Kwid vs Alto K10: 2024 రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో కే 10; ఏది బెస్ట్?-2024 renault kwid vs maruti suzuki alto k10 price and specification comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kwid Vs Alto K10: 2024 రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో కే 10; ఏది బెస్ట్?

Kwid vs Alto K10: 2024 రెనో క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో కే 10; ఏది బెస్ట్?

HT Telugu Desk HT Telugu
Published Jan 10, 2024 05:37 PM IST

Kwid vs Alto K10: విజయవంతమైన హ్యాచ్ బ్యాక్ మోడల్ క్విడ్ లో 2024 వర్షన్ ను ఇటీవల రెనో ఇండియా (Renault India) మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది మారుతి సుజుకి ఆల్టో కే 10 కి గట్టి పోటీ ఇవ్వనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Kwid vs Alto K10: రెనో ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్ 2024 మోడల్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పటికే కిగర్, ట్రైబర్ 2024 మోడల్స్ ను రెనో మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, క్విడ్ 2024 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త క్విడ్ లో మూడు కొత్త డ్యూయల్-టోన్ కలర్ వేరియంట్లను ఇంట్రడ్యూస్ చేశారు.

చవకైన ఆటో మోడల్

క్విడ్ 2024 RXL (O) వేరియంట్ ఇప్పుడు ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫీచర్‌ ఉన్న అత్యంత చవకైన హ్యాచ్‌బ్యాక్‌గా క్విడ్ (Renault Kwid) నిలిచింది. అలాగే, క్విడ్ యొక్క ఈ వేరియంట్ ఇప్పుడు AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారుగా నిలిచింది. రెనో క్విడ్ లో 14 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఆల్టో కే 10 తో పోటీ..

రెనో క్విడ్ (Renault Kwid) ప్రధానంగా మారుతి సుజుకి ఆల్టో కే 10 (Maruti Suzuki Alto K10) తో పోటీపడుతుంది. ఆల్టో కే 10 చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఉంది. ఈ రెండు కార్ల మధ్య ప్రధాన మైన వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి..

Price: ధర

2024 రెనో క్విడ్ ధర రూ. 4.69 లక్షల నుండి రూ. 6.12 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య, మారుతి సుజుకి ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షల మధ్య లభిస్తుంది. రెనో క్విడ్ RXL(O) AMT వేరియంట్ ధర రూ. 5.44 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారుగా ఉంది. అయితే, దీనికి అత్యంత సమీప పోటీదారు మారుతి సుజుకి ఆల్టో K120 VXI AGS. ధర రూ. 5.61 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Specification: స్పెసిఫికేషన్స్

లేటెస్ట్ రెనొ క్విడ్ పవర్‌ట్రెయిన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇందులో 67 బిహెచ్‌పి పీక్ పవర్, 91 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయగల 1.0-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT యూనిట్ యొక్క ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

ఆటో గేర్ షిఫ్ట్

మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) లో 1.0-లీటర్ కె10 సి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీనిని ఆటో గేర్ షిఫ్ట్ లేదా AGS అని పిలుస్తారు. ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ 65 bhp గరిష్ట శక్తిని, 89 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. Alto K10 పెట్రోల్, పెట్రోల్-CNG ఇంధన ఎంపికలలో అందుబాటులో ఉంది. రెనో క్విడ్‌లో CNG ఆప్షన్ లేదు. పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఆల్టో కె10 కంటే క్విడ్ కొంచెం ఎక్కువ పవర్, ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Whats_app_banner