Hero Xtreme 125R vs TVS Raider 125 : ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ?
Hero Xtreme 125R on road price Hyderabad : హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ వర్సెస్ టీవీఎస్ రైడర్ 125.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
Hero Xtreme 125R vs TVS Raider 125 : హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి ఓ కొత్త బైక్ ఇటీవలే మార్కెట్లో అడుగుపెట్టింది. దాని పేరు హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్. ఈ బైక్.. టీవీఎస్ రైడర్ 125కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము.
హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ వర్సెస్ టీవీఎస్ రైడర్ 125- ఫీచర్స్..
హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ లుక్స్ షార్ప్‌గా బోల్డ్‌గా ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ డిజైన్ యునీక్‌గా ఉంది. ఫ్యుయెల్ ట్యాంక్ డిజైన్ అగ్రెసివ్‌గా ఉంది. ఇందులో.. స్ల్పిట్ సీట్స్, స్పోర్టీ గ్రాబ్ రెయిల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, ఎల్సీడీ డిస్ప్లే వంటివి వస్తాయి.
ఇక టీవీఎస్ రైడర్ 125లో స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, సరికొత్త ఆల్- ఎల్ఈడీ లైటింగ్ సెటప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజైనర్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి. ఇందులో సింగిల్ సీట్ ఉంటుంది.
Hero Xtreme 125R price in Hyderabad : సెఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్ ఫ్రెంట్లో డిస్క్ బ్రేక్స్, రేర్‌లో డ్రమ్ బ్రేక్స్ లభిస్తున్నాయి. రెండింట్లోనూ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ వస్తుంది. సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో మోనో షాక్ యూనిట్స్ ఉన్నాయి.
హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ వర్సెస్ టీవీఎస్ రైడర్ 125- ఇంజిన్..
హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్‌లో సరికొత్త 125సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 11.5 హెచ్‌పీ పవర్‌ని, 10.5 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
TVS Raider 125 on road price Hyderabad : ఇక టీవీఎస్ రైడర్ 125లో 14.8 సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 15.3 హెచ్‌పీ పవర్‌ని, 11.2 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
రెండు బైక్స్‌లోనూ.. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తోంది.
హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ వర్సెస్ టీవీఎస్ రైడర్ 125- ధరలు..
Latest bikes launch : ఇండియాలో హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ ఎక్స్‌షోరూం ధర రూ. 95వేలు- రూ. 99,500 మధ్యలో ఉంది. ఇక టీవీఎస్ రైడర్ 125 ఎక్స్‌షోరూం ధర రూ. 95,200- రూ. 1.03లక్షల మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం