Flash Back: స్టార్ హీరో అజిత్ మంచి మనసు.. చెడుగా మాట్లాడాడని డ్రైవర్ తొలగింపు.. ఆ తర్వాత కూడా పెద్ద సాయం-ajith kumar help to his driver even if he made a mistake painful story ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Flash Back: స్టార్ హీరో అజిత్ మంచి మనసు.. చెడుగా మాట్లాడాడని డ్రైవర్ తొలగింపు.. ఆ తర్వాత కూడా పెద్ద సాయం

Flash Back: స్టార్ హీరో అజిత్ మంచి మనసు.. చెడుగా మాట్లాడాడని డ్రైవర్ తొలగింపు.. ఆ తర్వాత కూడా పెద్ద సాయం

Published Aug 30, 2023 07:02 PM IST Chatakonda Krishna Prakash
Published Aug 30, 2023 07:02 PM IST

Ajit Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. తన గురించి చెడుగా మాట్లాడిన ఓ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు. అయితే, ఆ తర్వాత కూడా అతడికి సాయం చేశారు. హృదయాన్ని కదిలించే స్టోరీ ఇదే. 

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో ఓ వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఒకరోజు అతడు అజిత్ గురించి చెడుగా మాట్లాడాడు. అజిత్ ఇంట్లో లేడనుకొని అతడు అలా మాట్లాడాడు. అయితే, ఇది అజిత్ చెవిన పడింది. దీంతో ఆరు నెలల జీతం ఇచ్చి ఆ డ్రైవర్‌ను ఇంటికి పంపేశారు అజిత్. ఉద్యోగం నుంచి తీసేశారు. 

(1 / 4)

ఆ తర్వాత ఒక రోజు అజిత్ కుమార్ మేనేజర్‌కు ఓ కాల్ వచ్చింది. అజిత్ పనిలో నుంచి తీసేసిన డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‍కు తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని అజిత్‍ అడిగి తెలుసుకున్నారు.

(2 / 4)

అజిత్ దగ్గర మంచి జీతానికి పని చేస్తున్నందున ఆ డ్రైవర్ అప్పట్లో లోన్ తీసుకొని ఓ ఇళ్లు కొన్నాడు. లోన్ సులువుగా తీర్చవచ్చని అనుకున్నాడు. అయితే, ఊహించని కారణం వల్ల అజిత్ వద్ద అతడి ఉద్యోగం పోయింది. అతడు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. 

(3 / 4)

అయితే, లోన్ చెల్లించలేని తన మాజీ డ్రైవర్ పరిస్థితి చూసి అజిత్ చలించారు. అతడి కోసం అజిత్ రూ.7లక్షల రుణాన్ని ఒకేసారి తీర్చేశారు. మంచి మనసు చాటుకున్నారు. దీని గురించి అజిత్ ఓ సందర్భంలో మాట్లాడారు. 'నా గురించి తప్పుగా మాట్లాడినందుకు నేను ఉద్యోగం నుంచి అతడిని తొలగించా. కానీ అతడు నన్ను నమ్మి లోన్ తీసుకున్నాడు. ఆ రుణానికి నాదే బాధ్యత" అని అజిత్ చెప్పారు.

(4 / 4)

ఇతర గ్యాలరీలు