్ ఈవీలోని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ 120 బీహెచ్​పీ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

టాటా పంచ్ పెట్రోల్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ అయ్యి ఉంటుంది. అదే సమయంలో ఏఎమ్​టీ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 87బీహెచ్​పీ పవర్, 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

మరోవైపు.. టాటా పంచ్ సీఎన్​జీలో.. 1.2-లీటర్ ఇంజిన్​ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​కి కనెక్ట్​ అయ్యి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72బీహెచ్​పీ పవర్, 103ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Tata Punch CNG on road price Hyderabad : టాటా మోటార్స్​ వెహికిల్స్​ అంటే.. సేఫ్టీకి పెట్టింది పేరని మంచి గుర్తింపు ఉంది. టాటా పంచ్​ కూడా అంతే! గ్లోబల్ ఎన్​సీఏపీ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్​తో భారతదేశంలో సురక్షితమైన ఎస్​యూవీల్లో ఒకటిగా నిలిచింది ఈ టాటా పంచ్​. ఇందులో చాలా ఎగ్జైటింగ్​ ఫీచర్స్​ కూడా ఉన్నాయి. అందుకే.. టాటా పంచ్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం