Bajaj Auto CNG bikes : 'ఇక రోడ్డు మీదకి సీఎన్​జీ బైక్స్’- బజాజ్​ ఆటో-automobile news bajaj auto to launch cng bikes soon check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Auto Cng Bikes : 'ఇక రోడ్డు మీదకి సీఎన్​జీ బైక్స్’- బజాజ్​ ఆటో

Bajaj Auto CNG bikes : 'ఇక రోడ్డు మీదకి సీఎన్​జీ బైక్స్’- బజాజ్​ ఆటో

Sharath Chitturi HT Telugu
Feb 02, 2024 06:38 AM IST

Bajaj Auto bikes latest news : ఇప్పటివరకు సీఎన్​జీ ఆటోలు, సీఎన్​జీ కార్లను చూసి ఉంటారు. ఇక ఇప్పుడు.. ఇండియాలో సీఎన్​జీ బైక్స్​ని కూడా చూడబోతున్నారు! బజాజ్​ ఆటో సంస్థ నుంచి పలు సీఎన్​జీ బైక్స్​.. లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలు..

'ఇక రోడ్డు మీదకి సీఎన్​జీ బైక్స్’- బజాజ్​ ఆటో
'ఇక రోడ్డు మీదకి సీఎన్​జీ బైక్స్’- బజాజ్​ ఆటో (Representative image)

Bajaj Auto CNG bikes launch : దేశంలో అతిపెద్ద బైక్స్​ తయారీ సంస్థగా బజాజ్​ ఆటో.. సీఎన్​జీ మోటార్​సైకిల్స్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాటు చేసుకుంటోంది. ఇవి.. 2025 ఆర్థిక ఏడాదిలోనే మార్కెట్​లోకి అడుగుపెడతాయని సమాచారం. ఈ బైక్స్​.. అటు పెట్రోల్​తో పాటు ఇటు సీఎన్​జీపైనా నడుస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ బజాజ్​ ఆటో సీఎన్​జీ బైక్స్​పై ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బజాజ్​ ఆటో సీఎన్​జీ బైక్స్​..

3 వీలర్​ సీఎన్​జీ వెహికల్స్​లో గ్రాండ్​గా సక్సెస్​ అయిన సంస్థ బజాజ్​ ఆటో. ఇక ఇప్పుడు.. 2 వీలర్​ సీఎన్​జీ బైక్స్​పై ఫోకస్​ చేసింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలే రచించినట్టు కనిపిస్తోంది. ఈ సరికొత్త సీఎన్​జీ బైక్స్​ కోసం ప్రత్యేకంగా ఓ బ్రాండ్​ని సృష్టిస్తున్నట్టు.. బజాజ్​ ఆటో ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ రాకేశ్​ శర్మ తెలిపారు.

అయితే.. పెట్రోల్​ ఆధారిత బైక్స్​తో పోల్చుకుంటే.. ఈ సీఎన్​జీ 2 వీలర్​ వెహికల్స్​ ధర కాస్త ఎక్కువే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. మేన్యుఫ్యాక్చరింగ్​ ప్రాసెస్​ ఎక్కువగా ఉండటం ఇందుకు ఓ కారణం. సీఎన్​జీ బైక్స్​ కోసం ఫ్యూయెల్​ ట్యాంక్స్​ని ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ ఫ్యూయెల్​ ట్యాంక్​లో పెట్రోల్​, సీఎన్​జీ.. రెండు ఆప్షన్స్​ ఉండాలి. ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎలాంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

Bajaj Auto CNG bikes launch date : మరి.. ఈ సీఎన్​జీ బైక్స్​ పూర్తిగా కొత్తగా ఉంటాయా? లేక ఇప్పుడున్న బైక్ మోడల్స్​కి సీఎన్​జీ టచ్​ ఇస్తుందా? అన్న క్లారిటీ ప్రస్తుతం లేదు. ప్రస్తుతం మార్కెట్​లో అనేక సీఎన్​జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని.. ఐసీఈ ఇంజిన్​ మోడల్స్​కి సీఎన్​జీ టచ్​ ఇచ్చినవే!

అయితే.. ఒక్క బైక్​ లాంచ్​ చేసి, దానికి ఎంతటి ఆదరణ లభిస్తోంది? అని చూసి, మరో బైక్​ని రూపొందించడం కాకుండా.. వరుసగా సీఎన్​జీ బైక్స్​ని తయారు చేసి, వాటిని మార్కెట్​లో విడుదల చేయాలన్న స్ట్రాటజీతో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యూయెల్​ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని.. ఈ సీఎన్​జీ బైక్స్​ని రూపొందిస్తున్నట్టు శర్మ తెలిపారు.

Bajaj Auto latest bikes launch : "ఒక్క బైక్​ని మాత్రమే లాంచ్​ చేయడం లేదు. ఈ సెగ్మెంట్​లో వివిధ బైక్స్​ని లాంచ్​ చేస్తున్నాము. సీఎన్​జీ మోటార్​సైకిల్స్​ కోసం ప్రత్యేకంగా ఓ పోర్ట్​ఫోలియో ఉండాలన్నది మా ఆలోచన," అని శర్మ వివరించారు.

బజాజ్​ ఆటో సీఎన్​జీ బైక్స్​ ఎలా ఉంటాయి? అన్న విషయంపై.. బైక్​ లవర్స్​లో ఆసక్తి నెలకొంది. టెక్నాలజీ, డిజైన్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఎప్పుడు రివీల్​ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. వీటిపై అప్డేట్స్​ రాగానే.. మేము మీకు చెబుతాము. స్టే ట్యూన్డ్​ టూ హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు.

సంబంధిత కథనం