Maruti Wagon R on road price in Hyderabad : హైదరాబాద్‌లో వాగన్ ఆర్ ఆన్‌రోడ్ ప్రైజ్..
Maruti Wagon R price in Hyderabad : మారుతీ వాగన్ ఆర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్‌లో వాగన్ ఆర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Maruti Wagon R on road price Hyderabad : ఇండియాలో మారుతీ సుజుకీ వాహనాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మొత్తం మీద 1,97,471 యూనిట్లను విక్రయించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. వీటిల్లో దేశీయ సేల్స్ నెంబర్ 1,63,397. కంపెనీకి చెందిన కాంపాక్ట్ సెగ్మెంట్ బాగా రాణించింది. ఫిబ్రవరి 71,627 యూనిట్లు ఈ కాంపాక్ట్ సెగ్మెంట్ నుంచి అమ్ముడుపోయాయి. మరీ ముఖ్యంగా.. కాంపాక్ట్ సెగ్మెంట్లోని వాగన్ ఆర్కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. తక్కువ ధరకు, మంచి ఫీచర్స్ కావాలని చూస్తున్న కస్టమర్లకు.. ఈ వాగన్ ఆర్ మంచి ఆప్షన్‌గా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరు కూడా ఒక వాగన్ ఆర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్‌లో వాగన్ ఆర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబద్‌లో వాగన్ఆర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
మారుతీ వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ:- రూ. 6,52,268
వీఎక్స్ఐ- రూ. 7.04 లక్షలు
జెడ్ఎక్స్ఐ:- రూ. 7.43 లక్షలు
ఎల్ఎక్స్ఐ సీఎన్జీ:- రూ. 7.57 లక్షలు
వీఎక్స్ఐ ఏటీ:- రూ. 7.68 లక్షలు
Maruti Wagon R : జెడ్ఎక్స్ఐ ప్లస్:- రూ. 7.98 లక్షలు
జెడ్ఎక్స్ఐ ఏటీ:- రూ. 8.06 లక్షలు
ఇదీ చూడండి:- Tata Punch on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
వీఎక్స్ఐ సీఎన్జీ:- రూ. 8.09 లక్షలు
జెడ్ఎక్స్ఐ డ్యూయెల్ టోన్:- రూ. 8.12 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ:- రూ. 8.61 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ డ్యూయెల్ టోన్:- రూ. 8.75 లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో మారుతీ వాగన్ ఆర్ ఆన్‌రోడ్ ప్రైజ్ రేంజ్ రూ. 6.52లక్షలు- రూ. 8.75 లక్షల మధ్యలో ఉంటుంది. సీఎన్జీ అని చెప్పిన మోడల్స్ మినహా.. మిగిలినవి అన్ని పెట్రోల్ ఇంజిన్ ఉన్నవే. మారుతీ వాగన్ ఆర్‌లో డీజిల్ మోడల్ లేదు!
Maruti Suzuki latest news : ఇక మారుతీ వాగన్ ఆర్‌లో వీఎక్స్ఐ సీఎన్జీ, వీఎక్స్ఐ పెట్రోల్ మోడల్స్.. బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప మారుతీ సుజుకీ డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
సాధారణంగా.. వెహికిల్‌ని లాంచ్ చేసేటప్పుడు.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే చెబుతుంది ఆటోమొబైల్ సంస్థ. కానీ ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్.. ఎక్స్‌షోరూం ప్రైజ్ కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో.. ట్యాక్స్‌లు అనేవి వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. ఏదైనా బండి కొనాలని ప్లాన్ చేస్తుంటే, దాని ఎక్స్‌షోరూం ధర కాకుండా.. ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి. డీలర్షిప్ షోరూమ్స్ని సంప్రదిస్తే.. ఏవైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్నాయా? అన్న వివరాలు కూడా తెలుస్తాయి.
సంబంధిత కథనం