Honda Elevate : హోండా ఎలివేట్​కు క్రేజీ డిమాండ్​.. అప్పుడే 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​!-honda elevate suv gets huge demand results in 6 months waiting period ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Elevate : హోండా ఎలివేట్​కు క్రేజీ డిమాండ్​.. అప్పుడే 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​!

Honda Elevate : హోండా ఎలివేట్​కు క్రేజీ డిమాండ్​.. అప్పుడే 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​!

Sharath Chitturi HT Telugu
Sep 11, 2023 02:12 PM IST

Honda Elevate waiting period : కొన్ని రోజుల క్రితం లాంచ్​ అయిన హోండా ఎలివేట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ ఎస్​యూవీలోని కొన్ని వేరియంట్లకు ఇప్పటికే 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది!

హోండా ఎలివేట్​కు క్రేజీ డిమాండ్​.. అప్పుడే 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​!
హోండా ఎలివేట్​కు క్రేజీ డిమాండ్​.. అప్పుడే 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​! (PTI)

Honda Elevate SUV waiting period : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో హోండా సంస్థకు ఇంతకాలం ఒక్క వెహికిల్​ కూడా లేదు. తాజాగా లాంచ్​ అయిన హోండా ఎలివేట్​.. ఈ లోటును తీర్చేసిందనే చెప్పుకోవాలి! అంతేకాకుండా.. ఈ మోడల్​ సూపర్​ హిట్​ కొట్టినట్టు కనిపిస్తోంది. భారతీయుల నుంచి ఈ మోడల్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోందని హోండా సంస్థ చెబుతోంది. అంతేకాదు.. లాంచ్​ అయిన కొన్ని రోజులకే, ఈ మోడల్​ వెయిటింగ్​ పీరియడ్​ 6 నెలలు దాటేసింది!

క్రేజీ డిమాండ్​..!

హోండా ఎలివేట్​ ఎస్​యూవీని.. సెప్టెంబర్​ 4న లాంచ్​ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వెహికిల్​ కోసం బుకింగ్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా వెయిటింగ్​ పీరియడ్​ 6నెలలకు చేరింది. మరీ ముఖ్యంగా.. టోటల్​ బుకింగ్స్​లో టాప్​ ఎండ్​ వేరియంట్స్​కే 60శాతం వాటా ఉండటం విశేషం.

Honda Elevate price : ఎలివేట్​ ఎస్​యూవీ టాప్​ ఎండ్​ వేరియంట్లు వీఎక్స్​, జెడ్​ఎక్స్​లకు 6 నెలల కన్నా ఎక్కువ వెయిటింగ్​ పీరియండ్​ ఉంది. మరోవైపు బేస్​ వేరియంట్లు ఎస్​వీ, వీ కోసం కనీసం 2 నుంచి 3 నెలల వెయిట్​ చేయాల్సి వస్తుంది. ఇలాంటి డిమాండే కొనసాగితే.. వెయిటింగ్​ పీరియడ్​ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

హోండా ఎలివేట్​ విశేషాలివే..

ఈ హోండా కొత్త ఎస్​యూవీ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ థీమ్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జర్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, హోండా సెన్సింగ్​ ఏడీఏఓఎస్​ సూట్​ వంటివి లభిస్తున్నాయి. దాదాపు అన్ని అదునాతన ఫీచర్స్​ ఇందులో లభిస్తుండటం విశేషం.

ఇదీ చూడండి:- Honda Elevate EV : హోండా ఎలివేట్​కు ఈవీ టచ్​.. లాంచ్​ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన సంస్థ!

Honda Elevate price Hyderabad : హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​ ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 119 హెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బైక్స్​ దీని సొంతం. ఈ మోడల్​ మేన్యువల్​ వేరియంట్​ మైలేజ్​ 15.3 కేఎంపీఎల్​ అని, సీవీటీ వేరియంట్​ మైలేజ్​ 16.92 కేఎంపీఎల్​ అని సంస్థ చెబుతోంది.

హోండా ఎలివేట్​ ధర ఎంతంటే..

  • ఎస్​వీ ఎంటీ- రూ. 10.99లక్షలు
  • వీ ఎంటీ- రూ. 12,10,900
  • వీఎక్స్​ ఎంటీ- రూ. 13,49,000
  • Honda Elevate on road price Hyderabad : జెడ్​ఎక్స్​- రూ. 14,89,900
  • వీ సీవీటీ- రూ. 13,20,900
  • వీఎక్స్​ సీవీటీ- రూ. 14,59,900
  • జెడ్​ఎక్స్​- రూ. 15,99,900

హైదరాబాద్​లో హోండా ఎలివేట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం