Elevate vs Grand Vitara : హోండా ఎలివేట్​ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా తీసుకోవాలా?-honda elevate vs maruti suzuki grand vitara which should be you choice ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elevate Vs Grand Vitara : హోండా ఎలివేట్​ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా తీసుకోవాలా?

Elevate vs Grand Vitara : హోండా ఎలివేట్​ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా తీసుకోవాలా?

Sharath Chitturi HT Telugu
Oct 29, 2023 11:48 AM IST

Honda Elevate vs Maruti Suzuki Grand Vitara : హోండా ఎలివేట్​ వర్సెస్​ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా.. ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

హోండా ఎలివేట్​ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా తీసుకోవాలా?
హోండా ఎలివేట్​ కొనాలా? మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా తీసుకోవాలా?

Honda Elevate vs Maruti Suzuki Grand Vitara : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పుడు చాలా ఆప్షన్స్​ లభిస్తున్నాయి. ఇక లేటెస్ట్​ ఎంట్రీ హోండా ఎలివేట్​కి కూడా మంచి డిమాండ్​ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీని.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాతో పోల్చి.. ఈ రెండింట్లో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు ఎస్​యూవీల లుక్స్​ ఇవే..

హోండా ఎలివేట్​లో కర్వ్​డ్​ ఎడ్జ్​లతో కూడిన ఫ్లాట్​ బానెట్​, బ్లాక్​డ్​ ఔట్​ గ్రిల్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, డీఆర్​ఎల్స్​, డోర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, 16 ఇంచ్​ డైమెండ్​ కట్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనా, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​ వంటివి వస్తున్నాయి.

Honda Elevate on road price Hyderabad : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాలో స్కల్ప్​టెడ్​ బానెట్​, క్రోమ్​ స్టడెడ్​ గ్రిల్​, బంపర్​ మౌంటెడ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, స్ప్లిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​, స్కిడ్​ ప్లేట్స్​, వీల్​ ఆర్చీస్​, 17 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ ఉన్నాయి.

ఈ రెండు ఎస్​యూవీల ఫీచర్స్​ ఇవే..

హోండా ఎలివేట్​ స్పేషియస్​ 5 సీటర్​ కేబిన్​లో సింగిల్​ పేన్​ సన్​రూఫ్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, హోండా సెన్సింగ్​ ఏడీఏఎస్​ ఫీచర్స్​ వంటివి ఉన్నాయి.

గ్రాండ్​ విటారాలో 5 సీటర్​ స్పేషియస్​ కేబిన్​లో హెడ్​ అప్​ డిస్​ప్లే, పానారోమిక్​ సన్​రూఫ్​, యాంబియెంట్​ లైటింగ్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి వస్తాయి.

ఈ రెండు వాహనాల్లోని ఇంజిన్​ ఆప్షన్స్​..

Honda elevate price Hyderabad : హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​, డీఓహెచ్​సీ, ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది.ఇది 119 హెచ్​పీ పవర్​ను, 145ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాలో 1.5 లీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ పెట్రోల్​ ఇంజిన్​ (115 హెచ్​పీ- 141 ఎన్​ఎం), 1.5 లీటర్​ కే సిరీస్​ మైల్డ్​ హైబ్రీడ్​ ఇంజిన్​ (103 హెచ్​- 135ఎన్​ఎం) ఉంటాయి. 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​, సీవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి.

ఈ రెండు ఎస్​యూవీల ధరలు ఇవే..

Maruti Suzuki Grand Vitara price Hyderabad : ఇండియాలో హోండా ఎలివేట్​ ఎక్స్​షోరూం ధర రూ. 11లక్షలు- రూ. 16లక్షల మధ్యలో ఉంటుంది. ఇక గ్రాండ్​ విటారా ఎక్స్​షోరూం ధర రూ. 10.7లక్షలు- రూ. 19.95లక్షల మధ్యలో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం