Honda Amaze : సరికొత్త అవతారంలో హోండా అమేజ్​.. త్వరలోనే లాంచ్​!-honda amaze 2024 launch expected sooner than initially speculated check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Amaze : సరికొత్త అవతారంలో హోండా అమేజ్​.. త్వరలోనే లాంచ్​!

Honda Amaze : సరికొత్త అవతారంలో హోండా అమేజ్​.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Apr 08, 2024 12:05 PM IST

Honda Amaze price in India : కాంపాక్ట్​ సెడాన్​.. హోండా అమేజ్​ అప్డేటెడ్​ వర్షెన్​ త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

థర్జ్​ జెనరేషన్​​ హోండా అమేజ్​ వచ్చేస్తోంది..
థర్జ్​ జెనరేషన్​​ హోండా అమేజ్​ వచ్చేస్తోంది..

Honda Amaze on road price Hyderabad : జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండాకు ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కాంపాక్ట్​ సెడాన్​గా ఉంది అమేజ్​. ఇక ఇప్పుడు.. ఈ హోండా అమేజ్​కి అప్డేటెడ్​ వర్షెన్​ని తీసుకొస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. థర్జ్​ జెనరేషన్​ హోండా అమేజ్.. 2024 పండుగ సీజన్​లో లాంచ్ అవుతుందని తొలుత ఊహాగానాలు జోరుగా సాగాయి. కానీ ఇప్పుడు.. పండుగ సీజన్​ కన్నా ముందే, అంటే.. మరో రెండు మూడు నెలల్లోనే ఈ సెడాన్​ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రిపోర్టుల ప్రకారం.. ప్రస్తుత హోండా అమేజ్​కి సంబంధించిన యూనిట్​లు డీలర్లకు చాలా వారాలుగా అందలేదు! కాగా.. ఈ నెల ప్రారంభంలో.. సెకెండ్​ జెనరేషన్​ అమేజ్​లోని మొత్తం ఐదు సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్​ను స్టాండర్డ్​గా యాడ్​ చేసింది. అదనంగా రెండు వేరియంట్లకు మాత్రమే హోండా అమేజ్​ని కుదించింది సంస్థ. అవి.. ఎస్​, వీఎక్స్​.

అప్డేటెడ్​ హోండా అమేజ్​పై భారీ అంచనాలు..

Honda Amaze updated version : నివేదికల ప్రకారం.. త్వరలో లాంచ్​ అవుతున్నథర్జ్​ జెనరేషన్​ హోండా అమేజ్.. సిటీ, ఎలివేట్ మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. కానీ.. తక్కువ వీల్​బేస్​తో సహా కొన్ని మార్పులు ఉండొచ్చు. ఇండియా వెహికిల్స్​ కోసం ప్రస్తుతం రెండు ప్లాట్​ఫామ్స్​ని ఉపయోగిస్తోంది హోండా. ఇక హోండా అమేజ్​ని కూడా మాడిఫై చేస్తుండటంతో.. ఆ రెండు ప్లాట్​ఫామ్స్​ ఇప్పుడు ఒక దానికే కుదించనుంది.

కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైన్.. అంతర్జాతీయంగా విక్రయించే పెద్ద హోండా సెడాన్ల నుంచి స్ఫూర్తి పొందుతుందని సమాచారం. ఇది సెకెండ్​ జెనరేషన్​ అమేజ్ ట్రెండ్​ని కొనసాగిస్తుంది. థర్డ్​ జెనరేషన్​ మోడల్ ఇంటీరియర్​ని రీడిజైన్ చేయనుంచి సంస్థ. ఎలివేట్​లో కనిపించే మాదిరిగానే పెద్ద, ఇండిపెండెంట్​ టచ్​స్క్రీన్​ కలిగి ఉంటుంది. ఖర్చులను నిర్వహించడానికి, కొత్త అమేజ్ ఇంటీరియర్ భాగాలను భారతదేశంలోని ఇతర హోండా మోడళ్లతో పంచుకోవచ్చు.

Honda India : థర్డ్​ జెనరేషన్​ హోండా అమేజ్​లో ప్రస్తుతం.. 1.2-లీటర్, 4 సిలిండర్​, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్​ ఉంది. ఇది.. 89 బీహెచ్​పీ పవర్​ని.. 110 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజీన్.. 5-స్పీడ్ మేన్యువల్- సీవీటీ ఆటోమేటిక్ గేర్​బాక్స్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. భారతదేశంలో హోండా డీజిల్ ఇంజిన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. అందుకే.. కొత్త, అప్డేటెడ్​ హోండా అమేజ్​లో కూడా డీజిల్​ ఇంజిన్​ దాదాపు ఉండదు. పెట్రోల్​ వేరియంట్లు మాత్రమే ఉంటాయి.

ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. హోండా అమేజ్​ అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్ డేట్​​, ధర, ఫీచర్స్​ వంటి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై సంస్థ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం