Most unsafe cars in India : ఈ కార్లు కొంటే.. ప్రాణాలు గాల్లోనే! భద్రతలో ‘0’ రేటింగ్..
Cars with poor safety rating : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇండియాలో సేఫ్టీ పరంగా దారుణంగా విఫలమైన కార్ల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
Most unsafe cars in India : ఇండియాలో.. కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కొత్త కొత్త ఫీచర్స్‌తో మంచి కారు కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికీ చాలా మంది ప్రైయారిటీ.. 'సేఫ్టీ'. ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్ కార్లు ఏవి? అంటే టాటా పంచ్, టాటా నెక్సాన్, మహీంద్రా వెహికిల్స్ గుర్తొస్తాయి. మరి.. భద్రత విషయంలో దారుణంగా ఉన్న వెహికిల్స్ ఏవి? గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో దారుణంగా విఫలమై, ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళనకరంగా మారిన వాహనాలు ఏవి? ఇక్కడ తెలుసుకోండి..
సిట్రోయెన్ ఈసీ3:-
ఫ్రెంచ్ ఆటో సంస్థ సిట్రోన్.. ఇండియాలో లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ సిట్టోయెన్ ఈసీ3. కానీ.. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో దీనికి 0 స్టార్ రేటింగ్ వచ్చింది. గత వారమే ఈ రిజల్ట్స్ బయటకి వచ్చాయి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో సిట్రోయెన్ ఈసీ3కి జీరో స్టార్ వచ్చింది. ప్యాసింజర్ ఛేస్ట్, డ్రైవర్ ఛేస్ట్ భాగాలకు ఇందులో అసలు ప్రొటెక్షనే లేదని గ్లోబల్ ఎన్సీఏపీ చెప్పింది. ఇక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో కేవలం ఒక్కటే స్టార్ దక్కించుంది ఈ ఈవీ. ఈ కారులో ఎక్కడా 3-పాయింట్ బెల్ట్‌లు లేవు. ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డిస్కనెక్షన్ స్విచ్ కూడా లేదు.
మారుతీ వాగన్ఆర్:-
Indian cars with poor safety rating : ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్బ్యాక్స్లో ఒకటైన వాగన్ఆర్ కూడా.. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైంది. ఈ వాగన్ఆర్కు చైల్డ్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో జీరో రేటింగ్ వచ్చింది. మొత్తం మీద దీనికి ఒక్కటంటే.. ఒక్కటే స్టార్ లభించింది.
మారుతీ సుజుకీ స్విఫ్ట్:-
మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కి.. 2022లో గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ జరిగింది. పలు షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. సేఫ్టీ విషయంలో ఈ స్విఫ్ట్ హ్యచ్బ్యాక్కి కేవలం 1 స్టార్ రేటింగ్ దక్కింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీ, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీల్లో.. దీనికి ఒక్కటే రేటింగ్ దక్కింది.
మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కి త్వరలోనే అప్డేటెడ్ వర్షెన్ రాబోతోంది. మరి దీని సేఫ్టీ రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
మారుతీ ఎస్-ప్రెస్సో:-
Cars with poor safety rating Global NCAP : మారుతీ ఎస్ ప్రెస్సోకి కూడా 2022లోనే గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ జరిగింది. డ్రైవర్- ప్యాహింజర్ తల, మెడ వియంలో ప్రొటెక్షన్ డీసెంట్‌గానే ఉంది. కానీ డ్రైవర్ ఛేస్ట్లో 1 స్టార్ మాత్రమే వచ్చింది. డ్రైవర్ మోకాళ్ల ప్రొటెక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉందని తేలింది.
రెనాల్ట్ క్విడ్:-
రెనాల్ట్‌కి.. ఇండియాలో ఎంట్రీ లెవల్ హ్యచ్బ్యాక్గా ఉంది క్విడ్. సేల్స్ పరంగా.. సంస్థకు ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికిల్ అనే చెప్పుకోవాలి. కానీ.. సేఫ్టీ విషయంలో మాత్రం రెనాల్ట్ క్విడ్ డీలా పడింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ అడల్ట్ ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్‌లో కేవలం 1 స్టార్ మాత్రే దక్కించుకుంది.
పైన చెప్పిన లిస్ట్‌లోని 5 వాహనాల్లో.. 3 మారుతీ సుజుకీ సంస్థవే!
సంబంధిత కథనం