Bajaj Auto Q3 results: బజాజ్ ఆటో క్యూ3 ఫలితాలు.. 37 శాతం పెరిగిన నికర లాభం
Bajaj Auto Q3 results: బజాజ్ ఆటో బుధవారం క్యూ3 ఫలితాలను విడుదల చేసింది. డిసెంబర్ 2023 త్రైమాసికంలో నికర లాభం 37 శాతం పెరిగినట్టు నివేదించింది.
Bajaj Auto Q3 results: ప్రముఖ త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో డిసెంబర్ 2023 త్రైమాసికంలో టాప్ బ్రోకరేజీ సంస్థలు చేసిన అంచనాలను మించింది. 37 శాతం నికర లాభం వృద్ధిని నమోదు చేసింది.
త్రైమాసిక ఫలితాల్లో బజాజ్ ఆటో నికర లాభం 37 శాతం పెరిగి రూ. 2,042 కోట్లుగా నమోదైంది. మూడో త్రైమాసికంలో బజాజ్ ఆటో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 26 శాతం పెరిగి రూ.12,113.51 కోట్లుగా నమోదైంది.
2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఆటో నికర లాభం 32 శాతం పెరుగుతుందని బ్రోకరేజీలు, మీడియా పోల్స్ అంచనా వేశాయి. అయితే ఈ త్రైమాసికంలో లాభాల మార్జిన్లు అంచనాలను మించిపోయాయి.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో బజాజ్ ఆటో రూ.1,491 కోట్ల నికర లాభాన్ని, కార్యకలాపాల ద్వారా రూ. 9,315 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
మార్చి 2024 తో ముగిసే ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో బజాజ్ ఆటో యొక్క ఇబిటా 36.8% పెరిగి రూ. 2,430 కోట్లకు చేరుకుంది.
కాగా బజాజ్ ఆటో షేర్ ధర బుధవారం స్టాక్ మార్కెట్లో 1.55 శాతం పెరిగి రూ. 7,205.75కు చేరుకుంది.