Honda Elevate : హోండా ఎలివేట్​ లాంచ్​.. కొత్త ఎస్​యూవీ ధర ఎంతంటే..-honda elevate suv launched see feature price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Elevate : హోండా ఎలివేట్​ లాంచ్​.. కొత్త ఎస్​యూవీ ధర ఎంతంటే..

Honda Elevate : హోండా ఎలివేట్​ లాంచ్​.. కొత్త ఎస్​యూవీ ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Sep 04, 2023 01:16 PM IST

Honda Elevate : ఇండియాలో హోండా ఎలివేట్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా ఎలివేట్​ ఎస్​యూవీ లాంచ్​..
హోండా ఎలివేట్​ ఎస్​యూవీ లాంచ్​..

Honda Elevate launch : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో హోండా ఎలివేట్​ ఎస్​యూవీని తాజాగా లాంచ్​ చేసింది సంస్థ. డెలివరీలు కూడా ప్రారంభమైనట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎస్​యూవీ ఫీచర్స్​ ఇవే..

హోండ్​ ఎలివేట్​ ఎస్​యూవీ డిజైన్​ అట్రాక్టివ్​గా ఉంటుంది. ఇందులో స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, భారీ గ్రిల్​, ఫాగ్​ లైట్స్​ కోసం ట్రైయాంగ్యులర్​ హోజింగ్​, ఫౌక్స్​ స్కిడ్​ ప్లేట్స్​, 16 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ వంటివి లభిస్తున్నాయి. రూఫ్​ రెయిల్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, షార్క్​ ఫిన్​ యాంటీనా కూడా ఉన్నాయి.

ఈ హోండా కొత్త ఎస్​యూవీ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ థీమ్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జర్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, హోండా సెన్సింగ్​ ఏడీఏఓఎస్​ సూట్​ వంటివి లభిస్తున్నాయి. దాదాపు అన్ని అదునాతన ఫీచర్స్​ ఇందులో లభిస్తుండటం విశేషం.

హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​ ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 119 హెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బైక్స్​ దీని సొంతం. ఈ మోడల్​ మేన్యువల్​ వేరియంట్​ మైలేజ్​ 15.3 కేఎంపీఎల్​ అని, సీవీటీ వేరియంట్​ మైలేజ్​ 16.92 కేఎంపీఎల్​ అని సంస్థ చెబుతోంది.

ఇదీ చూడండి:- Tata Nexon Facelift : టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​లో ఉన్న 10 కొత్త ఫీచర్స్​ ఇవే..!

ఈ మోడల్​ ధర వివరాలివే..

Honda Elevate price in India : హోండా ఎలివేట్​లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ఎస్​వీ, వీ, వీఎక్స్​, జెడ్​ఎక్స్​. వాటి ఎక్స్​షోరూం ధరలు..

ఎస్​వీ ఎంటీ- రూ. 10.99లక్షలు

వీ ఎంటీ- రూ. 12,10,900

వీఎక్స్​ ఎంటీ- రూ. 13,49,000

జెడ్​ఎక్స్​- రూ. 14,89,900

వీ సీవీటీ- రూ. 13,20,900

వీఎక్స్​ సీవీటీ- రూ. 14,59,900

జెడ్​ఎక్స్​- రూ. 15,99,900

డెలివరీలు షురూ..

Honda Elevate on road price Hyderabad : ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ ఉంది. కానీ హోండా​కు ఈ సెగ్మెంట్​లో ఒక్క మోడల్​ కూడా లేదు. ఈ లోటు భర్తీ చేసేందుకు ఎలివేట్​పై గట్టిగానే ఫోకస్​ చేసింది ఆటోమొబైల్​ సంస్థ. జులైలో ఈ మోడల్​ను ఆవిష్కరించింది. ఇక తాజాగా.. ఎలివేట్​ ఎస్​యూవీని లాంచ్​ చేసి, డెలివరీలను సైతం మొదలుపెట్టింది. అంతేకాకుండాా.. 2026 నాటికి హోండా ఎలివేట్​ ఎస్​యూవీని కూడా లాంచ్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది.

ఇక ఈ హోండా ఎలివేట్​ ఎస్​యూవీ.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, హ్యుందాయ్​ క్రేటా వంటి మోడల్స్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హైదరాబాద్​లో హోండా ఎలివేట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలియాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం