Kia Carens : ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కియా క్యారెన్స్కి.. సేఫ్టీ టెస్ట్‌లో మూడే స్టార్లు!
Kia Carens Global NCAP crash test : గ్లోబల్ క్రాష్ టెస్ట్‌లో కియా క్యారెన్స్కి 3 స్టార్ రేటింగ్ వచ్చింది. హోండా అమేజ్‌కు 2 స్టార్లే దక్కాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
Kia Carens safety rating : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్‌కు.. ఇండియాలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటి కియా క్యారెన్స్. ఈ ఎంపీవీకి సంబంధించిన గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..
కియా క్యారెన్స్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్..
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో కియా క్యారెన్స్కి 5 స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అయితే.. కియా క్యారెన్స్ని రెండుసార్లు టెస్ట్ చేయడం జరిగింది. మొదటిసారి టెస్ట్ చేసినప్పుడు.. అడల్ట్ ప్రొటెక్షన్‌లో ఈ ఎంపీవీకి 0 రేటింగ్ రావడం ఇందుకు కారణం. 2023 మే నుంచి 2023 డిసెంబర్ వరకు తయారన యూనిట్స్‌కి 0 స్టార్ రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత తయారైన యూనిట్లకు 3 స్టార్ రేటింగ్ వచ్చింది. క్యారెన్స్‌లో కాస్త సేఫ్టీ ఫీచర్స్‌ని జోడించడం ఇందుకు కారణం.
Kia Carens safety rating 2024 : గ్లోబల్ ఎన్సీపీ క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన కియా క్యారెన్స్ ఎంపీవీలో ఫ్రెంట్ ఎయిర్‌బ్యాగ్స్, బెల్ట్- ప్రిటెషనర్స్, బెల్ట్ లోడ్ లిమిటర్స్, సైడ్ హెడ్ కర్టైన ఎయిర్‌బ్యాగ్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఉన్నాయి.
ఇదీ చూడండి:- Most unsafe cars in India : ఈ కార్లు కొంటే.. ప్రాణాలు గాల్లోనే! భద్రతలో ‘0’ రేటింగ్..
కియా క్యారెన్స్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రకారం.. డ్రైవర్, ప్యాసింజర్ హెడ్‌కి సంబంధించిన ఫ్రెంటల్ ఇంపాక్ట్ బాగానే ఉంది. కానీ డ్రైవర్ మెడకు అందిన ప్రొటెక్షన్ సరిపోలేదు. ప్యాసింజర్ మెడకు సరైన రక్షణ లభించింది. డ్రైవర్ ఛాతి రక్షణ కూడా సంతృప్తికరంగానే ఉంది. ప్యాసింజర్ ఛాతి సంరక్షణ కూడా బాగానే ఉంది. కానీ డ్రైవర్, ప్యాసింజర్ మోకాళ్ల రక్షణ అంతంతమాత్రంగానే ఉంది. బాడీషెల్ అన్‌స్టేబుల్‌గా ఉంది. మరింత లోడ్ పడితే భరించడం కష్టమైంది.
సైడ్ ఇంపాక్ట్ విషయానికొస్తే తల, ఛాతీ, కడుపు లభించిన రక్షణ బాగానే ఉంది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ జరగలేదు. అన్ని వేరియంట్స్‌లో 3 పాయింట్ సీట్ బెల్ట్స్ని స్టాండర్డ్‌గా అందిస్తోంది కియా మోటార్స్.
హోండా అమేజ్‌కి 2 స్టార్లే..!
Honda Amaze safety ratings 2024 : మరో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండాకు చెందిన హోండా అమేజ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది! గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో.. ఈ వెహికిల్‌కి 2 స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. చైల్డ్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో దారుణంగా విఫలం అవ్వడం ఇందుకు ప్రధాన కారణం. అడల్ట్ ప్రొటెక్షన్ విభాగం కూడా అంతంతమాత్రంగానే ఉంది. 5ఏళ్ల క్రితం.. ఇదే మోడల్ని గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్ చేయగా.. అప్పుడు 4 స్టార్ రేటింగ్ రావడం గమనార్హం. గతేడాది లాంచ్ చేసిన సరికొత్త క్రాష్ టెస్ట్ రూల్స్‌ని అమలు చేయగా.. హోండా అమేజ్ విఫలమైంది.
సంబంధిత కథనం